ప్రింటింగ్ రంగంలో కంప్యూటర్ వినియోగం అనూహ్యమైన పురోగతిని తెచ్చింది. ఒకప్పుడు ప్రింటింగ్ చెయ్యాలంటే అక్షరాలను జాగ్రత్తగా ఫ్రేమ్ లలో ఫిక్స్ చేసి ప్రింట్ చేసి దానిలోని తప్పులను ప్రూఫ్ రీడింగ్ చేసేవారు. వాటికోసం ప్రత్యేకంగా ప్రూఫ్ రీడర్స్ ఉండేవారు. తప్పులను ఫ్రేమ్ ల్లో ఫిక్స్ చేసిన అక్షరాలను తీసివేసి కొత్త అక్షరాలను పెట్టి ప్రింటింగ్ కంటిన్యూ చేసేవారు. ఈ విధంగా ఒక పేజి ప్రింట్ చెయ్యాలంటే కనీసం ఒక రోజు సమయం పట్టేది. కాని కంప్యూటర్స్ వినియోగంలోకీ వచ్చిన తరువాత ఆ శ్రమ అంతా మాయమైపోయింది. కంప్యూటర్ సహాయంతో అతి తక్కువ కాలంలో, తక్కువ మంది పనివాళ్లతో ఎక్కువ పనిని చెయ్యగలుగుతున్నాం. ఇదంతా కంప్యూటర్ లో ఇన్ స్టాల్ చేసుకున్న పేజ్ మేకర్ అనే సాప్ట్ వేర్ వలన మాత్రమే సాధ్యమౌతుంది.
ప్రింటింగ్ రంగంలో ముఖ్యంగా పేజ్ మేకర్, ఫోటోషాప్ అనే రెండు రకాల సాప్ట్ వేర్ లను దీనిలో ఉపయోగిస్తారు. పేజె మేకర్ సాప్ట్ వేర్ లను ఉపయోగించి పేజిని మనకు కావాల్సిన విధంగా డిజైన్ చెయ్యవచ్చు. అంతేకాకుండా ఈనాటి ఎన్నో రకాల పబ్లికేషన్స్ కు సంబంధించిన వర్క్స్ ను అతి తక్కువ కాలంలో చేయగలుగుతున్నాము. అంతే కాకుండా పేజ్ మేకర్ ని ఉపయోగించి ఒక ఇంగ్లీషులోనే కాకుండా వివిధ రకాల భాషలను ఉపయోగించి వర్క్ చెయ్యవచ్చు.
ముఖ్యంగా పేజ్ మేకర్ ని ఉపయోగించి మన వర్క్స్ కీ సంబంధించిన డాక్యుమెంట్ ని డిజైనింగ్ చెయ్యడానికి పేజ్ మేకర్ ఎంతో ఉపయోగపడుతుంది. డిజైనింగ్ లో పేజ్ లే అవుట్ తో పాటు ఫాంట్స్ ను కూడా మనకు కావాల్సిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు.
పేజ్ మేకర్ ని ఉపయోగించి వర్క్ చేసే ముందు పేజ్ మేకర్ సాప్ట్ వేర్ ని మన సిస్టంలో ఇన్ స్టాల్ చేసుకోవాలి. పేజ్ మేకర్ రకరకాల వర్షన్స్ లో లభిస్తుంది కాబట్టి మనము వీలైనంత వరకు లేటెస్ట్ వర్షన్ ని ఇన్ స్టాల్ చేసుకుంటే మంచిది. లేటెస్ట్ సాప్ట్ వేర్ లో పాత వర్షన్ లో చేసిన వర్క్స్ ని కన్వర్ట్ చేసుకొనే అవకాశం కలదు. వీలైనంత వరకు ఒరిజినల్ సాప్ట్ వేర్ ని కొనుక్కొని ఇన్ స్టాల్ చేసుకొంటేనే పేజే మేకర్ లోని అన్ని ఆప్షన్స్ ని, పాలెట్స్ ని ఉపయోగించుకోవడానికి వీలవ్వదు.
