చాలా జీవితాల్లో దారుణమైన సంఘటనలెన్నో వుంటాయి. కానీ మానవత్వం సిగ్గుపడాల్సిన సంఘటనలు ఎదురవటం అరుదు. డబ్బే జీవితంగా భావించిన భవానీప్రసాద్ జీవితంలో అలాంటి సంఘటన జరింగింది. మనసు సిగ్గుతో చచ్చిపోయి, మనిషిని జివచ్చవంలా మార్చిన ఆ సంఘటన ఏమిటి? షేమ్ - కధ చదవండి. తెలుస్తుంది.
నిరుద్యోగం, కలసిరాని పరిస్థితులు గోపాలాన్ని పీల్చి పిప్పి చేశాయి. అసమర్ధుడని అందరూ వేలెత్తి చూపించారు. తనకి జరిగిన అవమానాలెన్నో సహించిన గోపాలం, శాంతకు జరిగిన అవమానాన్ని సహించలేకపోయాడు. అగ్నిజ్వాలలా జ్వలించాడు. ఫలితం ఏమిటో, ఏం జరిగిందో తెలిపేకధ - అసమర్ధుడు.
ఆర్దిక అసమానతలతో, పెద్దవారి అధికారానికి బానిసల్లా బతుకులు వెల్లదీస్తున్న బడుగు బతుకుల్తో, రోజురోజుకీ దిగజారుతున్న తన గ్రామం ఒకవైపు... జీవితాన్ని సుఖప్రదంగా, మూడుపువ్వులు ఆరుకాయలుగా మార్చగలిగిన విదేశీ జివితావకాశం ఒకవైపు... రవి ఏ మలుపు తిరిగాడో తెలుపుతూ, యినాటి యువతరానికి దారి సూచించే కధ - ఆంధ్రయువకుడా - దారి ఇటు.
అనుకోని పరిస్థితులేదురై, భార్యనని చెప్పుకోలేకపోయినా భర్తనే అంటిపెట్టుకుని జీవితాన్ని జయించిన జయకధ - భార్య.
ప్రతి పదం దృశ్యంలా కళ్ళముందు కదిలేలా రాసిన కధలు రెండైతే విస్తృతమైన కధాసారాన్ని సంఘటనల్లా మలచి కూర్చిన కధలు రెండు. రచనా విధానంలో మార్పుని, రసస్పందన కలిగించటంలో నేర్పుని అవగతం చేసుకోటానికి చదవండి. "ఆంధ్రయువకుడా - దారి ఇటు".
- యద్దనపూడి సులోచనారాణి
చాలా జీవితాల్లో దారుణమైన సంఘటనలెన్నో వుంటాయి. కానీ మానవత్వం సిగ్గుపడాల్సిన సంఘటనలు ఎదురవటం అరుదు. డబ్బే జీవితంగా భావించిన భవానీప్రసాద్ జీవితంలో అలాంటి సంఘటన జరింగింది. మనసు సిగ్గుతో చచ్చిపోయి, మనిషిని జివచ్చవంలా మార్చిన ఆ సంఘటన ఏమిటి? షేమ్ - కధ చదవండి. తెలుస్తుంది. నిరుద్యోగం, కలసిరాని పరిస్థితులు గోపాలాన్ని పీల్చి పిప్పి చేశాయి. అసమర్ధుడని అందరూ వేలెత్తి చూపించారు. తనకి జరిగిన అవమానాలెన్నో సహించిన గోపాలం, శాంతకు జరిగిన అవమానాన్ని సహించలేకపోయాడు. అగ్నిజ్వాలలా జ్వలించాడు. ఫలితం ఏమిటో, ఏం జరిగిందో తెలిపేకధ - అసమర్ధుడు. ఆర్దిక అసమానతలతో, పెద్దవారి అధికారానికి బానిసల్లా బతుకులు వెల్లదీస్తున్న బడుగు బతుకుల్తో, రోజురోజుకీ దిగజారుతున్న తన గ్రామం ఒకవైపు... జీవితాన్ని సుఖప్రదంగా, మూడుపువ్వులు ఆరుకాయలుగా మార్చగలిగిన విదేశీ జివితావకాశం ఒకవైపు... రవి ఏ మలుపు తిరిగాడో తెలుపుతూ, యినాటి యువతరానికి దారి సూచించే కధ - ఆంధ్రయువకుడా - దారి ఇటు. అనుకోని పరిస్థితులేదురై, భార్యనని చెప్పుకోలేకపోయినా భర్తనే అంటిపెట్టుకుని జీవితాన్ని జయించిన జయకధ - భార్య. ప్రతి పదం దృశ్యంలా కళ్ళముందు కదిలేలా రాసిన కధలు రెండైతే విస్తృతమైన కధాసారాన్ని సంఘటనల్లా మలచి కూర్చిన కధలు రెండు. రచనా విధానంలో మార్పుని, రసస్పందన కలిగించటంలో నేర్పుని అవగతం చేసుకోటానికి చదవండి. "ఆంధ్రయువకుడా - దారి ఇటు". - యద్దనపూడి సులోచనారాణి© 2017,www.logili.com All Rights Reserved.