ఆయుర్వేద మత్యంత ప్రాచీనమైనది. ఎందరో మహర్షులు తమ తపశ్శక్తి నుపయోగించి, శ్రమించి యెన్నియో వైద్య గ్రంధములు మనకందించి యుండిరి. అగస్త్య మూలికా మర్మశాస్త్రము, ఓషధీ రత్నాకరము మున్నగునవి ఆ కోవకు చెందిన గ్రంధములే. "ఓషధీనాం పతి చంద్రః," ఓషదులకు రాజు చంద్రుడు. చంద్రుని యందలి అమృతమును, (మంచును) గ్రహించి, ఓషధులు వృద్ధి చెందుచున్నవి. మన చుట్టుపట్ల పరిసర ప్రాంతములలో ఎన్నియో మొక్కలు, ఓషధులుకలవు. "అంగట్లో అన్నీ వున్నాయి, అల్లుడి నోట్లో శని వున్నది" అన్నట్లు మనమా ఓషధులను గుర్తింపలేక, ప్రతి చిన్న రోగమునకూ హాస్పిటళ్ళ చుట్టూ తిరిగి, ఎంతో ద్రవ్యమును ఖర్చు పెట్టుకొనుచున్నాము.
ఎన్నియో ఆయుర్వేద గ్రంధములు పరిశీలించి, "ఆయుర్వేద జీవన విజ్ఞానము" అను పేరుతో యీ గ్రంధమును రూపొందించడమైనది. ఈ గ్రంధమును చదువుకొని, ఎవరెవరికి ఏయే జబ్బులు గలవో ఏయే మందులను వాడవచ్చునో గ్రహించి, స్వయముగా జబ్బులను తగ్గించుకొనవచ్చును. ఎంతయో శ్రమపడి తయారుచేసిన ఈ గ్రంధము రోగుల పాలిట కల్పవృక్షమనుటలో సందేహము లేదు. ఇది వైద్యులకు గూడ కరదీపికవలె ఉపయోగ పడగలదని ఆశించుచున్నాను.
- శ్రీ అడుగుల రామయాచారి
ఆయుర్వేద మత్యంత ప్రాచీనమైనది. ఎందరో మహర్షులు తమ తపశ్శక్తి నుపయోగించి, శ్రమించి యెన్నియో వైద్య గ్రంధములు మనకందించి యుండిరి. అగస్త్య మూలికా మర్మశాస్త్రము, ఓషధీ రత్నాకరము మున్నగునవి ఆ కోవకు చెందిన గ్రంధములే. "ఓషధీనాం పతి చంద్రః," ఓషదులకు రాజు చంద్రుడు. చంద్రుని యందలి అమృతమును, (మంచును) గ్రహించి, ఓషధులు వృద్ధి చెందుచున్నవి. మన చుట్టుపట్ల పరిసర ప్రాంతములలో ఎన్నియో మొక్కలు, ఓషధులుకలవు. "అంగట్లో అన్నీ వున్నాయి, అల్లుడి నోట్లో శని వున్నది" అన్నట్లు మనమా ఓషధులను గుర్తింపలేక, ప్రతి చిన్న రోగమునకూ హాస్పిటళ్ళ చుట్టూ తిరిగి, ఎంతో ద్రవ్యమును ఖర్చు పెట్టుకొనుచున్నాము. ఎన్నియో ఆయుర్వేద గ్రంధములు పరిశీలించి, "ఆయుర్వేద జీవన విజ్ఞానము" అను పేరుతో యీ గ్రంధమును రూపొందించడమైనది. ఈ గ్రంధమును చదువుకొని, ఎవరెవరికి ఏయే జబ్బులు గలవో ఏయే మందులను వాడవచ్చునో గ్రహించి, స్వయముగా జబ్బులను తగ్గించుకొనవచ్చును. ఎంతయో శ్రమపడి తయారుచేసిన ఈ గ్రంధము రోగుల పాలిట కల్పవృక్షమనుటలో సందేహము లేదు. ఇది వైద్యులకు గూడ కరదీపికవలె ఉపయోగ పడగలదని ఆశించుచున్నాను. - శ్రీ అడుగుల రామయాచారిsri
© 2017,www.logili.com All Rights Reserved.