కావ్యయుగం నుంచి ఆధునిక యుగం వరకు 238 మంది పూర్వ, మధ్య, ఆధునిక కవుల చరిత్ర.
ఏ నాగరిక దేశంలోనైన, భాషాసాహిత్య ప్రసక్తిలోనైనా ఆ జాతి జనులకు తమకవులు, పండితులు, రచయితలు ఎక్కువ ప్రీతిపాత్రులు. తమ కవులను గూర్చి వాళ్ళ జీవిత వృతాంతలను గూర్చి, వాళ్ళచుట్టూ అల్లుకున్న కధలు గాధలు గూర్చి సాహిత్యపరులే కాదు, సాహిత్యంతో ప్రమేయం లేని వాళ్ళుకూడా సంతోషంతో చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళను గూర్చి ఆనందంతో స్మరించుకుంటూ వుంటారు. ఏమంటే, వాళ్ళు లేకపోతే తమ సృజనాత్మకతకు అభివ్యక్తి లేదు. తమ మనుగడకు ఉనికి కొరవడుతుంది. తమ పూర్వీకులను గూర్చి తమకేమి తెలియదు. తమ పల్లెలు, పట్టణాలు వెనుకటి కాలంలో ఎట్లా ఉండేవో తెలుసుకోవడానికి తమకు ఆధారం ఉండదు. తమ తాత,ముత్తాతల తాత తాత తాతలు ఏవిధంగా జీవించేవారో ఏవిధమైన కష్టసుఖాలు పొందారో, వాళ్ళ ఆలోచనలు ఎలాంటివో, వాళ్ళ మాటతీరు ఎట్లా ఉండేదో ఉహించేందుకు, తెలుసుకొనేందుకు వెరవుండేది కాదు.
ఏమైనా శాస్త్రీయ దృక్పదంతో కవుల చరిత్రకు శ్రీకారం చుట్టినవాడు కందుకూరి వీరేశలింగం. గడచిన శతాబ్దంలో వీరేశలింగం కవుల చరిత్ర పది ముద్రణలు వెలువడినా ఈ శతాబ్ది ప్రధమ ముద్రణ విశాలాంద్ర వారు తెస్తున్నారు. పదికాలాల పాటు ఈ కవుల చరిత్రను తెలుగువారు ఆదరిస్తారు.
- అక్కిరాజు రమాపతిరావు
కావ్యయుగం నుంచి ఆధునిక యుగం వరకు 238 మంది పూర్వ, మధ్య, ఆధునిక కవుల చరిత్ర. ఏ నాగరిక దేశంలోనైన, భాషాసాహిత్య ప్రసక్తిలోనైనా ఆ జాతి జనులకు తమకవులు, పండితులు, రచయితలు ఎక్కువ ప్రీతిపాత్రులు. తమ కవులను గూర్చి వాళ్ళ జీవిత వృతాంతలను గూర్చి, వాళ్ళచుట్టూ అల్లుకున్న కధలు గాధలు గూర్చి సాహిత్యపరులే కాదు, సాహిత్యంతో ప్రమేయం లేని వాళ్ళుకూడా సంతోషంతో చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళను గూర్చి ఆనందంతో స్మరించుకుంటూ వుంటారు. ఏమంటే, వాళ్ళు లేకపోతే తమ సృజనాత్మకతకు అభివ్యక్తి లేదు. తమ మనుగడకు ఉనికి కొరవడుతుంది. తమ పూర్వీకులను గూర్చి తమకేమి తెలియదు. తమ పల్లెలు, పట్టణాలు వెనుకటి కాలంలో ఎట్లా ఉండేవో తెలుసుకోవడానికి తమకు ఆధారం ఉండదు. తమ తాత,ముత్తాతల తాత తాత తాతలు ఏవిధంగా జీవించేవారో ఏవిధమైన కష్టసుఖాలు పొందారో, వాళ్ళ ఆలోచనలు ఎలాంటివో, వాళ్ళ మాటతీరు ఎట్లా ఉండేదో ఉహించేందుకు, తెలుసుకొనేందుకు వెరవుండేది కాదు. ఏమైనా శాస్త్రీయ దృక్పదంతో కవుల చరిత్రకు శ్రీకారం చుట్టినవాడు కందుకూరి వీరేశలింగం. గడచిన శతాబ్దంలో వీరేశలింగం కవుల చరిత్ర పది ముద్రణలు వెలువడినా ఈ శతాబ్ది ప్రధమ ముద్రణ విశాలాంద్ర వారు తెస్తున్నారు. పదికాలాల పాటు ఈ కవుల చరిత్రను తెలుగువారు ఆదరిస్తారు. - అక్కిరాజు రమాపతిరావు© 2017,www.logili.com All Rights Reserved.