ఒక వేద పండితుడు గోదావరిలో స్నానమాచరిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఫై శ్లోకం పఠించి పూజలొనరిస్తుంటే ఆ శ్లోకంలోని కాటన్ అన్న పదం వినబడి ఆ దారిన గుర్రం మీద వెళుతున్న తెల్లదొర ఒక్కసారిగా గుర్రాన్ని నిలిపి ఆ పండితుని పిలిచి దాని అర్ధమేమిటని ప్రశ్నిస్తాడు. పవిత్ర గోదావరి జలాలతో అనుదినం స్థానపాదులాచరించగల పుణ్యఫలాన్ని మాకు ప్రసాదించిన మహానుభావుడు భగీరథతుల్యుడు ఆంగ్లదేశీయుడైన కాటన్ ను స్మరిస్తున్నాను అని దానార్దాన్ని వేద పండితుడని చెబుతాడు. అంతట ఆ తెల్లదొర కాటన్ జీతం తీసుకోని పనిచేసే ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఆనకట్టలు కట్టి కాల్వలు త్రవ్వి పంటలకు నీరందించడం అయన ఉద్యోగి దర్మం. అయన తన విద్యుక్త ధర్మాన్ని మాత్రమే నిర్వర్తించాడు. అంత మాత్రానికే మీరాయనకు దేవునిగా భావించి ఆరాధించాలి? అని అంటాడు.
- మువ్వల సుబ్బరామయ్య