మీ చేతుల్లో పుచ్చుకున్న ఈ గ్రంథం మత చరిత్రలో ఒక విశిష్ట స్థానాన్ని సంతరించుకొన్నది. వేదకాలం నుండి మతచరిత్రను పరికిస్తే స్త్రీలకు ప్రత్యేక స్థానం ఉంటూ వచ్చిందని తేటతెల్లమవుతుంది. ఒకరి తర్వాత ఒకరుగా అసంఖ్యాక భక్తురాండ్రూ, కర్మవీరాంగనలూ, యోగినులూ, జ్ఞానులూ అవతరించి ప్రపంచ మత చరిత్రను సుసంపన్నం చేశారనడం నిర్వివాదాంశం. కాని ఈ గ్రంథం భక్తురాలుగా, కర్మవీరాంగనగా, యోగినిగా, జ్ఞానిగా జీవించి తరించిన ఒక మహిళారత్నం జీవితగాథ.
అంతేకాదు ఆవిడ వివాహిత. భర్తకు తగిన భార్యగా ఆమె జీవించారు, కాని కన్యగానే జీవితం గడిపారు. కన్యగా జీవించినప్పటికీ, 'అమ్మా, అమ్మా' అని వేలాదిమంది సంబోధించే రీతిలో తల్లిగా మెలగి జీవించారు. అసాధారణమైన కుటుంబ పరిస్థితులలో జీవించారు. అయినా సన్యాస చక్రవర్తులను ఉత్పన్నం చేసే సన్యాస నిలయంగా విరాజిల్లారు. ఈ రకంగా ద్వంద్వాలైన సమస్థాన్ని మేళవించి అలరారింది ఆమె మాతృత్వ భావన. ఆమె మహాజ్జీవనం మూలంగా స్త్రీతత్వం పావనమైనది, భార్య అనే స్థానం గౌరవాన్ని సంతరించుకొంది, మాతృత్వం విశిష్ట స్థానాన్ని పొందింది. అవును, మాతృమూర్తి శ్రీ శారదాదేవి జీవితం ఒక అద్భుతం!
మీ చేతుల్లో పుచ్చుకున్న ఈ గ్రంథం మత చరిత్రలో ఒక విశిష్ట స్థానాన్ని సంతరించుకొన్నది. వేదకాలం నుండి మతచరిత్రను పరికిస్తే స్త్రీలకు ప్రత్యేక స్థానం ఉంటూ వచ్చిందని తేటతెల్లమవుతుంది. ఒకరి తర్వాత ఒకరుగా అసంఖ్యాక భక్తురాండ్రూ, కర్మవీరాంగనలూ, యోగినులూ, జ్ఞానులూ అవతరించి ప్రపంచ మత చరిత్రను సుసంపన్నం చేశారనడం నిర్వివాదాంశం. కాని ఈ గ్రంథం భక్తురాలుగా, కర్మవీరాంగనగా, యోగినిగా, జ్ఞానిగా జీవించి తరించిన ఒక మహిళారత్నం జీవితగాథ. అంతేకాదు ఆవిడ వివాహిత. భర్తకు తగిన భార్యగా ఆమె జీవించారు, కాని కన్యగానే జీవితం గడిపారు. కన్యగా జీవించినప్పటికీ, 'అమ్మా, అమ్మా' అని వేలాదిమంది సంబోధించే రీతిలో తల్లిగా మెలగి జీవించారు. అసాధారణమైన కుటుంబ పరిస్థితులలో జీవించారు. అయినా సన్యాస చక్రవర్తులను ఉత్పన్నం చేసే సన్యాస నిలయంగా విరాజిల్లారు. ఈ రకంగా ద్వంద్వాలైన సమస్థాన్ని మేళవించి అలరారింది ఆమె మాతృత్వ భావన. ఆమె మహాజ్జీవనం మూలంగా స్త్రీతత్వం పావనమైనది, భార్య అనే స్థానం గౌరవాన్ని సంతరించుకొంది, మాతృత్వం విశిష్ట స్థానాన్ని పొందింది. అవును, మాతృమూర్తి శ్రీ శారదాదేవి జీవితం ఒక అద్భుతం!© 2017,www.logili.com All Rights Reserved.