ఇంగ్లీషువారు తమ దేశ సాంఘిక చరిత్రను 200 ఏండ్లనాడే వ్రాసిరి. నాటినుండి నేటివరకేందరో ఎన్నియో పుస్తకాలీవిషయమై వ్రాసిరి. ఆ పుస్తకాలలో 500 ఏండ్లనుండి తమ పూర్వులేట్టివారో, వారి పరిశ్రమలేట్టివో తెలుపు పటాలు నిండుగా ముద్రించినారు. తమ దేశమును గురించియే కాక, ప్రపంచమందితరుల చరిత్రలను కూడా వారు వ్రాసి ప్రకటించారు. మన చెంచులను గురించి, సహారా ప్రాంతంపు నగ్నలను గురించి, ఆఫ్రికా కాఫిర్లను గురించి, ఆసాం నాగులను గురించి శాంతి మహాసాగర మందలి కొన్ని దీవులందలి మనుష్య భక్షకులను గురించి, ఉత్తరధ్రువ ప్రాంతాలలో ఆరునెలలు చీకటి ఆరునెలలు ఎండలో జీవించు ఎస్కిమోలను గురించి యిట్టి సహాస్రాధిక విషయాలను గురించి తెలుసుకోవలేనంటే మనకు ఇంగ్లీషు శారదయే ఉపాస్యయగును. అందలి సారస్వతమందు సర్వజ్ఞతకలదు. ఇంగ్లీషులో మానవజాతి కధ అనేక బృహత్సంపుటములలో సచిత్రముగా ముద్రింపబడి బహుకాలమయ్యేను. దానినైనను మనము తెనుగులోనికి తెచ్చుకొన్నామా!
సురవరం ప్రతాపరెడ్డి
ఇంగ్లీషువారు తమ దేశ సాంఘిక చరిత్రను 200 ఏండ్లనాడే వ్రాసిరి. నాటినుండి నేటివరకేందరో ఎన్నియో పుస్తకాలీవిషయమై వ్రాసిరి. ఆ పుస్తకాలలో 500 ఏండ్లనుండి తమ పూర్వులేట్టివారో, వారి పరిశ్రమలేట్టివో తెలుపు పటాలు నిండుగా ముద్రించినారు. తమ దేశమును గురించియే కాక, ప్రపంచమందితరుల చరిత్రలను కూడా వారు వ్రాసి ప్రకటించారు. మన చెంచులను గురించి, సహారా ప్రాంతంపు నగ్నలను గురించి, ఆఫ్రికా కాఫిర్లను గురించి, ఆసాం నాగులను గురించి శాంతి మహాసాగర మందలి కొన్ని దీవులందలి మనుష్య భక్షకులను గురించి, ఉత్తరధ్రువ ప్రాంతాలలో ఆరునెలలు చీకటి ఆరునెలలు ఎండలో జీవించు ఎస్కిమోలను గురించి యిట్టి సహాస్రాధిక విషయాలను గురించి తెలుసుకోవలేనంటే మనకు ఇంగ్లీషు శారదయే ఉపాస్యయగును. అందలి సారస్వతమందు సర్వజ్ఞతకలదు. ఇంగ్లీషులో మానవజాతి కధ అనేక బృహత్సంపుటములలో సచిత్రముగా ముద్రింపబడి బహుకాలమయ్యేను. దానినైనను మనము తెనుగులోనికి తెచ్చుకొన్నామా! సురవరం ప్రతాపరెడ్డి© 2017,www.logili.com All Rights Reserved.