అసలు జీవించడమంటే ఏమిటీ? సంచార జాతుల్లా గానా? బాటసారుల్లాగానా? నూతన ప్రపంచపు ద్వారాలు తెరుచుకుంటూ ముందుకు సాగిపోవడమా? ఇవన్నీ అంత తొందరగా అందరికీ సాధ్యపడవు. ఈ సామాజిక చట్రంలో పూర్తిగా కూరుకుపోకుండా, పెళ్లీ పిల్లలూ ఉద్యోగధర్మాలూ నేర్పుగా నడుపుకుంటూనే, ఈ సంసారరథాన్ని నేర్పుగా నడుపుకుంటూనే దిశలు మార్చుకుంటూ ఉండొచ్చు. చాలామందికి ఈ ప్రయాణించడం అనేది సహజ
ప్రవృత్తి. అంతమాత్రానే గాలికి కొట్టుకుపోరు. పైగా స్థితప్రజ్ఞతా, కలివిడితనం మరింత పెరుగుతాయి. తమ్ముడు అమరేంద్రని ఇందుకు తార్కాణంగా చెప్పు కోవచ్చు. రానూరానూ వయస్సు తరిగిపోతూ ఆసక్తి మరింత పెరుగుతుంటే తన విషయంలో ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది.
- దాసరి శిరీష
అసలు జీవించడమంటే ఏమిటీ? సంచార జాతుల్లా గానా? బాటసారుల్లాగానా? నూతన ప్రపంచపు ద్వారాలు తెరుచుకుంటూ ముందుకు సాగిపోవడమా? ఇవన్నీ అంత తొందరగా అందరికీ సాధ్యపడవు. ఈ సామాజిక చట్రంలో పూర్తిగా కూరుకుపోకుండా, పెళ్లీ పిల్లలూ ఉద్యోగధర్మాలూ నేర్పుగా నడుపుకుంటూనే, ఈ సంసారరథాన్ని నేర్పుగా నడుపుకుంటూనే దిశలు మార్చుకుంటూ ఉండొచ్చు. చాలామందికి ఈ ప్రయాణించడం అనేది సహజ ప్రవృత్తి. అంతమాత్రానే గాలికి కొట్టుకుపోరు. పైగా స్థితప్రజ్ఞతా, కలివిడితనం మరింత పెరుగుతాయి. తమ్ముడు అమరేంద్రని ఇందుకు తార్కాణంగా చెప్పు కోవచ్చు. రానూరానూ వయస్సు తరిగిపోతూ ఆసక్తి మరింత పెరుగుతుంటే తన విషయంలో ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. - దాసరి శిరీష© 2017,www.logili.com All Rights Reserved.