"యూజ్ అనే సంస్కృత పదానికి అర్ధం 'కలుపుట' అని. జీవాత్మను, పరమాత్మతో కలుపుటకు చేయు ప్రయత్నం. ఈ పదం నుండి వచ్చినదే యోగం!
యోగం సిద్ధించడానికి ఆచరించే మార్గాలలో ముఖ్యమైనవి యోగాసనాలు. వీటివలన శరీరం మొత్తం దృఢమవుతుంది. మానసిక ప్రశాంతత, బలం చేకూరుతుంది. తద్వారా బుద్ధి వికసిస్తుంది. మంచి పనులమీద దృష్టి కలుగుతుంది. ఆ పనులపట్ల శ్రద్ధ. ఏకాగ్రతా కలిగి మంచి ఫలితాలు పొందటం జరుగుతుంది. ఈ ఫలితాల వలన ఆరోగ్యంమీద చక్కని అవగాహన ఏర్పడుతుంది. ఈ అవగాహనతో ఆరోగ్యం వృద్ధి చెందుతుంది.
మానవుల ఆరోగ్యం కోసం పూర్వం మహర్షులు చెప్పిన 'హఠయోగం'లోని 'యోగాసనాలను' నేడు ప్రపంచం మొత్తం గుర్తించడం జరిగింది. ఈ యోగాసనాలను ఎంతో మంది ప్రముఖ వైద్యులు, మానసిక శాస్త్రవేత్తలు ప్రోత్సహిస్తున్నారు. కొన్ని కొన్ని ఉద్యోగాల నిమిత్తం కూడా యోగా శిక్షణ కల్పిస్తున్నారు.
యోగాసనాలవలన శరీర అవయవాలన్నీ సమర్ధవంతంగా పని చేయడంవలన, శరీరంలోని వివిధ మాలిన్యాలు, చెడు వాయువులు బయటకు పోయి మంచి ఆరోగ్యాన్ని, దీర్ఘకాలిక వ్యాధుల్ని కూడా నయం చేయగలుగుతున్నాయి.
శారీరక వ్యాయామం ఏదైనా శరీరానికి బలం చేకూర్చుతుంది, చక్కని శరీర సౌష్టవాన్ని ఇనుమడింపచేస్తాయి. ఇటువంటి వ్యాయామాలు కండలు పెంచుకోవడానికి, ఛాతిని పెంచుకోవడానికి వుపయోగపడతాయి. ఏ బాక్సింగ్లోనో, వెయిట్ లిప్టింగ్ లోనో ప్రావిణ్యత సంపాదించాలనుకునే వారు. వాటికీ సంబంధించినంతవరకు అధికవ్యాయామం చేస్తూ శరీరాన్ని దృఢపరుచుకుంటారు. శరీరం లావు పెరగకుండా, శరీరాన్ని అందంగా తీర్చి దిద్దుకోవాలనుకునే వారు సామాన్యమైన వ్యాయామం చేయడం మంచిదే! అయితే ఈ వ్యాయామాలను శిక్షణ పొందటం ఖర్చుతో కూడుకున్నపని, శారీర శ్రమ కూడా అధికంగా వుంటుంది.
కాబట్టి తక్కువ శరీరశ్రమతో, ఏ మాత్రం ఖర్చులేకుండా యోగాసనాలతో చక్కని శారీరక సౌష్టవాన్ని పొందటమే కాకుండా, ఎన్నో వ్యాధులను నిర్మూలించుకుంటూ సంపూర్ణ ఆరోగ్యంతో నుండవచ్చును.
అటువంటి ఎన్నో ప్రయోజనాలను ఈ గ్రంధంలో చిత్ర సమేతంగా వివరించడం జరిగింది. ఆసనం - దానిని ఆచరించే విధానం - దాని ఉపయోగాలను పరిపూర్ణంగా చెప్పడం జరిగింది.
యోగాసనాలు వేయడానికి ముందు పాటించవలసిన పనులను కూడా 'షట్ కర్మలు'గా చెప్పడం జరిగింది.
తరువాత - ప్రాణాయామము, ధ్యానమువలన కలుగు ఉపయోగములు, ఆరోగ్యమును కూడా పూర్తిగా వివరించడం జరిగింది. ఇంకా... నిత్యజీవితంలో మనం పాటించవలసిన ఆహార విధానాలు, ఆహారపు విలువలను కూడా తెలియజేశాము.
ఎందుకంటే - ఎన్ని యోగాసనాలు వేసినా, వ్యాయామం చేసినా - ముఖ్యంగా మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఫలితాలుంటాయి. తగిన ఆహరం లేనిదే వీటి ఫలితాలను సరిగా పొందలేరు.
ఆరోగ్యం కోసం - నాటి మహర్షుల దగ్గరనుండి నేటి వైద్యులవరకు చెప్పిన ఎన్నో విషయాలను ఈ గ్రంధంలో పొందుపరచడం జరిగింది. ఇది మీకెంతో వుపయోగపడుతుందని, చక్కని అవగాహనతో మీరందరూ ఆరోగ్యవంతులుగా వుండాలనీ అప్పుడే ఈ గ్రంధానికి సార్ధకత లభిస్తుందని ఆశిస్తున్నాం.
