కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందిన గ్రంధం
తారీఖులు దస్తావేజులకు చెల్లుచీటి చూపి చారిత్రక మూలాలపై, జనజీవన సరళుల పై చూపు నిలిపి - చరిత్ర నిర్మాతలు ప్రజలేనంటూ - చాటిన ఉద్గ్రంధం "ఆంధ్రుల సాంఘిక చరిత్ర". తెలుగు సాహిత్యంలో ప్రతి ప్రక్రియనూ చేపట్టి, సమర్ధవంతంగా నిర్వహించి, తెలుగుతనం మేల్కొల్పి, తెలంగాణా అస్తిత్వాన్ని పాదుకొల్పి - 'పదండి పోదాం' అన్న వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి గారు.
1949 లో మొదటిసారి ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రకటించిన "ఆంధ్రుల సాంఘిక చరిత్ర" సుమారు యాబై సంవత్సరాలలో పలుమార్లు అచ్చుకావడం ఈ గ్రంధం యొక్క ప్రాశస్త్యాన్ని నిరూపిస్తున్నది. గడచిన అర్ధశతాబ్దిలో తెలుగులో ప్రకటితమైన గ్రంధాలలో ఉత్తమ శ్రేణికి చెందిన వాటిని కొన్నింటిని పేర్కొనవలసి వస్తే ఆంధ్రుల సాంఘీక చరిత్రకు ప్రత్యేక స్థానం ఇవ్వక తప్పదు. అందుచేతనే కేంద్ర సాహిత్య అకాడమీ భారతీయ సాహిత్యంలో ప్రతి భాషకు ప్రతి సంవత్సరం ఇచ్చే జాతీయ బహుమతిని తెలుగులో మొదటిసారి ఈ గ్రంధానికి ఇచ్చినది. ఇది తెలుగు మొదటి జాతీయ బహుమతి పొందిన గ్రంధం కావడం గమనించవలసిన విషయం. ఇది ఈ గ్రంధ విశిష్టతను చాటి చెప్పుతున్నది.
కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందిన గ్రంధం తారీఖులు దస్తావేజులకు చెల్లుచీటి చూపి చారిత్రక మూలాలపై, జనజీవన సరళుల పై చూపు నిలిపి - చరిత్ర నిర్మాతలు ప్రజలేనంటూ - చాటిన ఉద్గ్రంధం "ఆంధ్రుల సాంఘిక చరిత్ర". తెలుగు సాహిత్యంలో ప్రతి ప్రక్రియనూ చేపట్టి, సమర్ధవంతంగా నిర్వహించి, తెలుగుతనం మేల్కొల్పి, తెలంగాణా అస్తిత్వాన్ని పాదుకొల్పి - 'పదండి పోదాం' అన్న వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి గారు. 1949 లో మొదటిసారి ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రకటించిన "ఆంధ్రుల సాంఘిక చరిత్ర" సుమారు యాబై సంవత్సరాలలో పలుమార్లు అచ్చుకావడం ఈ గ్రంధం యొక్క ప్రాశస్త్యాన్ని నిరూపిస్తున్నది. గడచిన అర్ధశతాబ్దిలో తెలుగులో ప్రకటితమైన గ్రంధాలలో ఉత్తమ శ్రేణికి చెందిన వాటిని కొన్నింటిని పేర్కొనవలసి వస్తే ఆంధ్రుల సాంఘీక చరిత్రకు ప్రత్యేక స్థానం ఇవ్వక తప్పదు. అందుచేతనే కేంద్ర సాహిత్య అకాడమీ భారతీయ సాహిత్యంలో ప్రతి భాషకు ప్రతి సంవత్సరం ఇచ్చే జాతీయ బహుమతిని తెలుగులో మొదటిసారి ఈ గ్రంధానికి ఇచ్చినది. ఇది తెలుగు మొదటి జాతీయ బహుమతి పొందిన గ్రంధం కావడం గమనించవలసిన విషయం. ఇది ఈ గ్రంధ విశిష్టతను చాటి చెప్పుతున్నది.© 2017,www.logili.com All Rights Reserved.