సాహిత్య తోరణాలు పేరిట మువ్వల సుబ్బరామయ్య గారు అందిస్తున్న సంపుటి ఇది. జయంతి పబ్లికేషన్స్ కు అటు ప్రచురణ రంగంలోనూ ఇటు సాహిత్యరంగంలోనూ గల పేరు ప్రఖ్యాతలు తక్కువేమీ కాదు. గతంలో కూడా మువ్వల అనేక సాహిత్య సంబంధ అంశాల మీద గ్రంథాలు రాశారు. పబ్లిషింగ్ రంగంలోని ఒడిదుడుకులు, సమాజంలో వచ్చిన పరిణామాలు, ఇతర మార్పులు ఏవైనప్పటికీ అనేక ప్రచురణ సంస్థలు క్రమేణా కనుమరుగయ్యాయి. కొన్ని అవుతూ ఉన్నాయి. జయంతి పబ్లికేషన్స్ కు గల ఖ్యాతిని దృష్టిలో ఉంచుకొని కొన్నైనా ఇటువంటి ప్రచురణలు వెలువరించడం సుబ్బరామయ్య గారు విధిగా పాటిస్తూ వస్తున్నారు.
పుస్తకాల మీద ప్రేమ, సాహిత్యం పట్ల అభిరుచి దశాబ్దాలుగా జీవితం ఈ రంగానికే అంకితం కావటం, కారణం ఎదైతేనేమీ రచయిత ఇటువంటి కృషిని ఓపినంతమేరకు కొనసాగిస్తున్నారు. ఇందులో గల తొలి రెండు వ్యాసాలూ సాహిత్య సంబందితమైనవే అయినా కొంచెం భిన్నం. మొదటిది సాహితీభోజనాలు, రెండవది సాహితీ కలహభోజనాలు. ఈ రెండూ రుచిని, అభిరుచిని పెంపొందించేవిగా ఉన్నాయి. మరెన్నో వ్యాసాలు ఈ పుస్తకం ద్వారా మీరు తెలుసుకొనగలరు.
సాహిత్య తోరణాలు పేరిట మువ్వల సుబ్బరామయ్య గారు అందిస్తున్న సంపుటి ఇది. జయంతి పబ్లికేషన్స్ కు అటు ప్రచురణ రంగంలోనూ ఇటు సాహిత్యరంగంలోనూ గల పేరు ప్రఖ్యాతలు తక్కువేమీ కాదు. గతంలో కూడా మువ్వల అనేక సాహిత్య సంబంధ అంశాల మీద గ్రంథాలు రాశారు. పబ్లిషింగ్ రంగంలోని ఒడిదుడుకులు, సమాజంలో వచ్చిన పరిణామాలు, ఇతర మార్పులు ఏవైనప్పటికీ అనేక ప్రచురణ సంస్థలు క్రమేణా కనుమరుగయ్యాయి. కొన్ని అవుతూ ఉన్నాయి. జయంతి పబ్లికేషన్స్ కు గల ఖ్యాతిని దృష్టిలో ఉంచుకొని కొన్నైనా ఇటువంటి ప్రచురణలు వెలువరించడం సుబ్బరామయ్య గారు విధిగా పాటిస్తూ వస్తున్నారు. పుస్తకాల మీద ప్రేమ, సాహిత్యం పట్ల అభిరుచి దశాబ్దాలుగా జీవితం ఈ రంగానికే అంకితం కావటం, కారణం ఎదైతేనేమీ రచయిత ఇటువంటి కృషిని ఓపినంతమేరకు కొనసాగిస్తున్నారు. ఇందులో గల తొలి రెండు వ్యాసాలూ సాహిత్య సంబందితమైనవే అయినా కొంచెం భిన్నం. మొదటిది సాహితీభోజనాలు, రెండవది సాహితీ కలహభోజనాలు. ఈ రెండూ రుచిని, అభిరుచిని పెంపొందించేవిగా ఉన్నాయి. మరెన్నో వ్యాసాలు ఈ పుస్తకం ద్వారా మీరు తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.