వేట
వీధి వైపున తెల్లటి గోడకు దీగూడు... ముత్తయిదువ నొసటన పెట్టుకున్న చుక్కబొట్టులా కనిపిస్తోంది. ఆ దీగూటికి పైన ఒక పెద్ద బల్లి. దానికి కొంత దూరంలో వాలి వున్న ఈగ దాపుకు మెల్లగా జరిగి, చటుక్కున ఆ ఈగను నోట కరచుకుని చూరు కిందికి పరిగెత్తింది.
ఉదయాన, గుడిసె ముందర కూర్చొని ఆ దృశ్యాన్నే చూస్తున్న వెంకటస్వామి మనసులో | ఏదో ఆటవిక న్యాయం తళుక్కుమంది.
ఇంతలో తిరుపతి - మదనపల్లె అన్న బోర్డును ముఖానికంటించుకొని, కంకర తెలిన రోడ్డుమీద దడదడ శబ్దం చేసుకుంటూ స్పీడుగా పీలేరు వైపుకు వెళ్లిపోయింది. ఒక ఆర్టీసీ బస్సు. అది పోయినప్పుడు లేచిన దుమ్ముకు క్షణకాలం కళ్ళు మూసుకొని తెరిచాడు వెంకటస్వామి. కంకరరాళ్ళతో.. బొచ్చు ఊడిపోయిన గజ్జికుక్క చర్మంలా వికారంగా కనిపించింది. రోడ్డు.
చాలా సేపట్నుంచీ అతను అక్కడే కూర్చోనున్నాడు. చూస్తుండగానే తూర్పున పొద్దు బారెడెక్కింది. వచ్చిపోయే వాహనాలతో రోడ్లు సందడిగా మారిపోయింది. ఆ ఊరికి రోడ్డూ అదే, వీధీ అదే.
“వొగబ్బుడు ఆ రోడ్లో గంటకో, రెండు గంట్లకో... ఒకటి లెక్కన బస్సులూ లారీలు 'పోతా వుండె, వసా వుండె, యిప్పుడు దీని కతే మారిపాయ," ఆ రోడ్డును చూస్తూ అనుకున్నాడతను.
ఆ రోడ్డుకానుకొని ఒక వైపున యాభై దాకా గుడిసెలున్నాయి. వాటన్నిటికీ కలిపి బాటకాడపల్లె' అని పేరు.
గత గవర్నమెంటు ఆ పల్లెలో సగం మందికి రోడ్డుకవతల ఎడంగా, కాలనీ యిండ్లు కట్టించింది. మిగిలిన సగం మందికి రెండో విడతలో కట్టిస్తామని హామీ యిచ్చింది. ఇంతలో ఆగవర్నమెంటు ఎన్నికల్లో ఓడిపోయి గద్దె దిగడం, కొత్త ప్రభుత్వ పరిపాలనలోకి రావడం, జయాన్ని అధికారులు మరచిపోవడం కూడా ఎప్పుడో జరిగిపోయింది. ఇదేమి న్యాయం
గితే మాత్రం తప్పకుండా కట్టిస్తాం అంటున్నారేగాని కట్టించింది లేదు. కటిచిన మండ్లకయినా సరయిన గాలిగానీ, వెలుతురుగానీ లేవు. నాసిరకం కట్టడాలు. అవి ఎప్పుడ..................
వేట వీధి వైపున తెల్లటి గోడకు దీగూడు... ముత్తయిదువ నొసటన పెట్టుకున్న చుక్కబొట్టులా కనిపిస్తోంది. ఆ దీగూటికి పైన ఒక పెద్ద బల్లి. దానికి కొంత దూరంలో వాలి వున్న ఈగ దాపుకు మెల్లగా జరిగి, చటుక్కున ఆ ఈగను నోట కరచుకుని చూరు కిందికి పరిగెత్తింది. ఉదయాన, గుడిసె ముందర కూర్చొని ఆ దృశ్యాన్నే చూస్తున్న వెంకటస్వామి మనసులో | ఏదో ఆటవిక న్యాయం తళుక్కుమంది. ఇంతలో తిరుపతి - మదనపల్లె అన్న బోర్డును ముఖానికంటించుకొని, కంకర తెలిన రోడ్డుమీద దడదడ శబ్దం చేసుకుంటూ స్పీడుగా పీలేరు వైపుకు వెళ్లిపోయింది. ఒక ఆర్టీసీ బస్సు. అది పోయినప్పుడు లేచిన దుమ్ముకు క్షణకాలం కళ్ళు మూసుకొని తెరిచాడు వెంకటస్వామి. కంకరరాళ్ళతో.. బొచ్చు ఊడిపోయిన గజ్జికుక్క చర్మంలా వికారంగా కనిపించింది. రోడ్డు. చాలా సేపట్నుంచీ అతను అక్కడే కూర్చోనున్నాడు. చూస్తుండగానే తూర్పున పొద్దు బారెడెక్కింది. వచ్చిపోయే వాహనాలతో రోడ్లు సందడిగా మారిపోయింది. ఆ ఊరికి రోడ్డూ అదే, వీధీ అదే. “వొగబ్బుడు ఆ రోడ్లో గంటకో, రెండు గంట్లకో... ఒకటి లెక్కన బస్సులూ లారీలు 'పోతా వుండె, వసా వుండె, యిప్పుడు దీని కతే మారిపాయ," ఆ రోడ్డును చూస్తూ అనుకున్నాడతను. ఆ రోడ్డుకానుకొని ఒక వైపున యాభై దాకా గుడిసెలున్నాయి. వాటన్నిటికీ కలిపి బాటకాడపల్లె' అని పేరు. గత గవర్నమెంటు ఆ పల్లెలో సగం మందికి రోడ్డుకవతల ఎడంగా, కాలనీ యిండ్లు కట్టించింది. మిగిలిన సగం మందికి రెండో విడతలో కట్టిస్తామని హామీ యిచ్చింది. ఇంతలో ఆగవర్నమెంటు ఎన్నికల్లో ఓడిపోయి గద్దె దిగడం, కొత్త ప్రభుత్వ పరిపాలనలోకి రావడం, జయాన్ని అధికారులు మరచిపోవడం కూడా ఎప్పుడో జరిగిపోయింది. ఇదేమి న్యాయం గితే మాత్రం తప్పకుండా కట్టిస్తాం అంటున్నారేగాని కట్టించింది లేదు. కటిచిన మండ్లకయినా సరయిన గాలిగానీ, వెలుతురుగానీ లేవు. నాసిరకం కట్టడాలు. అవి ఎప్పుడ..................© 2017,www.logili.com All Rights Reserved.