మనుషులు టీనేజ్ వయసు దాటి పోయేంత వరకు సంపూర్ణంగా పెరుగుతారు. మామూలుగా ఇరవై రెండు సంవత్సరాల వయసు వచ్చేసరికి ఎదుగుదల నిలిచిపోతుందని వైద్య పరిశోధకులు చెబుతున్నారు. మనిషి తన ఎత్తుకు తగ్గా లావు ఉండడం ఆరోగ్యవంతమైన చర్యగా వైద్య శాస్త్రజ్ఞులు భావించడం జరుగుతుంది. దాన్ని బట్టే - ఎత్తుకు తగ్గా బరువును శాస్త్రీయ ప్రామాణికంగా ప్రపంచ ఆరోగ్యసంస్థ ఒక విధానాన్ని రూపొందించింది. ఆ ప్రకారం - మనిషి తన ఎత్తుకు తగ్గా బరువు కంటే 10 శాతం తక్కువగా ఉంటే సన్నగానూ, 20 శాతం ఎక్కువగా ఉంటే దాన్ని స్థూలకాయంగానూ నిర్ధారించడం జరుగుతుంది.
మన శరీరంలో కొవ్వు ఎక్కువగా చెరితే అధిక బరువవుతాము. దీనినే ఊబకాయం అంటారు. ప్రపంచం మొత్తం మీద 13 శాతం మంది పిల్లలు, యువకులు స్థూలకాయంతో బాధపడుతూ, ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులకు గురవుతున్నారు. శరీరానికి తగినంత శ్రమ చేయకుండా తినుకుంటూ పొతే - కొవ్వు అధికంగా చేరుతుంది. ఇవాళ ఎన్నో వసతులు, ఏమాత్రం శ్రమలేని సుఖమైన జీవనశైలి, దురలవాట్లు స్తూలకాయానికి దారితీస్తున్నాయి.
ముఖ్యంగా మధ్య వయసుల్లో చాలా మంది బరువు పెరగడం జరుగుతుంది. కొందరు చిన్న వయసుల నుండే బరువు పెరుగుతూ వుండొచ్చు. వంశపారంపర్యంగా కూడా అధిక బరువు సమస్య వస్తుంది. అధిక బరువు, శారీరక లావు మనిషి జీవితానికి ఎన్నో ఇబ్బందులు కలిగిస్తుంది. ప్రమాదకరమైన వ్యాధులకు దారి తీస్తుంది. అందువలన అధిక బరువు అనర్ధాల గురించి అందరూ అవగాహన కలిగివుండి, తగిన చర్యలు తీసుకుంటే ఒబేసిటీ సమస్యను పూర్తిగా నివారించవచ్చు. అందుకు ఈ పుస్తకములో రూపొందించిన అంశాలు ఏంతో దోహదమవుతాయి. ఆ ప్రకారం ఆచరించి, అందం - ఆరోగ్యంతో సుఖంగా ఉండగలరని ఆశిస్తున్నాము.
- అరవింద్
మనుషులు టీనేజ్ వయసు దాటి పోయేంత వరకు సంపూర్ణంగా పెరుగుతారు. మామూలుగా ఇరవై రెండు సంవత్సరాల వయసు వచ్చేసరికి ఎదుగుదల నిలిచిపోతుందని వైద్య పరిశోధకులు చెబుతున్నారు. మనిషి తన ఎత్తుకు తగ్గా లావు ఉండడం ఆరోగ్యవంతమైన చర్యగా వైద్య శాస్త్రజ్ఞులు భావించడం జరుగుతుంది. దాన్ని బట్టే - ఎత్తుకు తగ్గా బరువును శాస్త్రీయ ప్రామాణికంగా ప్రపంచ ఆరోగ్యసంస్థ ఒక విధానాన్ని రూపొందించింది. ఆ ప్రకారం - మనిషి తన ఎత్తుకు తగ్గా బరువు కంటే 10 శాతం తక్కువగా ఉంటే సన్నగానూ, 20 శాతం ఎక్కువగా ఉంటే దాన్ని స్థూలకాయంగానూ నిర్ధారించడం జరుగుతుంది. మన శరీరంలో కొవ్వు ఎక్కువగా చెరితే అధిక బరువవుతాము. దీనినే ఊబకాయం అంటారు. ప్రపంచం మొత్తం మీద 13 శాతం మంది పిల్లలు, యువకులు స్థూలకాయంతో బాధపడుతూ, ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులకు గురవుతున్నారు. శరీరానికి తగినంత శ్రమ చేయకుండా తినుకుంటూ పొతే - కొవ్వు అధికంగా చేరుతుంది. ఇవాళ ఎన్నో వసతులు, ఏమాత్రం శ్రమలేని సుఖమైన జీవనశైలి, దురలవాట్లు స్తూలకాయానికి దారితీస్తున్నాయి. ముఖ్యంగా మధ్య వయసుల్లో చాలా మంది బరువు పెరగడం జరుగుతుంది. కొందరు చిన్న వయసుల నుండే బరువు పెరుగుతూ వుండొచ్చు. వంశపారంపర్యంగా కూడా అధిక బరువు సమస్య వస్తుంది. అధిక బరువు, శారీరక లావు మనిషి జీవితానికి ఎన్నో ఇబ్బందులు కలిగిస్తుంది. ప్రమాదకరమైన వ్యాధులకు దారి తీస్తుంది. అందువలన అధిక బరువు అనర్ధాల గురించి అందరూ అవగాహన కలిగివుండి, తగిన చర్యలు తీసుకుంటే ఒబేసిటీ సమస్యను పూర్తిగా నివారించవచ్చు. అందుకు ఈ పుస్తకములో రూపొందించిన అంశాలు ఏంతో దోహదమవుతాయి. ఆ ప్రకారం ఆచరించి, అందం - ఆరోగ్యంతో సుఖంగా ఉండగలరని ఆశిస్తున్నాము. - అరవింద్© 2017,www.logili.com All Rights Reserved.