రఘునాధనాయకుడు తంజావూరు రాజు, వీరుడు బహుభాషా కోవిదుడు, మధురకవి, నాట్యసంగీత శాస్త్రాలలో ద్రష్ట మధురవాణి, ఈతని ఆస్థాన కవయిత్రి, కనకాభిషేకము చేయించుకొన్న దిట్ట, సంస్కృతం. ప్రాకృతం, తెలుగు మున్నగు ఎనిమిది భాషలలో ప్రవీణురాలు, నాట్యము, సంగీతము క్షుణ్ణంగా ఎరిగిన కళావేత్త్రి. ఇవీ చరిత్రకారులు సేకరించిన విషయాలు. ఆమె పుట్టుపూర్వోత్తరాల విశేషాలు ఏమీ తెలియవు.
రఘునాధనాయకుని మేనమామ మూర్తప్ప నాయకుడు. ఈతని భోగపత్ని మరకతవల్లి. వీరి పుత్రికయే మధురవాణి. ఈ బావామరదళ్ళ విద్యావిజ్ఞానము కళల్లో ప్రావీణ్యము, అందచందాలు ఒకరిని మించిన ఒకరివి. వీరిరువురి ప్రణయానికి, పరిణయానికి అనువైన ముచ్చటైన రంగం సిద్ధం చేశారు, శ్రీ అడివి బాపిరాజు. ఇంతలో వారి మరణంతో వారి రచనకు శాశ్వతంగా అంతరాయం కలిగింది.
రఘునాధనాయకుడు మధురవాణిని శాస్త్రరీత్యా, ధర్మబద్ధంగా పెళ్ళాడటానికి గాని, భోగపత్నిగా స్వికరించడానికి అతని వృద్దమంత్రి గోవిందముఖి దీక్షితులు ఏవో రాజకీయాలు, ప్రజాశ్రేయస్సు అంటూ అడ్డు చెప్పాడు. వారి పరిణయం ఆగిపోవటంతో ప్రణయమూ, కవిత్వమూ, కళలూ వారి బ్రతుకులే అయ్యాయి. ఇలాగ, డాక్టర్ శ్యామలాదేవి మధురవాణి రఘునాధుల పాత్రలని మలచి పోషించిన విధం అబ్బురం, అనన్యం, క్లిష్టమైన ఈ నవలాపురణ నేర్పుతో సొంపుగా నిర్వహించారు.
దాదాపు ముప్పదియేడువత్సరాల క్రితం శ్రీ అడివి బాపిరాజు ఆరంభించిన చారిత్రాత్మక నవల 'మధురవాణి' ఇప్పుడు డాక్టర్ దిట్టకవి శ్యామలాదేవి పూరణతో చరితార్ధిక నవల అయింది.
- అడివి బాపిరాజు
రఘునాధనాయకుడు తంజావూరు రాజు, వీరుడు బహుభాషా కోవిదుడు, మధురకవి, నాట్యసంగీత శాస్త్రాలలో ద్రష్ట మధురవాణి, ఈతని ఆస్థాన కవయిత్రి, కనకాభిషేకము చేయించుకొన్న దిట్ట, సంస్కృతం. ప్రాకృతం, తెలుగు మున్నగు ఎనిమిది భాషలలో ప్రవీణురాలు, నాట్యము, సంగీతము క్షుణ్ణంగా ఎరిగిన కళావేత్త్రి. ఇవీ చరిత్రకారులు సేకరించిన విషయాలు. ఆమె పుట్టుపూర్వోత్తరాల విశేషాలు ఏమీ తెలియవు. రఘునాధనాయకుని మేనమామ మూర్తప్ప నాయకుడు. ఈతని భోగపత్ని మరకతవల్లి. వీరి పుత్రికయే మధురవాణి. ఈ బావామరదళ్ళ విద్యావిజ్ఞానము కళల్లో ప్రావీణ్యము, అందచందాలు ఒకరిని మించిన ఒకరివి. వీరిరువురి ప్రణయానికి, పరిణయానికి అనువైన ముచ్చటైన రంగం సిద్ధం చేశారు, శ్రీ అడివి బాపిరాజు. ఇంతలో వారి మరణంతో వారి రచనకు శాశ్వతంగా అంతరాయం కలిగింది. రఘునాధనాయకుడు మధురవాణిని శాస్త్రరీత్యా, ధర్మబద్ధంగా పెళ్ళాడటానికి గాని, భోగపత్నిగా స్వికరించడానికి అతని వృద్దమంత్రి గోవిందముఖి దీక్షితులు ఏవో రాజకీయాలు, ప్రజాశ్రేయస్సు అంటూ అడ్డు చెప్పాడు. వారి పరిణయం ఆగిపోవటంతో ప్రణయమూ, కవిత్వమూ, కళలూ వారి బ్రతుకులే అయ్యాయి. ఇలాగ, డాక్టర్ శ్యామలాదేవి మధురవాణి రఘునాధుల పాత్రలని మలచి పోషించిన విధం అబ్బురం, అనన్యం, క్లిష్టమైన ఈ నవలాపురణ నేర్పుతో సొంపుగా నిర్వహించారు. దాదాపు ముప్పదియేడువత్సరాల క్రితం శ్రీ అడివి బాపిరాజు ఆరంభించిన చారిత్రాత్మక నవల 'మధురవాణి' ఇప్పుడు డాక్టర్ దిట్టకవి శ్యామలాదేవి పూరణతో చరితార్ధిక నవల అయింది. - అడివి బాపిరాజు© 2017,www.logili.com All Rights Reserved.