భారతదేశ చరిత్ర రచనపై బ్రాహ్మణీయ భావజాల ప్రభావం అధికంగా ఉంది. దాని ఫలితంగా అట్టడుగు కులాలకూ, వర్గాలకూ చెందిన ఎందరో సామజిక విప్లవకారుల కృషి మరుగున పడిపోయింది. ఆలస్యంగానైనా మనకు అందుబాటులోకి వచ్చిన ఉద్యమకారుల జీవిత చరిత్రల్లో సావిత్రీబాయి జీవితానికి గొప్ప ప్రాధాన్యత ఉన్నది. ఆధునిక భారతదేశంలో మొట్టమొదటిసారిగా బ్రాహ్మణీయ కులతత్వ సంస్కృతి, మత వ్యవస్థలపై యుద్ధాన్ని ప్రకటించిన వ్యక్తులు జ్యోతిరావు ఫూలే, ఆయన భార్య సావిత్రీబాయి. విద్యకు వెలియైన ప్రజలకోసం విద్యాలయాలను నిర్మించారు. విద్యను పీడితుల చేతి ఆయుధంగా మలిచారు. ఆ విశేషాలన్నిటినీ ఈ పుస్తకం వివరిస్తుంది.
జ్యోతిబాఫూలే సహచరిగా ఆయన ఉద్యమ జీవితంలో తోడుగా నిలవటమేగాక తనదైన స్వతంత్ర వ్యక్తిత్వాన్నీ, సాహితీ ప్రతిభనూ రూపొందించుకున్న వ్యక్తి సావిత్రీబాయి. నిబద్ధతతో ఉద్యమించిన మహిళల తొలిగురువు సావిత్రీబాయిని స్మరించుకోవడం సముచితంగా ఉంటుంది. ఈ పుస్తక రచయిత కాత్యాయని అనువాదకురలిగా తెలుగు పాఠకులకు సుపరిచితురాలు. పలు నవలలు సాహిత్య పుస్తకాలను తెలుగులోకి అనువదించారు. "చూపు" పత్రికను నిర్వహించారు.
భారతదేశ చరిత్ర రచనపై బ్రాహ్మణీయ భావజాల ప్రభావం అధికంగా ఉంది. దాని ఫలితంగా అట్టడుగు కులాలకూ, వర్గాలకూ చెందిన ఎందరో సామజిక విప్లవకారుల కృషి మరుగున పడిపోయింది. ఆలస్యంగానైనా మనకు అందుబాటులోకి వచ్చిన ఉద్యమకారుల జీవిత చరిత్రల్లో సావిత్రీబాయి జీవితానికి గొప్ప ప్రాధాన్యత ఉన్నది. ఆధునిక భారతదేశంలో మొట్టమొదటిసారిగా బ్రాహ్మణీయ కులతత్వ సంస్కృతి, మత వ్యవస్థలపై యుద్ధాన్ని ప్రకటించిన వ్యక్తులు జ్యోతిరావు ఫూలే, ఆయన భార్య సావిత్రీబాయి. విద్యకు వెలియైన ప్రజలకోసం విద్యాలయాలను నిర్మించారు. విద్యను పీడితుల చేతి ఆయుధంగా మలిచారు. ఆ విశేషాలన్నిటినీ ఈ పుస్తకం వివరిస్తుంది. జ్యోతిబాఫూలే సహచరిగా ఆయన ఉద్యమ జీవితంలో తోడుగా నిలవటమేగాక తనదైన స్వతంత్ర వ్యక్తిత్వాన్నీ, సాహితీ ప్రతిభనూ రూపొందించుకున్న వ్యక్తి సావిత్రీబాయి. నిబద్ధతతో ఉద్యమించిన మహిళల తొలిగురువు సావిత్రీబాయిని స్మరించుకోవడం సముచితంగా ఉంటుంది. ఈ పుస్తక రచయిత కాత్యాయని అనువాదకురలిగా తెలుగు పాఠకులకు సుపరిచితురాలు. పలు నవలలు సాహిత్య పుస్తకాలను తెలుగులోకి అనువదించారు. "చూపు" పత్రికను నిర్వహించారు.© 2017,www.logili.com All Rights Reserved.