ప్రతీ మూడు నెలలకొకసారి ఒక రోజంతా నీరు ఎక్కువగా ఉండే పళ్ళు, కూరగాయలు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ గడపాలి. కీరా దోసకాయ, ముల్లంగి, ఉల్లిపాయలు రోజూ సలాడ్‌లో తప్పక తీసుకోవాలి.
ప్లాస్టిక్ పువ్వులు సువాసనలు వెదజల్లలేనట్లే, ప్లాస్టిక్ నవ్వులు కూడా ఎదుటివారి హృదయాలను స్పందింపజేయలేవు. క్రమం తప్పకుండా ధ్యానం చేస్తూవుంటే పెదవులపై చిరు మందహాసం తొణికిసలాడుతుంటుంది, ఎదుటివారిని ప్రేమించగలరు. మీకు, మీ పరిసరాలకు మధ్య ఒక సమతౌల్యం, ప్రశాంతత ఏర్పడుతాయి. మీరు ధ్యానం చేస్తుంటే ఎదుటివారి నుంచి ఏమీ ఆశించకనే వారిని ప్రేమించగలరు.
- – -
వేగంగా చదివేటప్పుడు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి చాలా మెరుగ్గా ఉంటాయి. ఈ యుగమంతా సమాచార యుగం. తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని విశ్లేషించకల్గితేనే ముందుకు వెళ్ళగలం.