- అరవింద్
"యూజ్ అనే సంస్కృత పదానికి అర్ధం 'కలుపుట' అని. జీవాత్మను, పరమాత్మతో కలుపుటకు చేయు ప్రయత్నం. ఈ పదం నుండి వచ్చినదే యోగం! యోగం సిద్ధించడానికి ఆచరించే మార్గాలలో ముఖ్యమైనవి యోగాసనాలు. వీటివలన శరీరం మొత్తం దృఢమవుతుంది. మానసిక ప్రశాంతత, బలం చేకూరుతుంది. తద్వారా బుద్ధి వికసిస్తుంది. మంచి పనులమీద దృష్టి కలుగుతుంది. ఆ పనులపట్ల శ్రద్ధ. ఏకాగ్రతా కలిగి మంచి ఫలితాలు పొందటం జరుగుతుంది. ఈ ఫలితాల వలన ఆరోగ్యంమీద చక్కని అవగాహన ఏర్పడుతుంది. ఈ అవగాహనతో ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. మానవుల ఆరోగ్యం కోసం పూర్వం మహర్షులు చెప్పిన 'హఠయోగం'లోని 'యోగాసనాలను' నేడు ప్రపంచం మొత్తం గుర్తించడం జరిగింది. ఈ యోగాసనాలను ఎంతో మంది ప్రముఖ వైద్యులు, మానసిక శాస్త్రవేత్తలు ప్రోత్సహిస్తున్నారు. కొన్ని కొన్ని ఉద్యోగాల నిమిత్తం కూడా యోగా శిక్షణ కల్పిస్తున్నారు. యోగాసనాలవలన శరీర అవయవాలన్నీ సమర్ధవంతంగా పని చేయడంవలన, శరీరంలోని వివిధ మాలిన్యాలు, చెడు వాయువులు బయటకు పోయి మంచి ఆరోగ్యాన్ని, దీర్ఘకాలిక వ్యాధుల్ని కూడా నయం చేయగలుగుతున్నాయి. శారీరక వ్యాయామం ఏదైనా శరీరానికి బలం చేకూర్చుతుంది, చక్కని శరీర సౌష్టవాన్ని ఇనుమడింపచేస్తాయి. ఇటువంటి వ్యాయామాలు కండలు పెంచుకోవడానికి, ఛాతిని పెంచుకోవడానికి వుపయోగపడతాయి. ఏ బాక్సింగ్లోనో, వెయిట్ లిప్టింగ్ లోనో ప్రావిణ్యత సంపాదించాలనుకునే వారు. వాటికీ సంబంధించినంతవరకు అధికవ్యాయామం చేస్తూ శరీరాన్ని దృఢపరుచుకుంటారు. శరీరం లావు పెరగకుండా, శరీరాన్ని అందంగా తీర్చి దిద్దుకోవాలనుకునే వారు సామాన్యమైన వ్యాయామం చేయడం మంచిదే! అయితే ఈ వ్యాయామాలను శిక్షణ పొందటం ఖర్చుతో కూడుకున్నపని, శారీర శ్రమ కూడా అధికంగా వుంటుంది. కాబట్టి తక్కువ శరీరశ్రమతో, ఏ మాత్రం ఖర్చులేకుండా యోగాసనాలతో చక్కని శారీరక సౌష్టవాన్ని పొందటమే కాకుండా, ఎన్నో వ్యాధులను నిర్మూలించుకుంటూ సంపూర్ణ ఆరోగ్యంతో నుండవచ్చును. అటువంటి ఎన్నో ప్రయోజనాలను ఈ గ్రంధంలో చిత్ర సమేతంగా వివరించడం జరిగింది. ఆసనం - దానిని ఆచరించే విధానం - దాని ఉపయోగాలను పరిపూర్ణంగా చెప్పడం జరిగింది. యోగాసనాలు వేయడానికి ముందు పాటించవలసిన పనులను కూడా 'షట్ కర్మలు'గా చెప్పడం జరిగింది. తరువాత - ప్రాణాయామము, ధ్యానమువలన కలుగు ఉపయోగములు, ఆరోగ్యమును కూడా పూర్తిగా వివరించడం జరిగింది. ఇంకా... నిత్యజీవితంలో మనం పాటించవలసిన ఆహార విధానాలు, ఆహారపు విలువలను కూడా తెలియజేశాము. ఎందుకంటే - ఎన్ని యోగాసనాలు వేసినా, వ్యాయామం చేసినా - ముఖ్యంగా మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఫలితాలుంటాయి. తగిన ఆహరం లేనిదే వీటి ఫలితాలను సరిగా పొందలేరు. ఆరోగ్యం కోసం - నాటి మహర్షుల దగ్గరనుండి నేటి వైద్యులవరకు చెప్పిన ఎన్నో విషయాలను ఈ గ్రంధంలో పొందుపరచడం జరిగింది. ఇది మీకెంతో వుపయోగపడుతుందని, చక్కని అవగాహనతో మీరందరూ ఆరోగ్యవంతులుగా వుండాలనీ అప్పుడే ఈ గ్రంధానికి సార్ధకత లభిస్తుందని ఆశిస్తున్నాం. - అరవింద్Please intimate.
© 2017,www.logili.com All Rights Reserved.