గత మూడు దశాబ్దాల్లో దేశ రాజకీయాల్లో జరిగిన మార్పులు ఎన్నో సామాజిక ఆర్థిక మార్పులకు దారితీశాయి. ముఖ్యంగా ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక, సామాజిక స్టీగతులను మలుపు తిప్పాయి. మనిషి ఆలోచనవిధానంలో మార్పులు తీసుకు వచ్చాయి. సంపన్నులకు పేదలకు మధ్య వ్యత్యాసం పెరిగిన మాట నిజమే కానీ మార్కెట్ వ్యవస్థ సామాన్యుడి జీవితంలోకి కూడా చొచ్చుకుపోయి అతడిని పోటీ ప్రపంచంలోకి లాగిన మాట కూడా నిజమే. మనిషి జీవితంలో సంఘర్షణ పెరిగింది. సంక్లిష్టత పెరిగింది. మానవ సంబంధాలు మారిపోయాయి. రాజకీయాల అర్థం మారిపోయింది. ఆర్థిక సంస్కరణల తర్వాత రాజకీయ పార్టీల మధ్య సైద్దాంతిక వ్యత్యాసాలు తగ్గిపోయాయి.
- ఎ. కృష్ణరావు