ఈ పుస్తకంలోని వ్యాసాలు 1981 ప్రాంతంలో సీరియల్ గా 'హేతువాదం' పత్రికలో వచ్చాయి. మొదటి ముద్రణ 1983లో ఒక గ్రంధంగా వెలువడిన తరువాత ఆంద్ర సాహిత్యలోకంలో సంచలనం కలిగింది. కారణం మార్క్సిస్ట్ వ్యాఖ్యానం అప్పటికి ప్రసిద్దిలో ఉంది.తెలుగు సాహితీ వైతాళికులుగా ప్రసిద్ది చెందిన వీరి మీద సామజిక, హేతువాద కోణంతో వచ్చిన మొదటి వ్యాఖ్యానం ఇది. దానికి 56 సంస్కృత కళాశాలల్లోని సాంప్రదాయక పండితుల్లో కలకలం రేగింది. మన పునాదులు కూలిపోతున్నాయని వారు వాపోయేవారు. సమాజంలోనూ, విద్యార్దుల్లోను నాకు ఉన్న మద్దతు వీటన్నింటిని జయించే ఆత్మస్థయిర్యాన్ని కలుగజేసింది. ముఖ్యంగా సాహిత్య విమర్శంటే ఆకాశానికి కవిని, రచయితను ఎత్తడం కాకుండా, సామాజిక సాంస్కృతిక కోణం నుండి చూసి విశ్లేషించే పద్ధతి ఇందులో పరిపుష్టం అయ్యింది. ఈ పుస్తకం వచ్చాక ఇదొక దృక్పధంగా, ఇదొక విశ్లేషణా పద్దతిగా ప్రచారంలోకి రావడం, విశ్వవిద్యాలయాల్లో విద్యార్దుల్లో కరకమలంగా ఈ పుస్తక కుసుమం పరిమలించడం నాకు ఆనందాన్నిచ్చింది.
..... కత్తి పద్మారావు
ఈ పుస్తకంలోని వ్యాసాలు 1981 ప్రాంతంలో సీరియల్ గా 'హేతువాదం' పత్రికలో వచ్చాయి. మొదటి ముద్రణ 1983లో ఒక గ్రంధంగా వెలువడిన తరువాత ఆంద్ర సాహిత్యలోకంలో సంచలనం కలిగింది. కారణం మార్క్సిస్ట్ వ్యాఖ్యానం అప్పటికి ప్రసిద్దిలో ఉంది.తెలుగు సాహితీ వైతాళికులుగా ప్రసిద్ది చెందిన వీరి మీద సామజిక, హేతువాద కోణంతో వచ్చిన మొదటి వ్యాఖ్యానం ఇది. దానికి 56 సంస్కృత కళాశాలల్లోని సాంప్రదాయక పండితుల్లో కలకలం రేగింది. మన పునాదులు కూలిపోతున్నాయని వారు వాపోయేవారు. సమాజంలోనూ, విద్యార్దుల్లోను నాకు ఉన్న మద్దతు వీటన్నింటిని జయించే ఆత్మస్థయిర్యాన్ని కలుగజేసింది. ముఖ్యంగా సాహిత్య విమర్శంటే ఆకాశానికి కవిని, రచయితను ఎత్తడం కాకుండా, సామాజిక సాంస్కృతిక కోణం నుండి చూసి విశ్లేషించే పద్ధతి ఇందులో పరిపుష్టం అయ్యింది. ఈ పుస్తకం వచ్చాక ఇదొక దృక్పధంగా, ఇదొక విశ్లేషణా పద్దతిగా ప్రచారంలోకి రావడం, విశ్వవిద్యాలయాల్లో విద్యార్దుల్లో కరకమలంగా ఈ పుస్తక కుసుమం పరిమలించడం నాకు ఆనందాన్నిచ్చింది. ..... కత్తి పద్మారావు© 2017,www.logili.com All Rights Reserved.