'దిక్కు మొక్కులేని జనం' మనమీద వేసే ప్రభావాన్ని తక్కువ అంచనా వెయ్యలేం. వాళ్ళకష్టాలూ, కన్నీళ్ళూ, క్షోభ, అలజడి, ఆందోళన మనలో తీవ్రమైన వుద్వేగాన్ని కలిగిస్తాయి. జీవితంలో ఇంతలోతులకి రచయితలు వెళ్ళగలరా అని ఆశ్చర్యపోతాం ఇది చదువుతూంటే, భుజంగరావుగారు ఇంతటితో ఆగరనీ, హోటల్ వర్కర్ల జీవితాలని మరింత కధనాత్మకంగా తప్పకుండా మన ముందుంచుతారని నమ్ముతున్నాను.
- కృష్ణాబాయి
భుజంగరావుగారు తన విశేషమైన ఉద్యమజీవితానుభవాల్ని ఇప్పటికే 'గమనాగమనం', 'గమ్యం దిశగా గమనం' అనే రచనల ద్వారా మన ముందుంచారు. ఇప్పటి ఈ 'దిక్కు మొక్కులేని జనం' కూడా ఆయన ఆత్మకధలాంటిదే. అయితే మామూలు ఆత్మకధలలోలాగ భుజంగరావుగారి రచనల్లో ఆయనది కేంద్రపాత్రకాదు. తనతో పాటు తన చుట్టూ వున్న సమాజంలో ఒక నిశ్చితకాలంలో జరిగిన వివిధ రకాలైన మార్పుల్ని వ్యక్తిత్వపు పోకడల్ని మానవ ప్రవర్తన సారాంశంలో వస్తున్న సవ్య అపసవ్యాలను ఆయన తన రచనల్లో బలంగా చిత్రీకరిస్తారు.
- సి యస్ ఆర్ ప్రసాద్
'దిక్కు మొక్కులేని జనం' మనమీద వేసే ప్రభావాన్ని తక్కువ అంచనా వెయ్యలేం. వాళ్ళకష్టాలూ, కన్నీళ్ళూ, క్షోభ, అలజడి, ఆందోళన మనలో తీవ్రమైన వుద్వేగాన్ని కలిగిస్తాయి. జీవితంలో ఇంతలోతులకి రచయితలు వెళ్ళగలరా అని ఆశ్చర్యపోతాం ఇది చదువుతూంటే, భుజంగరావుగారు ఇంతటితో ఆగరనీ, హోటల్ వర్కర్ల జీవితాలని మరింత కధనాత్మకంగా తప్పకుండా మన ముందుంచుతారని నమ్ముతున్నాను. - కృష్ణాబాయి భుజంగరావుగారు తన విశేషమైన ఉద్యమజీవితానుభవాల్ని ఇప్పటికే 'గమనాగమనం', 'గమ్యం దిశగా గమనం' అనే రచనల ద్వారా మన ముందుంచారు. ఇప్పటి ఈ 'దిక్కు మొక్కులేని జనం' కూడా ఆయన ఆత్మకధలాంటిదే. అయితే మామూలు ఆత్మకధలలోలాగ భుజంగరావుగారి రచనల్లో ఆయనది కేంద్రపాత్రకాదు. తనతో పాటు తన చుట్టూ వున్న సమాజంలో ఒక నిశ్చితకాలంలో జరిగిన వివిధ రకాలైన మార్పుల్ని వ్యక్తిత్వపు పోకడల్ని మానవ ప్రవర్తన సారాంశంలో వస్తున్న సవ్య అపసవ్యాలను ఆయన తన రచనల్లో బలంగా చిత్రీకరిస్తారు. - సి యస్ ఆర్ ప్రసాద్© 2017,www.logili.com All Rights Reserved.