కుమారి ఆర్. జయశ్రీ కాశీకర్
శ్రీ శ్రీపాద రాయలవారు కన్నడ దాస పరంపరను పరికించి చూచినప్పుడు మొట్టమొదట శ్రీ శ్రీపాద రాయల పుణ్య నామమును స్మరింప వలసివస్తుంది. పేరుకు తగినట్లే వారు విభవమూర్తులు. ప్రాతఃకాలము మేలుకున్న వెంటనే వారిని తలచుకున్నచో ఆ దినమున సకాలములో మృష్టాన్న భోజనము లభ్య మగునని భక్తుల విశ్వాసము. వారి కృతి మరియు ఆకృతిలో వారికి వారే సాటి. వారి పాండిత్యపు పరమావధిని తెలియడానికి వారి “వాగ్వజ” అనే గ్రంథమును పఠించటం అనివార్యము.శ్రీ శ్రీపాదరాజుల వారి తండ్రిగారి పేరు శేషగిరి ఆచార్యులు, తల్లిగారి పేరు
గిరియమ్మ. వారి తల్లి తండ్రులు అప్పటి మైసూరు జిల్లాలోని చెన్నపట్టణ తాలుకా అబ్బూరు అనే గ్రామ మందు కొబ్బరి, అరటి మున్నగు తోటలను పెంచుతూ, గో రక్షణము చేయుచూ, వాటితో వచ్చిన ఆదాయముతో ఉన్నంతలో తృప్తి చెంది, జీవనం గడిపేవారు. అట్టి పేద దంపతులకు 1422వ సంవత్సరము ఒక పుత్రుడు కలుగగా వారు అతనికి లక్ష్మినారాయణుడని నామకరణం చేసారు. లక్ష్మీ నారాయణుడే భవిష్యత్తులో శ్రీపాద రాయలుగా ఖ్యాతి చెందాడు.
లక్ష్మీ నారాయణుడు తన తండ్రి వద్ద విద్యాభ్యాసము చేస్తూ యింటి పనిలో వారికి సహాయపడేవాడు. దానికి తోడు రోజూ గోవులను మేపుకుని సాయం సమయమున చేరుకోవటం అతని దినచర్య. ఒకసారి కర్ణాటక రాష్ట్రమండలి...............
కుమారి ఆర్. జయశ్రీ కాశీకర్ శ్రీ శ్రీపాద రాయలవారు కన్నడ దాస పరంపరను పరికించి చూచినప్పుడు మొట్టమొదట శ్రీ శ్రీపాద రాయల పుణ్య నామమును స్మరింప వలసివస్తుంది. పేరుకు తగినట్లే వారు విభవమూర్తులు. ప్రాతఃకాలము మేలుకున్న వెంటనే వారిని తలచుకున్నచో ఆ దినమున సకాలములో మృష్టాన్న భోజనము లభ్య మగునని భక్తుల విశ్వాసము. వారి కృతి మరియు ఆకృతిలో వారికి వారే సాటి. వారి పాండిత్యపు పరమావధిని తెలియడానికి వారి “వాగ్వజ” అనే గ్రంథమును పఠించటం అనివార్యము. శ్రీ శ్రీపాదరాజుల వారి తండ్రిగారి పేరు శేషగిరి ఆచార్యులు, తల్లిగారి పేరు గిరియమ్మ. వారి తల్లి తండ్రులు అప్పటి మైసూరు జిల్లాలోని చెన్నపట్టణ తాలుకా అబ్బూరు అనే గ్రామ మందు కొబ్బరి, అరటి మున్నగు తోటలను పెంచుతూ, గో రక్షణము చేయుచూ, వాటితో వచ్చిన ఆదాయముతో ఉన్నంతలో తృప్తి చెంది, జీవనం గడిపేవారు. అట్టి పేద దంపతులకు 1422వ సంవత్సరము ఒక పుత్రుడు కలుగగా వారు అతనికి లక్ష్మినారాయణుడని నామకరణం చేసారు. లక్ష్మీ నారాయణుడే భవిష్యత్తులో శ్రీపాద రాయలుగా ఖ్యాతి చెందాడు. లక్ష్మీ నారాయణుడు తన తండ్రి వద్ద విద్యాభ్యాసము చేస్తూ యింటి పనిలో వారికి సహాయపడేవాడు. దానికి తోడు రోజూ గోవులను మేపుకుని సాయం సమయమున చేరుకోవటం అతని దినచర్య. ఒకసారి కర్ణాటక రాష్ట్రమండలి...............© 2017,www.logili.com All Rights Reserved.