ఆంధ్రుల సంక్షిప్త చరిత్రకు ఇది ఆరో ముద్రణ. మొదటి ముద్రణ 1953 లో వెలువడ్డది. ఇది సంక్షిప్త చరిత్ర. ఆదినుండి మన ప్రజలను గురించిన ఒక సాధారణ చిత్రాన్ని పాఠకులకు అందింప చేయాలనే యత్నం. ఆర్ధిక, సాంఘిక ధోరణులకు సంబంధించిన వివరాలు ఇందులో చాలా క్లుప్తంగా ఉన్నాయి. అందుకు సంబంధించిన సమాచారం ఆనాడు లభించలేదు. ఈనాడు లభిస్తున్నది. అయినా గ్రంథ విస్తరణ భీతిచే అదనపు సమాచారాన్ని చేర్చటం లేదు. అందుకు ప్రత్యేక రచన అవసరం. పరిస్థితులు అనుకూలిస్తే ఆ ప్రయత్నమూ చేయాలని ఉంది. ఒకటి మాత్రం చెప్పగలను. గత ఇరవయ్యేండ్లలో ఆంధ్రుల చరిత్రలో ఎంతో పరిశోధన జరిగింది. ఇంకా జరుగుతున్నది.
ఈ పరిశోధన ఫలితాలేవీ కూడా ఈ గ్రంథ రచనలో విషయ వివరణకు మౌలికంగా, వ్యత్యాసంగా గాని, విరుద్ధంగా గాని లేవు. అనుకూలంగానే ఉన్నాయి. చారిత్రిక సరిహద్దులను రాజవంశాలు నిర్ణయించే ప్రాచీన కాలం అది. కనుక ఆ పరిధిని ఈ గ్రంథం అధిగమించలేకపోయింది. ఐనప్పటికీ తెగల స్థాయి నుండి జాతి స్థాయికి, మతావేశ దశ నుండి భాషా సమైక్యతా దశకు పయనించి, ప్యూడల్ సామాజిక స్థితి నుండి ఆధునిక యుగంలోకి అడుగుపెడుతున్న ఆంద్రజాతి స్థూల చిత్రణ ఈ గ్రంథం ద్వారా పాఠకునికి దృగ్గోచరం అవుతుందనే నా విశ్వాసం.
- ఏటుకూరు బలరామమూర్తి
ఆంధ్రుల సంక్షిప్త చరిత్రకు ఇది ఆరో ముద్రణ. మొదటి ముద్రణ 1953 లో వెలువడ్డది. ఇది సంక్షిప్త చరిత్ర. ఆదినుండి మన ప్రజలను గురించిన ఒక సాధారణ చిత్రాన్ని పాఠకులకు అందింప చేయాలనే యత్నం. ఆర్ధిక, సాంఘిక ధోరణులకు సంబంధించిన వివరాలు ఇందులో చాలా క్లుప్తంగా ఉన్నాయి. అందుకు సంబంధించిన సమాచారం ఆనాడు లభించలేదు. ఈనాడు లభిస్తున్నది. అయినా గ్రంథ విస్తరణ భీతిచే అదనపు సమాచారాన్ని చేర్చటం లేదు. అందుకు ప్రత్యేక రచన అవసరం. పరిస్థితులు అనుకూలిస్తే ఆ ప్రయత్నమూ చేయాలని ఉంది. ఒకటి మాత్రం చెప్పగలను. గత ఇరవయ్యేండ్లలో ఆంధ్రుల చరిత్రలో ఎంతో పరిశోధన జరిగింది. ఇంకా జరుగుతున్నది. ఈ పరిశోధన ఫలితాలేవీ కూడా ఈ గ్రంథ రచనలో విషయ వివరణకు మౌలికంగా, వ్యత్యాసంగా గాని, విరుద్ధంగా గాని లేవు. అనుకూలంగానే ఉన్నాయి. చారిత్రిక సరిహద్దులను రాజవంశాలు నిర్ణయించే ప్రాచీన కాలం అది. కనుక ఆ పరిధిని ఈ గ్రంథం అధిగమించలేకపోయింది. ఐనప్పటికీ తెగల స్థాయి నుండి జాతి స్థాయికి, మతావేశ దశ నుండి భాషా సమైక్యతా దశకు పయనించి, ప్యూడల్ సామాజిక స్థితి నుండి ఆధునిక యుగంలోకి అడుగుపెడుతున్న ఆంద్రజాతి స్థూల చిత్రణ ఈ గ్రంథం ద్వారా పాఠకునికి దృగ్గోచరం అవుతుందనే నా విశ్వాసం. - ఏటుకూరు బలరామమూర్తి© 2017,www.logili.com All Rights Reserved.