ఏమి తినాలి? ఎప్పుడూ తినాలి? ఎలా తినాలి? ఎంత తినాలి ?
మనఇంట్లో వాడుకునే పోపు గింజలనుండి సమస్తం మనకు ఆరోగ్యాన్ని చేకూర్చేవే. మన పూర్వీకులు మనకోసం ఎంతో
శ్రమకోర్చి,పరిశోధించి మనకు కానీ ఖర్చులేకుండా ఎలా ఆరోగ్యంగా ఉండవచ్చోఆయుర్వేదం ద్వారా తెలియజేసారు.
అలాంటి పుస్తకాలలో అద్భుతమైన పుస్తకం ఇది. ఒకమారు చదివి పారేసే గ్రంధం కాదు. అవగాహనతో ఆహారం
తీసికొంటూ ఆరోగ్యంగా జీవించటం కోసం ఎప్పుడూ దగ్గరున్చుకోనవలసిన వరం.
ఉదయం లేచిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ తినాలా? వద్దా?.. ఉడకపెట్టిన కూరలలో పౌష్టికపదార్థాలు తగ్గిపోతాయి కాబట్టి పచ్చి కూరలను తినటం మంచిదా? ఏ ఆకుకూరలో ఎన్ని లవణాలుంటాయి? - ఇలాంటి అనేక ప్రశ్నలు మనను వేధిస్తూ ఉంటాయి. మనం తినే ఆహారానికి సంబంధించిన విశేషాలను వివరించే పుస్తకాలు ఇంగ్లీషులో అనేకం ఉన్నాయి. కానీ తెలుగులో ఆహారం గురించి సమగ్రంగా వివరించే పుస్తకాలు అతి తక్కువ. ఈ లోటును 'ఆహారంతో ఆరో గ్యం' పూరిస్తుంది. తెలుగు అక్షర మాలలో ఉన్న అక్షరాల క్రమంలో ఆహార పదార్థాలను విభజించి వివరించటం వల్ల పాఠకులకు చదవటం సులభమవుతుంది. తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకొనేవారు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకమిది.
ఏమి తినాలి? ఎప్పుడూ తినాలి? ఎలా తినాలి? ఎంత తినాలి ? మనఇంట్లో వాడుకునే పోపు గింజలనుండి సమస్తం మనకు ఆరోగ్యాన్ని చేకూర్చేవే. మన పూర్వీకులు మనకోసం ఎంతో శ్రమకోర్చి,పరిశోధించి మనకు కానీ ఖర్చులేకుండా ఎలా ఆరోగ్యంగా ఉండవచ్చోఆయుర్వేదం ద్వారా తెలియజేసారు. అలాంటి పుస్తకాలలో అద్భుతమైన పుస్తకం ఇది. ఒకమారు చదివి పారేసే గ్రంధం కాదు. అవగాహనతో ఆహారం తీసికొంటూ ఆరోగ్యంగా జీవించటం కోసం ఎప్పుడూ దగ్గరున్చుకోనవలసిన వరం. ఉదయం లేచిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ తినాలా? వద్దా?.. ఉడకపెట్టిన కూరలలో పౌష్టికపదార్థాలు తగ్గిపోతాయి కాబట్టి పచ్చి కూరలను తినటం మంచిదా? ఏ ఆకుకూరలో ఎన్ని లవణాలుంటాయి? - ఇలాంటి అనేక ప్రశ్నలు మనను వేధిస్తూ ఉంటాయి. మనం తినే ఆహారానికి సంబంధించిన విశేషాలను వివరించే పుస్తకాలు ఇంగ్లీషులో అనేకం ఉన్నాయి. కానీ తెలుగులో ఆహారం గురించి సమగ్రంగా వివరించే పుస్తకాలు అతి తక్కువ. ఈ లోటును 'ఆహారంతో ఆరో గ్యం' పూరిస్తుంది. తెలుగు అక్షర మాలలో ఉన్న అక్షరాల క్రమంలో ఆహార పదార్థాలను విభజించి వివరించటం వల్ల పాఠకులకు చదవటం సులభమవుతుంది. తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకొనేవారు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకమిది.
© 2017,www.logili.com All Rights Reserved.