హాస్యరచన చెక్కిలిగింత లాంటిది. ఎలాపెడితే, ఎక్కడ తాకితే నవ్వు కల్గుతుందో చెప్పటం కష్టం. తెలుగు హాస్యరచనల పుట్టుక, పెరుగదల గురించి ఎవరూ గంభీరంగా విశ్లేషించలేదు. అలా చేస్తే, చేసినవారిని అమాయకులుగా భావిస్తారు తప్ప, పట్టించుకోరు. నవ్విస్తే సంతోషిస్తారు కాని విడమరిస్తే విసరేస్తారు. అయితే విషయం, విషయమే కదా, విశేషమయినదే కదా. చదవుకొనగల రచనల్లో నవ్వు పుట్టే పద్ధతి ఎన్ని రకాలుగా విలసిల్లగలదో ఈ పుస్తకంలోని అనేక అంశాలు విప్పి చెప్తాయి. అలా ఎన్నో వాక్యాలతో, పదాలతో, సంఘటనల అమరికతో, తోజోవంతమైన ప్రతిభతో, తాము చుసినవాటినీ, విన్నవాటినీ, కల్పించినవాటినీ నవ్వుల విందుగా ఆనాటి రచయితల ఎలా అందించారో ఈ సంకలనంలో మువ్వల, గజ్జె కట్టించి మరి ప్రదర్శించారు.
హాస్యరచన ఒక విధంగా చుస్తే హోమియోపతి మందు లాంటిది కూడా. ఈ తీపి గుళికలు పోటేన్సి తక్కువయినా బాగా పనిచేస్తాయి. ఎక్కువయినా అమోఘంగా సేవ చేస్తాయి.
ఈ పుస్తకం వలన మరొక పునర్ ముల్యాంకనకు దోహదం కల్గుతోంది. తెలుగునాట హాస్య త్రిమూర్తులు కందుకూరి, చిలకమర్తి, పానుగంటిలను చెప్పుకోవచ్చునా? గురజాడ, కాళ్ళకూరిలకు వీరిలో స్థానం ఎక్కడ? ఈ ప్రశ్నల సమాధానాలకు కూడా ఈ గ్రంధంలో ఆధారాలు లభిస్తాయి
- మువ్వల సుబ్బరామయ్య
హాస్యరచన చెక్కిలిగింత లాంటిది. ఎలాపెడితే, ఎక్కడ తాకితే నవ్వు కల్గుతుందో చెప్పటం కష్టం. తెలుగు హాస్యరచనల పుట్టుక, పెరుగదల గురించి ఎవరూ గంభీరంగా విశ్లేషించలేదు. అలా చేస్తే, చేసినవారిని అమాయకులుగా భావిస్తారు తప్ప, పట్టించుకోరు. నవ్విస్తే సంతోషిస్తారు కాని విడమరిస్తే విసరేస్తారు. అయితే విషయం, విషయమే కదా, విశేషమయినదే కదా. చదవుకొనగల రచనల్లో నవ్వు పుట్టే పద్ధతి ఎన్ని రకాలుగా విలసిల్లగలదో ఈ పుస్తకంలోని అనేక అంశాలు విప్పి చెప్తాయి. అలా ఎన్నో వాక్యాలతో, పదాలతో, సంఘటనల అమరికతో, తోజోవంతమైన ప్రతిభతో, తాము చుసినవాటినీ, విన్నవాటినీ, కల్పించినవాటినీ నవ్వుల విందుగా ఆనాటి రచయితల ఎలా అందించారో ఈ సంకలనంలో మువ్వల, గజ్జె కట్టించి మరి ప్రదర్శించారు. హాస్యరచన ఒక విధంగా చుస్తే హోమియోపతి మందు లాంటిది కూడా. ఈ తీపి గుళికలు పోటేన్సి తక్కువయినా బాగా పనిచేస్తాయి. ఎక్కువయినా అమోఘంగా సేవ చేస్తాయి. ఈ పుస్తకం వలన మరొక పునర్ ముల్యాంకనకు దోహదం కల్గుతోంది. తెలుగునాట హాస్య త్రిమూర్తులు కందుకూరి, చిలకమర్తి, పానుగంటిలను చెప్పుకోవచ్చునా? గురజాడ, కాళ్ళకూరిలకు వీరిలో స్థానం ఎక్కడ? ఈ ప్రశ్నల సమాధానాలకు కూడా ఈ గ్రంధంలో ఆధారాలు లభిస్తాయి - మువ్వల సుబ్బరామయ్య© 2017,www.logili.com All Rights Reserved.