దునియా దారి
*విశ్వ యాత్రికుని ప్రయాణ కవిత్వం')
జువ్వాడి దేవి ప్రసాద్ గారి 'విశ్వ విహారం' యాత్రా కవితలు చదివాక సుప్రసిద్ధ సూఫీ కవి ఖ్వాజా మీర్ దర్డ్ (1720 - 1785) షేర్ (ద్విపద) గుర్తుకొచ్చింది.
"సైర్ కర్ దునియాకి గాఫిల్
జింద గానీ ఫిర్ కహా
జిందగీ అగర్ కుచ్ రహీతో
నౌ జవానీ ఫిర్ కహా”
"ప్రపంచమంతా పర్యటించురా ఓ అజ్ఞానీ!
జీవితం మళ్ళీ ఎక్కడ దొరుకుతుంది?
ఒకవేళ జీవితం ఏ కొద్దిగా మిగిలినా
ఎక్కడి నుంచి తెస్తావు నవయవ్వనాన్ని”
జువ్వాడివారు తన జీవితాన్ని సార్థకం చేసుకున్నారు. దాదాపు అర్థ జీవితం పర్యటనలోనే గడిపేశారు. నా చిన్నతనంలో 'ఎ రౌండ్ ద వరల్డ్ ఇన్ ఎయిట్ డేస్" ఫ్రెంచి అనువాదం చదివి పులకించిపోయాను. ఆ తరువాత సినిమాగా కూడా వచ్చినట్టుంది. అలాగే ఏనుగుల వీరాస్వామిగారి కాశీయాత్ర (1831). ఈనాటికి చదువుతూనే ఉంటాను. దాదాపు తెలుగులో వచ్చిన ప్రతియాత్రా పుస్తకం ఇష్టంగా చదువుతాను. తాజాగా మా గోపిసార్ వెలువరించిన 'చైనాయాత్ర' వరకు విడవకుండా పఠించాను. ఆ తరువాత యాత్రా చరిత్రల మీద పునశ్చరణ తరగతుల్లో పలుమార్లు పాఠం చెప్పాను. పాఠ్యంశాల్లో ఒక సాహిత్య ప్రక్రియగా ప్రవేశపెట్టేందుకు దోహదపడ్డాను. ఈ విషయంలో యాత్రాచరిత్రల మీద తొలి...........
దునియా దారి *విశ్వ యాత్రికుని ప్రయాణ కవిత్వం') జువ్వాడి దేవి ప్రసాద్ గారి 'విశ్వ విహారం' యాత్రా కవితలు చదివాక సుప్రసిద్ధ సూఫీ కవి ఖ్వాజా మీర్ దర్డ్ (1720 - 1785) షేర్ (ద్విపద) గుర్తుకొచ్చింది. "సైర్ కర్ దునియాకి గాఫిల్ జింద గానీ ఫిర్ కహాజిందగీ అగర్ కుచ్ రహీతో నౌ జవానీ ఫిర్ కహా” "ప్రపంచమంతా పర్యటించురా ఓ అజ్ఞానీ! జీవితం మళ్ళీ ఎక్కడ దొరుకుతుంది? ఒకవేళ జీవితం ఏ కొద్దిగా మిగిలినా ఎక్కడి నుంచి తెస్తావు నవయవ్వనాన్ని” జువ్వాడివారు తన జీవితాన్ని సార్థకం చేసుకున్నారు. దాదాపు అర్థ జీవితం పర్యటనలోనే గడిపేశారు. నా చిన్నతనంలో 'ఎ రౌండ్ ద వరల్డ్ ఇన్ ఎయిట్ డేస్" ఫ్రెంచి అనువాదం చదివి పులకించిపోయాను. ఆ తరువాత సినిమాగా కూడా వచ్చినట్టుంది. అలాగే ఏనుగుల వీరాస్వామిగారి కాశీయాత్ర (1831). ఈనాటికి చదువుతూనే ఉంటాను. దాదాపు తెలుగులో వచ్చిన ప్రతియాత్రా పుస్తకం ఇష్టంగా చదువుతాను. తాజాగా మా గోపిసార్ వెలువరించిన 'చైనాయాత్ర' వరకు విడవకుండా పఠించాను. ఆ తరువాత యాత్రా చరిత్రల మీద పునశ్చరణ తరగతుల్లో పలుమార్లు పాఠం చెప్పాను. పాఠ్యంశాల్లో ఒక సాహిత్య ప్రక్రియగా ప్రవేశపెట్టేందుకు దోహదపడ్డాను. ఈ విషయంలో యాత్రాచరిత్రల మీద తొలి...........© 2017,www.logili.com All Rights Reserved.