మధ్యలో వచ్చిన నేను మీ మధ్య లేకుండా వెళ్ళిపోవటమే న్యాయం అన్నాడు ప్రశాంత్. గాయత్రి రెచ్చిపోయినట్టుగా అంది - "ఏమిటా న్యాయం? నీ న్యాయానికి కళ్ళూ, చెవులూ లేవా? చేసుకున్న భార్యని వదిలేయటమేనా నీ న్యాయం? దీనికంతటికి కారణం నువ్వు. అప్పుడే నన్ను వదిలేసి ఉంటే ఏ బాధా ఉండేది కాదు! ఇలా నడి సముద్రంలో వదిలేయటానికేనా నన్ను పెళ్ళి చేసుకుంది? అసలు ఇదంతా నాతోనేగా చుట్టుకుని ఉన్నది. నేను చచ్చిపోతే అన్ని సమస్యలూ తీరిపోతాయి.
గాయత్రీ! ప్రశాంత్ గాయత్రిని ఒక్కసారిగా దగ్గరకు లాక్కుని హృదయానికి హత్తుకున్నాడు. ఆ మాట ఇంకెప్పుడు అనకు! గాయత్రి అతని మెడ చుట్టూ చేతులు వేసి ఏడ్చేసింది. ఈ సమస్యకు ఇంకే పరిష్కారమూ లేదంటే అదే మార్గం! ఎప్పటికైనా చచ్చిపోవలసిన వాళ్ళమే! ఆనంద్ కి మనం ఈ మాట చెప్పలేనట్టయితే మృత్యువునే వెతుక్కుందాం. ఇద్దరం కలిసే వెళ్ళిపోదాం. మౌనంగా ఉన్న మీ మానసవీణను కదిలించే యద్దనపూడి సులోచనారాణి నవలారాజం - అభిశాపం.
మధ్యలో వచ్చిన నేను మీ మధ్య లేకుండా వెళ్ళిపోవటమే న్యాయం అన్నాడు ప్రశాంత్. గాయత్రి రెచ్చిపోయినట్టుగా అంది - "ఏమిటా న్యాయం? నీ న్యాయానికి కళ్ళూ, చెవులూ లేవా? చేసుకున్న భార్యని వదిలేయటమేనా నీ న్యాయం? దీనికంతటికి కారణం నువ్వు. అప్పుడే నన్ను వదిలేసి ఉంటే ఏ బాధా ఉండేది కాదు! ఇలా నడి సముద్రంలో వదిలేయటానికేనా నన్ను పెళ్ళి చేసుకుంది? అసలు ఇదంతా నాతోనేగా చుట్టుకుని ఉన్నది. నేను చచ్చిపోతే అన్ని సమస్యలూ తీరిపోతాయి. గాయత్రీ! ప్రశాంత్ గాయత్రిని ఒక్కసారిగా దగ్గరకు లాక్కుని హృదయానికి హత్తుకున్నాడు. ఆ మాట ఇంకెప్పుడు అనకు! గాయత్రి అతని మెడ చుట్టూ చేతులు వేసి ఏడ్చేసింది. ఈ సమస్యకు ఇంకే పరిష్కారమూ లేదంటే అదే మార్గం! ఎప్పటికైనా చచ్చిపోవలసిన వాళ్ళమే! ఆనంద్ కి మనం ఈ మాట చెప్పలేనట్టయితే మృత్యువునే వెతుక్కుందాం. ఇద్దరం కలిసే వెళ్ళిపోదాం. మౌనంగా ఉన్న మీ మానసవీణను కదిలించే యద్దనపూడి సులోచనారాణి నవలారాజం - అభిశాపం.© 2017,www.logili.com All Rights Reserved.