తెలుగులో ముస్లిం మైనార్టీ కథ సాహిత్యానికి పుట్టినిల్లు రాయలసీమ. 1988 లో కడపజిల్లాకు చెందిన షేక్ హుస్సేన్ సత్యాగ్ని "పాచికలు" కథ రాయడంతో తెలుగులో ముస్లిం మైనార్టీ కథా సాహిత్యం మొదలైంది.
అంతవరకు తెలుగులో ముస్లిములు రాసిన ముస్లిమేతర సాహిత్యం, ముస్లిమేతరులు రాసిన ముస్లిం సాహిత్యం ఉంది కానీ ముస్లిములు రాసిన ముస్లిం కథ సాహిత్యంలేదు.
ఆ లోటును తీర్చడానికి రాయలసీమకు చెందిన ప్రసిద్ధ సాహితి వేత్తలు మధురాంతకం రాజారాం, వల్లంపాటి వెంకటసుబ్బయ్య గార్లు చేసిన సూచన మేరకు తాను కలం పట్టానని రచయిత స్వయంగా తన పుస్తకంలో చెప్పుకోవడం విశేషం.
పూర్తి భిన్నమైన సామాజిక సాంస్కృతిక జీవితం ఉన్న ముస్లిముల గురించి ముస్లిములే రాసుకోవడం వల్ల అనేక విషయాలు మరింత లోతుగా తెలుగు సాహితి లోకానికి తెలుస్తాయనే ఉద్దేశ్యంతో వారు ఈ సూచన చేసుండొచ్చు.