"ఏ పోరాటంలో అయినా నిమ్న జాతుల ఒక పక్క హిందువులలో అగ్రకులాలవారు మరొక పక్క ఉన్నప్పుడు, పొలిసు బలగం ఎప్పుడు కూడా హిందూ నియంతృత్వ మెజారిటీతోనే జతకడుతుంది. ఎందుకంటే అటు పోలీసులోగాని ఇటు న్యాయవ్యవస్థలోగాని నిమ్నజాతులకు అసలు స్థానమంటూ లేకపోవటమే."
ఇప్పుడు ఒక కొత్త ఆత్యాచారం చాలా తీవ్రస్థాయిలో పెరుగుతున్నది. "పరువు హత్యలంటూ" ఎస్.సీ., ఎస్.టి. ల పై కులం కులమే, గ్రామం గ్రామమే దాడిచేసి చంపేస్తున్నారు, ఇళ్ళు తగలబెడుతున్నారు. ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. ఇవి ఎక్కువగా తమిళనాడులో జరుగుతున్నాయి. ఉత్తర భారతంలో హర్యానా, యు.పి. రాజస్థాన్ లలో ఎక్కువగా జరుగుతున్నాయి. అన్ని హత్యలకూ కారణం ఒకటే. ఎస్.సీ. కులానికి చెందిన అబ్బాయి, అగ్రకులానికి చెందిన అమ్మాయి ప్రేమించుకుంటారు. అది ఆ అగ్రకులానికి ఇష్టం ఉండదు. పెళ్లి చేసుకున్న ఆ ఇద్దరూ ఊరు విడిచి వెళ్ళిపోతారు. అగ్రకులంవారు ఈ భార్యాభర్తలను వెతికి పట్టుకొని ఆ అబ్బాయిని కొట్టి అమ్మాయినీ విడిచిపెట్టేయమంటారు. ఆ అమ్మాయి వినదు. అంతే, అబ్బాయిని చంపేస్తారు. ఒకోసారి ఇద్దర్ని చంపేస్తున్నారు. దీనికి ఆ కులమూ, గ్రామము మద్దతు ఇస్తుంది. పోలిస్ కూడా జోక్యం చెసుకోవటానికి భయపడుతుంది. అత్యంత దారుణమైన, హేయమైన, నీచమైన హత్యలివి. అగ్రకులం పరవు పోయిందని ఇటువంటి హత్యలు చేస్తున్నారు. ఇటువంటి కేసుల్లో నిందుతుల్ని అరెస్టు చేయటంగాని, కేసు నమోదు చేయటంగాని, దోషులకు శిక్షపడేలా చూడటం కాని జరగటంలేదు. దీనితో అగ్రకులాల వారికి ధైర్యం బాగా పెరిగిపోతున్నది. కాని, ఒక్క విషయం మాత్రం ఈ అగ్రకులాలవారు గ్రహించటంలేదు. ఇటువంటి హత్యల ద్వారా ఈ ప్రేమ వివాహాలను ఆపటం సాధ్యపడదని, కులాల అడ్డుగోడలు లేని ఒక మానవీయ బాంధవ్యాలకు సంబంధించిన అంశామేమో, ఈ నేర ప్రవర్తన ద్వారా వీటిని అరికట్టడం అసాధ్యమనేది గ్రహించటంలేదు.
ఈ చట్టం కూడా ఈ పరిస్థితిని పరిగణలోనికి తీసుకోవటంలేదు. చట్టాన్ని పటిష్టంగా అమలు చేయటంతోపాటు, విస్తృతమైన ప్రచారం చేయటం ద్వారా ఒక సామాజికమైన మార్పును తీసుకురావటం ప్రధాన కర్తవ్యం. అటువంటి పని దురదృష్టవశాత్తూ ఈ దేశంలో జరగటంలేదు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సాంఘిక ఉద్యమాలు పూర్తిగా బలహీనమైపోయాయి. వాటిని పునరుద్ధరించటం కూడా చాలా అవసరం.
ఈ పుస్తకాన్ని కులాలవాళ్ళు చదవాలి. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు తప్పనిసరిగా చదవాలి.
