పూజకి ఒక్క క్షణం ఈ సృష్టి అంతా సర్వానందజంత్ర సమ్మేళనంగా అనిపించింది! సిద్ధార్థని మరింత దగ్గరకు తీసుకుంది. శరీరం అంతా ఆనందపు వెలుగు మైకంలా కమ్మేస్తోంది. ఈ ప్రపంచంలో ఇతను తప్ప తనకి ఇంకేం అవసరంలేదు అనిపిస్తోంది. ఈ ఆనందంలో ఏదో శక్తి! అది ఆమె మనసులోని సంకోచపు గొలుసుల్ని తెగ్గోట్టేసి, ఆమెకి స్వచ్చమైన, నిర్మలమైన ఆనందపు అమృతాల్ని దోసిలితో తాగిస్తోంది! ఎక్కడో బీటలువారిన మనసు క్షేత్రంలో ఆ అమృతపు చినుకులు రాలుతున్నాయి! ఆమెలోని ఏదో నిరుపేదతనం, దాని తాలూకు వ్యధ...! ఎండిన ఆకుల్లా రాలిపోతున్నాయి.
ఒక సుమధురమైన గాలి! ఒక కొత్తపథం వైపు పయనం! సిద్ధార్థ భుజాల చుట్టూ చేయివేసి దగ్గరగా పట్టుకొని, ఆ వెలుగుపుంత వైపు తను నిస్సంకోచంగా నడవటానికి సిద్ధం అవుతుంది. అడుగు ముందుకు పడుతుంది. తనని ఎవ్వరూ ఆపలేరు! అభిజిత్ కూడా అడ్డుకోలేడు! ఆమెకి అర్థం అయిపోతుంది. తను పుట్టిందీ, బ్రతుకుతోందీ ఈ దివ్యక్షణాల కోసమే! ఇతని కోసమే! 'నవలాదేశపు రాణి' శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి కలం నుండి వెలువడిన మరో నవలా కుసుమం "అర్థస్థిత".
© 2017,www.logili.com All Rights Reserved.