కళ అనే శబ్దం యొక్క అర్ధాలు, నిర్వచనాలు ప్రాచీన మధ్యయుగాలలో ఒక విధంగాను ఆధునిక కాలంలోను మరొక విధంగాను వ్యాఖ్యానించటం జరుగుతుంది. ఆధ్యాత్మిక విద్యలలో దైవిక సంబంధమైన అంశాలలో 'కళ' శబ్ధాన్ని ప్రయోగిస్తున్నట్లుగా వేద పురాణ ఆగమ గ్రంధాల ద్వారా తెలుస్తుంది. మానవ జీవితానికి ఉపయుక్తమైన విషయాలలో నైపుణ్యము. ప్రాకృతిక భావనలు సంగమించిన సందర్భంగా కళ శబ్ధం విస్తృతంగా ప్రయోగించినట్లుగా అర్ధమవుతుంది. ఇక నేటికాలంలో ప్రజోపయోగమైన అంశాన్ని కళగా భావిస్తున్నారు.
మనం చెప్పుకొనే 64కళలు మానవ జీవ పరిమాణదశలో ఒకభాగం. ప్రవాహశీలత కలిగిన మానవ జీవనం కొత్త కళలు రావచ్చును! పాతకళలు ఉనికిని కోల్పోవచ్చును. అయినా కళ నిత్యం. జీవనం కోసం, ఆనందం కోసం ఏర్పడిన వృత్తులలో నైపుణ్యం ప్రసారమానమైనప్పుడు అది కళగా రూపుదిద్దుకొంటుంది. మానవ జీవనంలో అధిక భాగం కళాస్పర్శ ఉంటుందన్న విషయం గమనించాలి. ఈ కళల వెనుక ఆర్ధిక కోణం, మానవశ్రేయస్సు, మేధస్సు, భౌగోళిక అంశాలు ఇమిడి ఉంటాయి.
ఒక శాస్త్రం పుట్టుక వెనుక వందల సంవత్సరాల మానవ జీవనానుభవం ఉంటుంది. గత కాలాన్ని పరిశీలించి, వర్తమాన కాలాన్ని వివేచించి, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని శాస్త్రకారుడు శాస్త్రాన్ని నిబద్ధిస్తాడు. అందులో సమకాలీన సమాజం ప్రతిఫలిస్తుంది. ఈ నేపధ్యంలో కామశాస్త్ర గ్రంధాలు రావటం భారతావనిలో ఆశ్చర్యాన్ని కలిగించదు. నాగరిక జీవనం అభివృద్ధి చెందిన కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే వాత్స్యాయనుడి కామశాస్త్రం మానవ జీవనంలో వినూత్నమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. దీని ప్రభావం కావ్య ప్రపంచంమీద, శిల్ప నిర్మాణాలపై, నృత్య - చిత్ర కళా రంగాల మీద ప్రసరించింది. ముఖ్యంగా దేవాలయాల నిర్మాణంలో ప్రధాన భూమికను పోషించింది. వాత్సాయన కామసూత్రాలు వచ్చిన తర్వాతనే ఆలయాలపై మిధునశిల్పాలు రావడం మొదలైంది. దీనికి పూర్వం మిధునశిల్పాలు దేవతాపరంగానే వుండేవి.
వాత్స్యాయనుడు తన కామసూత్రాలలో సాధారణాధికరణం క్రింద విద్యా సముద్దేశాధ్యాయంలో చతుష్షష్ఠి కళలు గురించి చెప్పాడు. కామసూత్రాలకు 'జయ మంగళ' వ్యాఖ్యానం ప్రసిద్ధం. దీనిని ఆధారంగా చేసుకొని సరళమైన రీతిలో సామాన్య పాఠకులకు కూడా అర్ధమయ్యే విధంగా మువ్వల సుబ్బరామయ్యగారు '64 కళలు' అనే ఈ గ్రంధాన్ని రచించటం ఇప్పటి తరం వారికి చాలా అవసరం. 64 కళలు అంటే ఏమిటవి? అని వాటిని గురించి తెలుసుకోవటానికి ప్రయత్నించే పాఠకులకు ఇందులో ఉన్న సమాచారం ఎంతగానో దోహదపడుతుంది. సంగ్రహా సుందరంగా 64 కళలను వాటి వివరాలను తెలుగు చదువరులకు అందించిన సుబ్బరామయ్య గారు ఇప్పటికే అనేక జనోపయోగ పుస్తకాలను రచించి సాహితీ రంగంలో విలక్షణమైన స్థానాన్ని పొందారు.
