మనిషితో పాటే మనోవేదన కూడా పుడుతుంది. అందుకే ఈ ప్రపంచంలో దేనికో ఒకదానికి విచారించకుండా ఉండని మనిషి ఉండడు. అలాంటివాడు భూమిమీద ఇంతవరకూ పుట్టిలేడు. బహుశా పుట్టడు కూడా. మనిషంటే మనస్సు. మనస్సంటే చింత. చింత అంతమయ్యేది చితిమీదే. గంజి లేక బాధపడేవారు కొందరైతే.. గంజిలోకి ఉప్పులేక ఉసూరుమనే వారు మరికూందరు. ఆకలితో అలమటించేవాళ్ళు కొందరైతే.. అజీర్ణతతో బాధపడేవారు మరికొందరు. భార్యలేక చింతించేవారు కొందరు.. భార్యవల్ల బాధించబడేవారు కొందరు. ఐశ్వర్యంలేదే అని కొందరేడుస్తూంటే.. ఎందుకొచ్చిన తంటారా అనుకునే వాళ్ళు మరికొందరు.
పిల్లలులేరని దిగులు కొందరికి; పిల్లల వల్ల దిగులు కొందరికి. పదవిలేదనే పరితాపం కొందరికి.. పదవి వల్ల ఇబ్బందులు కొందరికి. ఏదైనా సరే ఉన్నాబాధే, లేకపోయినా బాధే. భూమ్మీద - దుఃఖం లేని సుఖం లేదు. యాతే మనిషనే నటుడు, యదార్థం దాచుకుని మరోముఖం ప్రదర్శిస్తుంటాడు. అందుచేత జనం అతను సుఖంగా ఉన్నాడని భ్రమపడతారు. ప్రతివారూ తాను తప్ప అందరు బాగానే ఉన్నారనుకుంటారు. పైకి కనిపించే మనిషివేరు. అసలు మనిషి వేరు.
మనిషితో పాటే మనోవేదన కూడా పుడుతుంది. అందుకే ఈ ప్రపంచంలో దేనికో ఒకదానికి విచారించకుండా ఉండని మనిషి ఉండడు. అలాంటివాడు భూమిమీద ఇంతవరకూ పుట్టిలేడు. బహుశా పుట్టడు కూడా. మనిషంటే మనస్సు. మనస్సంటే చింత. చింత అంతమయ్యేది చితిమీదే. గంజి లేక బాధపడేవారు కొందరైతే.. గంజిలోకి ఉప్పులేక ఉసూరుమనే వారు మరికూందరు. ఆకలితో అలమటించేవాళ్ళు కొందరైతే.. అజీర్ణతతో బాధపడేవారు మరికొందరు. భార్యలేక చింతించేవారు కొందరు.. భార్యవల్ల బాధించబడేవారు కొందరు. ఐశ్వర్యంలేదే అని కొందరేడుస్తూంటే.. ఎందుకొచ్చిన తంటారా అనుకునే వాళ్ళు మరికొందరు. పిల్లలులేరని దిగులు కొందరికి; పిల్లల వల్ల దిగులు కొందరికి. పదవిలేదనే పరితాపం కొందరికి.. పదవి వల్ల ఇబ్బందులు కొందరికి. ఏదైనా సరే ఉన్నాబాధే, లేకపోయినా బాధే. భూమ్మీద - దుఃఖం లేని సుఖం లేదు. యాతే మనిషనే నటుడు, యదార్థం దాచుకుని మరోముఖం ప్రదర్శిస్తుంటాడు. అందుచేత జనం అతను సుఖంగా ఉన్నాడని భ్రమపడతారు. ప్రతివారూ తాను తప్ప అందరు బాగానే ఉన్నారనుకుంటారు. పైకి కనిపించే మనిషివేరు. అసలు మనిషి వేరు.© 2017,www.logili.com All Rights Reserved.