ప్రస్తుతం పేజ్ మేకర్ 7.0 వర్షన్ అమలులో ఉంది. పేజ్ మేకర్ ని 'Adobe కంపెనీ వారు తయారు చేసిరి. పేజ్ మేకర్ ని మన సిస్టంలో ఇన్ స్టాల్ చేసుకొంటే అది మన సిస్టంలో ప్రోగ్రామ్స్ మేనులో ఉంటుంది.
పేజ్ మేకర్ సీ.డి.ని కంప్యూటర్ డి.వి.డి, ప్లేయర్ లో ఉంచి ఇన్ స్టాల్ చెయ్యాలి. అదే విధంగా ఒరిజనల్ సీ.డి.తో ఇచ్చే కీని తప్పని సరిగా జాగ్రత్త చేసుకోవాలి. ఇన్ స్టాల్ చేస్తున్నప్పుడు 'ప్రోడక్ట్ కీ' అన్న చోట తప్పనిసరిగా ఆ 'కీ'ని ఎంటర్ చెయ్యాలి.
పేజ్ మేకర్ వర్క్ మొత్తం కంప్యూటర్ కీ బోర్డ్ మీదే ఆదారపడి ఉంటుంది. అందువలన కీబోర్డ్ లోని లెటర్స్, అంకెలు మరియు వివిధ రకాల కిస్ గురించి పూర్తి అవగాహన అవసరం. అంటే కాకుండా వీటన్నిటితో పాటుగా కీబోర్డ్ కిస్ ని వీలైనంత స్పీడ్ గా ఉపయోగించడం చాలా అవసరం. ఈ పుస్తకం పేజ్ మేకర్ మీద ఒక అవగాహన కల్పిస్తుంది. ఏది ఏమైన పేజ్ మేకర్ ని ఎంత ఎక్కువ ఉపయోగించి ప్రాక్టీసు చేస్తే అంత బాగా దానిలోని వివిధ రకాల డిజైనింగ్ ఆప్షన్స్ తెలుస్తాయి.
- సిహెచ్. యు. వి. కరుణాకర్
ప్రింటింగ్ రంగంలో కంప్యూటర్ వినియోగం అనూహ్యమైన పురోగతిని తెచ్చింది. ఒకప్పుడు ప్రింటింగ్ చెయ్యాలంటే అక్షరాలను జాగ్రత్తగా ఫ్రేమ్ లలో ఫిక్స్ చేసి ప్రింట్ చేసి దానిలోని తప్పులను ప్రూఫ్ రీడింగ్ చేసేవారు. వాటికోసం ప్రత్యేకంగా ప్రూఫ్ రీడర్స్ ఉండేవారు. తప్పులను ఫ్రేమ్ ల్లో ఫిక్స్ చేసిన అక్షరాలను తీసివేసి కొత్త అక్షరాలను పెట్టి ప్రింటింగ్ కంటిన్యూ చేసేవారు. ఈ విధంగా ఒక పేజి ప్రింట్ చెయ్యాలంటే కనీసం ఒక రోజు సమయం పట్టేది. కాని కంప్యూటర్స్ వినియోగంలోకీ వచ్చిన తరువాత ఆ శ్రమ అంతా మాయమైపోయింది. కంప్యూటర్ సహాయంతో అతి తక్కువ కాలంలో, తక్కువ మంది పనివాళ్లతో ఎక్కువ పనిని చెయ్యగలుగుతున్నాం. ఇదంతా కంప్యూటర్ లో ఇన్ స్టాల్ చేసుకున్న పేజ్ మేకర్ అనే సాప్ట్ వేర్ వలన మాత్రమే సాధ్యమౌతుంది. ప్రింటింగ్ రంగంలో ముఖ్యంగా పేజ్ మేకర్, ఫోటోషాప్ అనే రెండు రకాల సాప్ట్ వేర్ లను దీనిలో ఉపయోగిస్తారు. పేజె మేకర్ సాప్ట్ వేర్ లను ఉపయోగించి పేజిని మనకు కావాల్సిన విధంగా డిజైన్ చెయ్యవచ్చు. అంతేకాకుండా ఈనాటి ఎన్నో రకాల పబ్లికేషన్స్ కు