గొప్పవారి జీవిత చరిత్రలు మనలో స్ఫూర్తిని రగిలిస్తాయి. వారి జీవితాల్లో జరిగిన సంఘటనలు, వాటిపట్ల వారు స్పందించిన తీరును ఆకళింపు చేసుకుంటే మన జీవితాలకు వాటిని అన్వయించుకుని మనకంటూ ఒక మార్గాన్ని ఏర్పరచుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అందుకే జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒక రోల్ మోడల్ ఉండాలి. అసాధారణ విజయాలను నమోదు చేసిన వ్యక్తుల జీవిత చరిత్రలను వారు స్వయంగా కానీ, ఇతరులు గానీ రాయడం సంప్రదాయంగా వస్తున్నదే. అయితే మహోన్నత వ్యక్తుల జీవితాన్ని మదించి, వారి వ్యక్తిత్వంలోని సుగుణాలను యువతరానికి స్ఫూర్తిదాయకంగా మలిచిన ప్రయత్నాలు మాత్రం తక్కువే అని చెప్పాలి.
తెలుగుదేశంలో చంద్రబాబు చేరిక మొదలు నేటి వరకు ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ఆసక్తితో గమనిస్తున్న వారిలో నేను ఒకణ్ణి. ఆ ఆసక్తితో పాటు ఆయన జీవితం ఆధారంగా వ్యక్తిత్వవికాస పాఠాలను చెప్పవచ్చనే ఉత్సాహంతోనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వాన్ని విశ్లేషించే ప్రయత్నం ఇక్కడ చేస్తున్నాను. నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఆయన వేస్తున్న అభివృద్ధి ప్రణాలికలు కొత్త రాష్ట్రానికి కొత్త ఊపిరులూదుతున్నాయి. ఇవన్నీ అభివృద్ధి మాంత్రికుడు అధ్యానంలో చర్చించాను.
- డా టి ఎస్ రావు
గొప్పవారి జీవిత చరిత్రలు మనలో స్ఫూర్తిని రగిలిస్తాయి. వారి జీవితాల్లో జరిగిన సంఘటనలు, వాటిపట్ల వారు స్పందించిన తీరును ఆకళింపు చేసుకుంటే మన జీవితాలకు వాటిని అన్వయించుకుని మనకంటూ ఒక మార్గాన్ని ఏర్పరచుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అందుకే జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒక రోల్ మోడల్ ఉండాలి. అసాధారణ విజయాలను నమోదు చేసిన వ్యక్తుల జీవిత చరిత్రలను వారు స్వయంగా కానీ, ఇతరులు గానీ రాయడం సంప్రదాయంగా వస్తున్నదే. అయితే మహోన్నత వ్యక్తుల జీవితాన్ని మదించి, వారి వ్యక్తిత్వంలోని సుగుణాలను యువతరానికి స్ఫూర్తిదాయకంగా మలిచిన ప్రయత్నాలు మాత్రం తక్కువే అని చెప్పాలి. తెలుగుదేశంలో చంద్రబాబు చేరిక మొదలు నేటి వరకు ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ఆసక్తితో గమనిస్తున్న వారిలో నేను ఒకణ్ణి. ఆ ఆసక్తితో పాటు ఆయన జీవితం ఆధారంగా వ్యక్తిత్వవికాస పాఠాలను చెప్పవచ్చనే ఉత్సాహంతోనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వాన్ని విశ్లేషించే ప్రయత్నం ఇక్కడ చేస్తున్నాను. నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఆయన వేస్తున్న అభివృద్ధి ప్రణాలికలు కొత్త రాష్ట్రానికి కొత్త ఊపిరులూదుతున్నాయి. ఇవన్నీ అభివృద్ధి మాంత్రికుడు అధ్యానంలో చర్చించాను. - డా టి ఎస్ రావు© 2017,www.logili.com All Rights Reserved.