హైదరాబాద్ నగరం. నగర నడిబొడ్డులాంటి ప్రధాన బజారుకూడలి అది. అక్కడే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్ద భవనం రాజసంగా, మౌనగంభీరంగా తన నుదుటన ఉన్న గడియారంలో 12 గంటలు చూపిస్తుంది. ఏప్రిల్ నెల చివరి దినాలు. వేసవికాలం తన వేడి పంజా విసిరి ప్రతాపం చూపిస్తోంది. ఎండ తీవ్రంగా ఉంది. గాలి స్థంభించటంతో ఉక్కగా అన్పిస్తుంది. వీధులన్నీ కార్లు, స్కూటర్లు, ఆటోలు మొదలైన సంకీర్త ప్రవాహంతో బాగా రద్దీగా ఉన్నాయి. మధ్యాహ్నం వేళ కాలక్షేపంగా షాపింగ్ కి బయలుదేరిన ఆడవాళ్ళు చీర కొంగులతో చెమటలు తుడుచుకుంటూ, 'అబ్బా! ఏం ఎండ! మాడ్చి చంపేస్తుంది'. అనుకుంటూ ఆపసోపాలు పడుతున్నారు. ఈ ఎండాకాలమే తమ జీవితం అన్నట్లు పుచ్చకాయలు, కరుబూజాకాయలు రోడ్డు పక్కన బళ్లమీద, గుట్టలుగా కళకళలాడిపోతున్నాయి. తరువాత ఏంజరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
హైదరాబాద్ నగరం. నగర నడిబొడ్డులాంటి ప్రధాన బజారుకూడలి అది. అక్కడే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్ద భవనం రాజసంగా, మౌనగంభీరంగా తన నుదుటన ఉన్న గడియారంలో 12 గంటలు చూపిస్తుంది. ఏప్రిల్ నెల చివరి దినాలు. వేసవికాలం తన వేడి పంజా విసిరి ప్రతాపం చూపిస్తోంది. ఎండ తీవ్రంగా ఉంది. గాలి స్థంభించటంతో ఉక్కగా అన్పిస్తుంది. వీధులన్నీ కార్లు, స్కూటర్లు, ఆటోలు మొదలైన సంకీర్త ప్రవాహంతో బాగా రద్దీగా ఉన్నాయి. మధ్యాహ్నం వేళ కాలక్షేపంగా షాపింగ్ కి బయలుదేరిన ఆడవాళ్ళు చీర కొంగులతో చెమటలు తుడుచుకుంటూ, 'అబ్బా! ఏం ఎండ! మాడ్చి చంపేస్తుంది'. అనుకుంటూ ఆపసోపాలు పడుతున్నారు. ఈ ఎండాకాలమే తమ జీవితం అన్నట్లు పుచ్చకాయలు, కరుబూజాకాయలు రోడ్డు పక్కన బళ్లమీద, గుట్టలుగా కళకళలాడిపోతున్నాయి. తరువాత ఏంజరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.