- బొజ్జా తారకం
"ఏ పోరాటంలో అయినా నిమ్న జాతుల ఒక పక్క హిందువులలో అగ్రకులాలవారు మరొక పక్క ఉన్నప్పుడు, పొలిసు బలగం ఎప్పుడు కూడా హిందూ నియంతృత్వ మెజారిటీతోనే జతకడుతుంది. ఎందుకంటే అటు పోలీసులోగాని ఇటు న్యాయవ్యవస్థలోగాని నిమ్నజాతులకు అసలు స్థానమంటూ లేకపోవటమే." ఇప్పుడు ఒక కొత్త ఆత్యాచారం చాలా తీవ్రస్థాయిలో పెరుగుతున్నది. "పరువు హత్యలంటూ" ఎస్.సీ., ఎస్.టి. ల పై కులం కులమే, గ్రామం గ్రామమే దాడిచేసి చంపేస్తున్నారు, ఇళ్ళు తగలబెడుతున్నారు. ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. ఇవి ఎక్కువగా తమిళనాడులో జరుగుతున్నాయి. ఉత్తర భారతంలో హర్యానా, యు.పి. రాజస్థాన్ లలో ఎక్కువగా జరుగుతున్నాయి. అన్ని హత్యలకూ కారణం ఒకటే. ఎస్.సీ. కులానికి చెందిన అబ్బాయి, అగ్రకులానికి చెందిన అమ్మాయి ప్రేమించుకుంటారు. అది ఆ అగ్రకులానికి ఇష్టం ఉండదు. పెళ్లి చేసుకున్న ఆ ఇద్దరూ ఊరు విడిచి వెళ్ళిపోతారు. అగ్రకులంవారు ఈ భార్యాభర్తలను వెతికి పట్టుకొని ఆ అబ్బాయిని కొట్టి అమ్మాయినీ విడిచిపెట్టేయమంటారు. ఆ అమ్మాయి వినదు. అంతే, అబ్బాయిని చంపేస్తారు. ఒకోసారి ఇద్దర్ని చంపేస్తున్నారు. దీనికి ఆ కులమూ, గ్రామము మద్దతు ఇస్తుంది. పోలిస్ కూడా జోక్యం చెసుకోవటానికి భయపడుతుంది. అత్యంత దారుణమైన, హేయమైన, నీచమైన హత్యలివి. అగ్రకులం పరవు పోయిందని ఇటువంటి హత్యలు చేస్తున్నారు. ఇటువంటి కేసుల్లో నిందుతుల్ని అరెస్టు చేయటంగాని, కేసు నమోదు చేయటంగాని, దోషులకు శిక్షపడేలా చూడటం కాని జరగటంలేదు. దీనితో అగ్రకులాల వారికి ధైర్యం బాగా పెరిగిపోతున్నది. కాని, ఒక్క విషయం మాత్రం ఈ అగ్రకులాలవారు గ్రహించటంలేదు. ఇటువంటి హత్యల ద్వారా ఈ ప్రేమ వివాహాలను ఆపటం సాధ్యపడదని, కులాల అడ్డుగోడలు లేని ఒక మానవీయ బాంధవ్యాలకు సంబంధించిన అంశామేమో, ఈ నేర ప్రవర్తన ద్వారా వీటిని అరికట్టడం అసాధ్యమనేది గ్రహించటంలేదు. ఈ చట్టం కూడా ఈ పరిస్థితిని పరిగణలోనికి తీసుకోవటంలేదు. చట్టాన్ని పటిష్టంగా అమలు చేయటంతోపాటు, విస్తృతమైన ప్రచారం చేయటం ద్వారా ఒక సామాజికమైన మార్పును తీసుకురావటం ప్రధాన కర్తవ్యం. అటువంటి పని దురదృష్టవశాత్తూ ఈ దేశంలో జరగటంలేదు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సాంఘిక ఉద్యమాలు పూర్తిగా బలహీనమైపోయాయి. వాటిని పునరుద్ధరించటం కూడా చాలా అవసరం. ఈ పుస్తకాన్ని కులాలవాళ్ళు చదవాలి. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు తప్పనిసరిగా చదవాలి. - బొజ్జా తారకం© 2017,www.logili.com All Rights Reserved.