సంబంధించిన వర్క్స్ ను అతి తక్కువ కాలంలో చేయగలుగుతున్నాము. అంతే కాకుండా పేజ్ మేకర్ ని ఉపయోగించి ఒక ఇంగ్లీషులోనే కాకుండా వివిధ రకాల భాషలను ఉపయోగించి వర్క్ చెయ్యవచ్చు. ముఖ్యంగా పేజ్ మేకర్ ని ఉపయోగించి మన వర్క్స్ కీ సంబంధించిన డాక్యుమెంట్ ని డిజైనింగ్ చెయ్యడానికి పేజ్ మేకర్ ఎంతో ఉపయోగపడుతుంది. డిజైనింగ్ లో పేజ్ లే అవుట్ తో పాటు ఫాంట్స్ ను కూడా మనకు కావాల్సిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. పేజ్ మేకర్ ని ఉపయోగించి వర్క్ చేసే ముందు పేజ్ మేకర్ సాప్ట్ వేర్ ని మన సిస్టంలో ఇన్ స్టాల్ చేసుకోవాలి. పేజ్ మేకర్ రకరకాల వర్షన్స్ లో లభిస్తుంది కాబట్టి మనము వీలైనంత వరకు లేటెస్ట్ వర్షన్ ని ఇన్ స్టాల్ చేసుకుంటే మంచిది. లేటెస్ట్ సాప్ట్ వేర్ లో పాత వర్షన్ లో చేసిన వర్క్స్ ని కన్వర్ట్ చేసుకొనే అవకాశం కలదు. వీలైనంత వరకు ఒరిజినల్ సాప్ట్ వేర్ ని కొనుక్కొని ఇన్ స్టాల్ చేసుకొంటేనే పేజే మేకర్ లోని అన్ని ఆప్షన్స్ ని, పాలెట్స్ ని ఉపయోగించుకోవడానికి వీలవ్వదు. ప్రస్తుతం పేజ్ మేకర్ 7.0 వర్షన్ అమలులో ఉంది. పేజ్ మేకర్ ని 'Adobe కంపెనీ వారు తయారు చేసిరి. పేజ్ మేకర్ ని మన సిస్టంలో ఇన్ స్టాల్ చేసుకొంటే అది మన సిస్టంలో ప్రోగ్రామ్స్ మేనులో ఉంటుంది. పేజ్ మేకర్ సీ.డి.ని కంప్యూటర్ డి.వి.డి, ప్లేయర్ లో ఉంచి ఇన్ స్టాల్ చెయ్యాలి. అదే విధంగా ఒరిజనల్ సీ.డి.తో ఇచ్చే కీని తప్పని సరిగా జాగ్రత్త చేసుకోవాలి. ఇన్ స్టాల్ చేస్తున్నప్పుడు 'ప్రోడక్ట్ కీ' అన్న చోట తప్పనిసరిగా ఆ 'కీ'ని ఎంటర్ చెయ్యాలి. పేజ్ మేకర్ వర్క్ మొత్తం కంప్యూటర్ కీ బోర్డ్ మీదే ఆదారపడి ఉంటుంది. అందువలన కీబోర్డ్ లోని లెటర్స్, అంకెలు మరియు వివిధ రకాల కిస్ గురించి పూర్తి అవగాహన అవసరం. అంటే కాకుండా వీటన్నిటితో పాటుగా కీబోర్డ్ కిస్ ని వీలైనంత స్పీడ్ గా ఉపయోగించడం చాలా అవసరం. ఈ పుస్తకం పేజ్ మేకర్ మీద ఒక అవగాహన కల్పిస్తుంది. ఏది ఏమైన పేజ్ మేకర్ ని ఎంత ఎక్కువ ఉపయోగించి ప్రాక్టీసు చేస్తే అంత బాగా దానిలోని వివిధ రకాల డిజైనింగ్ ఆప్షన్స్ తెలుస్తాయి. - సిహెచ్. యు. వి. కరుణాకర్© 2017,www.logili.com All Rights Reserved.