"మీ మనస్సులను పావనం చేయగోరితే శ్రీ శారదాదేవి జీవితాన్ని, ఆమె మహాత్వాన్నీ గురించి చింతన చేస్తూ ఉండండి. దానికి మించిన ఉత్కృష్ట ఆధ్యాత్మిక శా మరొకటి లేదు" అని ఒక సుప్రసిద్ధ తాత్వికుడు వ్యాఖ్యానించాడు. ఒక స్త్రీ జీవితం చెప్పక చెబుతుంది. కనుక మాతృదేవి జీవితాన్ని ప్రగాఢంగా చింతన చేయడం మనస్సును పావనం చేసే ఆధ్యాత్మిక సాధన అనడం అతిశయోక్తి కాదు. జీవితంలో ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితులను పొందడానికి ఇది మార్గాంతరంగా భాసిస్తుంది. ఆ మార్గాంతరమే ఈ 'వచనామృతం'. మాతృదేవి తమ బిడ్డలతో చేసిన సంభాషణలు ఈ గ్రంథంలో పొందుపరచబడ్డాయి. వీరిలో స్త్రీలు, పురుషులు, గృహస్థులు, సన్యాసులు ఉన్నారు.
"మీ మనస్సులను పావనం చేయగోరితే శ్రీ శారదాదేవి జీవితాన్ని, ఆమె మహాత్వాన్నీ గురించి చింతన చేస్తూ ఉండండి. దానికి మించిన ఉత్కృష్ట ఆధ్యాత్మిక శా మరొకటి లేదు" అని ఒక సుప్రసిద్ధ తాత్వికుడు వ్యాఖ్యానించాడు. ఒక స్త్రీ జీవితం చెప్పక చెబుతుంది. కనుక మాతృదేవి జీవితాన్ని ప్రగాఢంగా చింతన చేయడం మనస్సును పావనం చేసే ఆధ్యాత్మిక సాధన అనడం అతిశయోక్తి కాదు. జీవితంలో ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితులను పొందడానికి ఇది మార్గాంతరంగా భాసిస్తుంది. ఆ మార్గాంతరమే ఈ 'వచనామృతం'. మాతృదేవి తమ బిడ్డలతో చేసిన సంభాషణలు ఈ గ్రంథంలో పొందుపరచబడ్డాయి. వీరిలో స్త్రీలు, పురుషులు, గృహస్థులు, సన్యాసులు ఉన్నారు.© 2017,www.logili.com All Rights Reserved.