- మువ్వల సుబ్బరామయ్య
కళ అనే శబ్దం యొక్క అర్ధాలు, నిర్వచనాలు ప్రాచీన మధ్యయుగాలలో ఒక విధంగాను ఆధునిక కాలంలోను మరొక విధంగాను వ్యాఖ్యానించటం జరుగుతుంది. ఆధ్యాత్మిక విద్యలలో దైవిక సంబంధమైన అంశాలలో 'కళ' శబ్ధాన్ని ప్రయోగిస్తున్నట్లుగా వేద పురాణ ఆగమ గ్రంధాల ద్వారా తెలుస్తుంది. మానవ జీవితానికి ఉపయుక్తమైన విషయాలలో నైపుణ్యము. ప్రాకృతిక భావనలు సంగమించిన సందర్భంగా కళ శబ్ధం విస్తృతంగా ప్రయోగించినట్లుగా అర్ధమవుతుంది. ఇక నేటికాలంలో ప్రజోపయోగమైన అంశాన్ని కళగా భావిస్తున్నారు. మనం చెప్పుకొనే 64కళలు మానవ జీవ పరిమాణదశలో ఒకభాగం. ప్రవాహశీలత కలిగిన మానవ జీవనం కొత్త కళలు రావచ్చును! పాతకళలు ఉనికిని కోల్పోవచ్చును. అయినా కళ నిత్యం. జీవనం కోసం, ఆనందం కోసం ఏర్పడిన వృత్తులలో నైపుణ్యం ప్రసారమానమైనప్పుడు అది కళగా రూపుదిద్దుకొంటుంది. మానవ జీవనంలో అధిక భాగం కళాస్పర్శ ఉంటుందన్న విషయం గమనించాలి. ఈ కళల వెనుక ఆర్ధిక కోణం, మానవశ్రేయస్సు, మేధస్సు, భౌగోళిక అంశాలు ఇమిడి ఉంటాయి. ఒక శాస్త్రం పుట్టుక వెనుక వందల సంవత్సరాల మానవ జీవనానుభవం ఉంటుంది. గత కాలాన్ని పరిశీలించి, వర్తమాన కాలాన్ని వివేచించి, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని శాస్త్రకారుడు శాస్త్రాన్ని నిబద్ధిస్తాడు. అందులో సమకాలీన సమాజం ప్రతిఫలిస్తుంది. ఈ నేపధ్యంలో కామశాస్త్ర గ్రంధాలు రావటం భారతావనిలో ఆశ్చర్యాన్ని కలిగించదు. నాగరిక జీవనం అభివృద్ధి చెందిన కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే వాత్స్యాయనుడి కామశాస్త్రం మానవ జీవనంలో వినూత్నమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. దీని ప్రభావం కావ్య ప్రపంచంమీద, శిల్ప నిర్మాణాలపై, నృత్య - చిత్ర కళా రంగాల మీద ప్రసరించింది. ముఖ్యంగా దేవాలయాల నిర్మాణంలో ప్రధాన భూమికను పోషించింది. వాత్సాయన కామసూత్రాలు వచ్చిన తర్వాతనే ఆలయాలపై మిధునశిల్పాలు రావడం మొదలైంది. దీనికి పూర్వం మిధునశిల్పాలు దేవతాపరంగానే వుండేవి. వాత్స్యాయనుడు తన కామసూత్రాలలో సాధారణాధికరణం క్రింద విద్యా సముద్దేశాధ్యాయంలో చతుష్షష్ఠి కళలు గురించి చెప్పాడు. కామసూత్రాలకు 'జయ మంగళ' వ్యాఖ్యానం ప్రసిద్ధం. దీనిని ఆధారంగా చేసుకొని సరళమైన రీతిలో సామాన్య పాఠకులకు కూడా అర్ధమయ్యే విధంగా మువ్వల సుబ్బరామయ్యగారు '64 కళలు' అనే ఈ గ్రంధాన్ని రచించటం ఇప్పటి తరం వారికి చాలా అవసరం. 64 కళలు అంటే ఏమిటవి? అని వాటిని గురించి తెలుసుకోవటానికి ప్రయత్నించే పాఠకులకు ఇందులో ఉన్న సమాచారం ఎంతగానో దోహదపడుతుంది. సంగ్రహా సుందరంగా 64 కళలను వాటి వివరాలను తెలుగు చదువరులకు అందించిన సుబ్బరామయ్య గారు ఇప్పటికే అనేక జనోపయోగ పుస్తకాలను రచించి సాహితీ రంగంలో విలక్షణమైన స్థానాన్ని పొందారు. - మువ్వల సుబ్బరామయ్య© 2017,www.logili.com All Rights Reserved.