ఆదివిష్ణు కధానికల్ని ఒక పెద్ద సంపుటిగా వేసి, ఈ కొత్తతరం వాళ్ళకి ఆయన ప్రతిభను చూపించలనిపించింది. ఫలితమే ఈ సంపుటి!
ఈ కధానికలు చదివితే మీకే అర్ధమవుతుంది. ఆరోజుల్లో రచయితగా ఆయన్ని మేమంతా అంతగా ఎందుకు అభిమానించేవాళ్ళమా అని! రచయితగా ఆదివిష్ణుగారి ప్రత్యేకత ఆదివిష్ణుగారిదే! ఆ విషయాన్ని చెప్పడానికి నేనెవర్ని? అందుకే చదవండి... ఆయన కధానికలే చెబుతాయి, అవి ఎంత ప్రత్యేకమైనవో. చిన్న చిన్న వాక్యాలతో కధని ఎలా పరుగెత్తించవచ్చో, కధని ఆసక్తితో చదివించేలా ఎలా మలచవచ్చో...
- వేదగిరి రాంబాబు.
ఆదివిష్ణు (రచయిత గురించి) :
1940లో వినాయకచవితినాడు - నాకెంతో యిష్టమైన బందర్లో పుట్టాను. పుట్టినరోజు పండుగ చేసుకునే అలవాటు లేకపోయినా - దేశప్రజలు వినాయకచవితి నాడు నా పుట్టింరోజు చేసుకోవడం నా అదృష్టం.
ఇంటిపేరుతో కాలేజి రోజుల్లోనే - 1959 నుంచీ కధలు, నవలలూ, నాటకాలూ రాయడం ప్రారంభించి ఆ తర్వాత సినిమాలకు రాయడం ప్రారంభించెను. ఉద్యోగం చేస్తూనే 40 చిత్రాలకు(దాదాపు) రాసేను!
ఆర్టీసిలో ప్రజా సంబంధాల శాఖకు ప్రధాన అధికారిగా పనిచేస్తూ 1998సెప్టెంబర్ నెలలో రిటైరయ్యాను. ఆ తర్వాత 'ఉషాకిరణ్ మూవీస్ సినీ కధా విభాగంలో రెండేళ్ళపాటు పనిచేసి - చిరంజీవులు మనవాళ్ళతో ఆడుకునే టైం దొరక్క - అక్కడకూడా రిటైరయ్యేను!
రామానాయుడుగారికి 'అహనా పెళ్ళంట' రాసేను. ఆ చిత్రం 200రోజులాడింది. రామోజీరావుగారికి "సుందరీ సుబ్బారావు" చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లే రాసి - ఆ సంవత్సరం (1984) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత బహుమతులు అందుకున్నాను.
- ఆదివిష్ణు
ఆదివిష్ణు కధానికల్ని ఒక పెద్ద సంపుటిగా వేసి, ఈ కొత్తతరం వాళ్ళకి ఆయన ప్రతిభను చూపించలనిపించింది. ఫలితమే ఈ సంపుటి! ఈ కధానికలు చదివితే మీకే అర్ధమవుతుంది. ఆరోజుల్లో రచయితగా ఆయన్ని మేమంతా అంతగా ఎందుకు అభిమానించేవాళ్ళమా అని! రచయితగా ఆదివిష్ణుగారి ప్రత్యేకత ఆదివిష్ణుగారిదే! ఆ విషయాన్ని చెప్పడానికి నేనెవర్ని? అందుకే చదవండి... ఆయన కధానికలే చెబుతాయి, అవి ఎంత ప్రత్యేకమైనవో. చిన్న చిన్న వాక్యాలతో కధని ఎలా పరుగెత్తించవచ్చో, కధని ఆసక్తితో చదివించేలా ఎలా మలచవచ్చో... - వేదగిరి రాంబాబు. ఆదివిష్ణు (రచయిత గురించి) : 1940లో వినాయకచవితినాడు - నాకెంతో యిష్టమైన బందర్లో పుట్టాను. పుట్టినరోజు పండుగ చేసుకునే అలవాటు లేకపోయినా - దేశప్రజలు వినాయకచవితి నాడు నా పుట్టింరోజు చేసుకోవడం నా అదృష్టం. ఇంటిపేరుతో కాలేజి రోజుల్లోనే - 1959 నుంచీ కధలు, నవలలూ, నాటకాలూ రాయడం ప్రారంభించి ఆ తర్వాత సినిమాలకు రాయడం ప్రారంభించెను. ఉద్యోగం చేస్తూనే 40 చిత్రాలకు(దాదాపు) రాసేను! ఆర్టీసిలో ప్రజా సంబంధాల శాఖకు ప్రధాన అధికారిగా పనిచేస్తూ 1998సెప్టెంబర్ నెలలో రిటైరయ్యాను. ఆ తర్వాత 'ఉషాకిరణ్ మూవీస్ సినీ కధా విభాగంలో రెండేళ్ళపాటు పనిచేసి - చిరంజీవులు మనవాళ్ళతో ఆడుకునే టైం దొరక్క - అక్కడకూడా రిటైరయ్యేను! రామానాయుడుగారికి 'అహనా పెళ్ళంట' రాసేను. ఆ చిత్రం 200రోజులాడింది. రామోజీరావుగారికి "సుందరీ సుబ్బారావు" చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లే రాసి - ఆ సంవత్సరం (1984) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత బహుమతులు అందుకున్నాను. - ఆదివిష్ణు
© 2017,www.logili.com All Rights Reserved.