ప్రసాద్ రాసిన కధలు వివిధ వార,మాస పత్రికలలో ప్రచురింపబడినాయి. అలా వివిధ పత్రికలలో ప్రచురించబడిన పద్నాలుగు కధల సంకలనమే "ఆలోచింపచేసే కధలు". ఇందులో స్వాతి వారి అనిల్ అవార్డ్ పొందిన "అమ్మాయి పెళ్లి" కూడా వుంది.
అవినీతి వ్యతిరేక ఉద్యమాలలో పాల్గొనే వారిలో చిత్తశుద్ది లేకపోవడాన్ని సున్నితంగా తెలియచేసే "మొక్కై వంగని అవినీతి", రాజకీయ నాయకులు నిర్వహించే బంద్ లవల్ల సామాన్య జనజీవనానికి కలిగే ఇబ్బందులని కళ్ళకు కట్టినట్లు తెలియచేసే "బంద్", పచ్చని పొలాలని సెజ్ ల కోసం సేకరించడం వలన తమ పొలాలలో కూలీలకి పని కల్పించిన రైతులు వలస కూలీలుగా మారుతున్న వైనాన్ని వివరించే "సెజ్ భూతం", వరకట్నం వినిమయ సంస్కృతికి అనులోమానుపాతంలో వుంటుందని, ప్రతీ స్త్రీ సొంత సంపాదన కలిగి వుండటమే వరకట్న సమస్యకి సరైన పరిస్కరమని తెలిపే "అమ్మాయి పెళ్లి". ఈ విధంగా కధలు పాటకులని సమకాలీన సామాజిక సమస్యలు గురించి ఆలోచింపచేస్తాయి.
ప్రసాద్ రాసిన కధలు వివిధ వార,మాస పత్రికలలో ప్రచురింపబడినాయి. అలా వివిధ పత్రికలలో ప్రచురించబడిన పద్నాలుగు కధల సంకలనమే "ఆలోచింపచేసే కధలు". ఇందులో స్వాతి వారి అనిల్ అవార్డ్ పొందిన "అమ్మాయి పెళ్లి" కూడా వుంది. అవినీతి వ్యతిరేక ఉద్యమాలలో పాల్గొనే వారిలో చిత్తశుద్ది లేకపోవడాన్ని సున్నితంగా తెలియచేసే "మొక్కై వంగని అవినీతి", రాజకీయ నాయకులు నిర్వహించే బంద్ లవల్ల సామాన్య జనజీవనానికి కలిగే ఇబ్బందులని కళ్ళకు కట్టినట్లు తెలియచేసే "బంద్", పచ్చని పొలాలని సెజ్ ల కోసం సేకరించడం వలన తమ పొలాలలో కూలీలకి పని కల్పించిన రైతులు వలస కూలీలుగా మారుతున్న వైనాన్ని వివరించే "సెజ్ భూతం", వరకట్నం వినిమయ సంస్కృతికి అనులోమానుపాతంలో వుంటుందని, ప్రతీ స్త్రీ సొంత సంపాదన కలిగి వుండటమే వరకట్న సమస్యకి సరైన పరిస్కరమని తెలిపే "అమ్మాయి పెళ్లి". ఈ విధంగా కధలు పాటకులని సమకాలీన సామాజిక సమస్యలు గురించి ఆలోచింపచేస్తాయి.© 2017,www.logili.com All Rights Reserved.