ఇంచుమించుగా 1947 నుండి కధలు రాస్తున్నాను. 'అరణ్య పర్వం' సంపుటిలో, ఆనాటి నుండి ఈనాటి వరకూ అంటే 1947 నుండి 1996 వరకు రాసిన కొన్ని కధలు - రచనలు - మినహా మిగిలినవన్నీ వివిధ పత్రికల్లో - అంటే - 'జ్యోతి', తెలుగు స్వతంత్ర', 'ఆంధ్రప్రభ ఆదివారం సంచికలు', 'ప్రగతి', 'ప్రజాసాహితి', 'అరుణతార', సృజనల్లో వెలువడ్డాయి. 'పరుగు', 'జీవితం మేల్కొంది' - ఈ రెండూ నేరుగా ఈ సంపుటిలోకి వచ్చాయి. కాగా, 'కొండవాగు' 1992 ఆగష్టు, సెప్టెంబర్, అక్టోబర్ 'అరుణతార'ల్లోనూ 'ఆకలి' 1970లో, 'ప్రగతి' వారపత్రికలోనూ వచ్చాయి. దాదాపుగా ఈ కధల్లోని పాత్రలన్నీ రక్తమాంసాలు గల మానవుల - జీవితం నుండి నేరుగా స్వీకరించినవి! ఇంక 'పాణీ ఆలే' కధ రమాదేవి రాసింది. 'మహిళామార్గం'లో వచ్చింది. మొత్తం భారతదేశంలోని సాధారణ ప్రజలకు నీటి సమస్య ఎంత ప్రముఖమైన, ముఖ్యమైన సమస్యో తెల్సుకోవడానికి ఈ కధ చదవడం ఔసరం!
'అరణ్య పర్వం' మీ చేతిలో ఉంది. చదవండి!
- ఆలూరి భుజంగరావు
ఇంచుమించుగా 1947 నుండి కధలు రాస్తున్నాను. 'అరణ్య పర్వం' సంపుటిలో, ఆనాటి నుండి ఈనాటి వరకూ అంటే 1947 నుండి 1996 వరకు రాసిన కొన్ని కధలు - రచనలు - మినహా మిగిలినవన్నీ వివిధ పత్రికల్లో - అంటే - 'జ్యోతి', తెలుగు స్వతంత్ర', 'ఆంధ్రప్రభ ఆదివారం సంచికలు', 'ప్రగతి', 'ప్రజాసాహితి', 'అరుణతార', సృజనల్లో వెలువడ్డాయి. 'పరుగు', 'జీవితం మేల్కొంది' - ఈ రెండూ నేరుగా ఈ సంపుటిలోకి వచ్చాయి. కాగా, 'కొండవాగు' 1992 ఆగష్టు, సెప్టెంబర్, అక్టోబర్ 'అరుణతార'ల్లోనూ 'ఆకలి' 1970లో, 'ప్రగతి' వారపత్రికలోనూ వచ్చాయి. దాదాపుగా ఈ కధల్లోని పాత్రలన్నీ రక్తమాంసాలు గల మానవుల - జీవితం నుండి నేరుగా స్వీకరించినవి! ఇంక 'పాణీ ఆలే' కధ రమాదేవి రాసింది. 'మహిళామార్గం'లో వచ్చింది. మొత్తం భారతదేశంలోని సాధారణ ప్రజలకు నీటి సమస్య ఎంత ప్రముఖమైన, ముఖ్యమైన సమస్యో తెల్సుకోవడానికి ఈ కధ చదవడం ఔసరం! 'అరణ్య పర్వం' మీ చేతిలో ఉంది. చదవండి! - ఆలూరి భుజంగరావు© 2017,www.logili.com All Rights Reserved.