సృష్టలో జీవరాశులు అనంతం.సృష్టి అనంతంగా కొనసాగడానికి ఇంచుమించు అన్ని జీవరాశుల్లోనూ స్త్రీపురుష బంధాన్ని అసామాన్యం చేసింది ప్రేమ.సామాన్య జీవితంలో అంతర్లీనమై భాసిల్లే ప్రేమని-వెలికి తీసి మనోహరం చేసి సామాన్యుడికి అందిస్తుంది సాహిత్యం. ఏ భాష సాహితి చూసినా నరజాతి చరిత్ర సమస్తం ప్రేమాయణ పరవశత్వం.సాహిత్యంలో ప్రేమ పుట్టుకకు - వినికిడి,తొలిచూపు కారణమవడం సర్వసాధారణం.కొండొకచో వ్యామోహం,రాజకీయం ప్రేమకు దారి తీసినా-ఆ కథల్లో వ్యూహానికున్నప్రాధాన్యం ప్రేమకు లభించకపోవడం సాధారణం.అలా చూస్తే అసామాన్య రచయిత శ్రీ దాసరి సుబ్రహ్మణ్యకృత 'అగ్నిమాల ' అసాధారణం.
అగ్ని దహిస్తే పునీతం.మాల ధరిస్తే పరిమళభరితం.అధికారాన్నీ అలంకారాన్నీ అగ్నిమాలగా సమన్వయిస్తే-నరజాతి చరిత్ర సమస్తం నిస్సందేహాంగా ప్రేమాయణ పరవశత్వం.
ఒక్క మాటలో చెప్పాలంటే - హస్తభూషణం అనుకునేవారు చదవతగ్గదీ,మస్తక మథనం అనుకునేవారు అధ్యయనం చెయ్యతగ్గదీ-ఐన పుస్తకం 'అగ్నిమాల '
© 2017,www.logili.com All Rights Reserved.