ఒకానొక అందగాడు, ఒక మహారణ్యంలో గుఱ్ఱం మీద శేరవేగoతో పోతున్నాడు. పొగా, పోగా, కొన్ని లతలు, పొదలు అడ్డమొచ్చాయి. గుఱ్ఱం ముందుకు సాగేందుకు వీలులేకపోయింది. నుఱగలు గుక్కుకుంటూ ఆగిపోయింది. గుఱ్ఱంమీద యువకుడు కిందకి దిగాడు. ఒరలోనించి కత్తి దూశాడు. అడ్డొచ్చిన లతలు, పొదలు తెగ నరికాడు. దారి చేశాడు. తిరిగి గుఱ్ఱంమీద కెగిరి కూర్చుని పరుగెత్తించాడు. మరి కొంతదూరం సాగాడు.
"అన్నా ! అన్నా !" యెవరో పిలవడం వినిపించింది. మనిషి సంచారంలేని ఆ మహారణ్యంలో తన్నేవరా అంత ఆప్యాయంగా పిలుస్తున్నారని తెల్లబోయాడు. గుఱ్ఱాన్ని నిలిపాడు. నలుదిక్కులూ పరకాయించాడు. ఒక గున్నమామిడి మీద రామచిలుక మాత్రం కనిపించింది. అదే - "అన్నా!అన్నా!" ముద్దుగా మల్లి పిలిచింది. గుఱ్ఱంమీద యువకుడు యెంతో మురిసిపోయాడు. తన గుఱ్ఱాన్ని అటు పోనిచ్చాడు.తీరా చిలకవున్న గున్నమామిడిచెట్టు సంపించటప్పటికీ, ఆ చిలుక కాస్తా అక్కడనుంచి తుర్రుమన్నది.
-కొవ్వలి లక్ష్మీనరసింహారావు.