ఇమేజెస్ ని మనకు కావాల్సిన విధంగా ఎడిట్ చేసుకోవడానికి ఫోటోషాప్ ఉపయోగపడుతుంది. ఫోటోషాప్ సాప్ట్ వేర్ ని ఉపయోగించి రకరకాల ఇమేజస్ ని ఉపయోగించి అనేక రకాల సినరిస్ ని, కొత్త ఇమేజస్ ని మన ఊహకు తగ్గట్టుగా రూపొందించవచ్చు. అంతే కాకుండా మన కలల్లో ఉండే ఊహా చిత్రాలను కూడా సృష్టించవచ్చు. ఈ పుస్తకము క్రొత్తగా నేర్చుకోవాలనుకునే వారికీ ఫోటోషాప్ గురించి ఒక అవగాహన కల్పించడం కొరకు సాధ్యమైనంత సులభమైన పద్ధతిలో వ్రాయడం జరిగింది. దీనిలో దాదాపుగా అన్ని మెనూస్ గురించి కొంచెం కొంచెం వివరించడం జరిగింది. ఈ పుస్తకము ద్వారా మీకు ఫోటోషాప్ మీద ఒక అభిప్రాయాన్ని కలుగజేస్తుందని ఆలోచన. ఫోటోషాప్ లో పూర్తి అనుభవం రావడానికి కనీసం ఆరు నెలలు నిరంతరంగా ప్రాక్టీసు చేస్తేనే పూర్తిగా ఫోటోషాప్ ని ఉపయోగించి వర్క్ చేయడం వస్తుంది. ఫోటోషాపులో అనుభవము ఉన్న వారికీ కనీస జీతం పదివేల రూపాయిలు ఉంది.
ఫోటోషాపుని వినియోగించి రంగం లేదనుటలో అతిశయోక్తిలేదు. విజిటింగ్ కార్డ్ దగ్గర నుండి మారేజ్ ఫంక్షన్స్ వీడియో ఎడిటింగ్ వరకు కూడా ఈ ఫోటోషాప్ ని వినియోగిస్తున్నారు. ఫోటోషాప్ అనేది ఫోటోక్రియేషన్ రంగంలో వచ్చిన ఒక అద్భుతమైన మార్పు అని చెప్పవచ్చు.
ఒకప్పుడు ఏదేని సీనరీ ఫోటో కావాలంటే ఎన్నోగంటలు కష్టపడి ఒక సినరీని తీయడం జరిగేది. అలాగే ఒక పాత ఫోటోని కొత్తగా చేయాలంటే మళ్ళీ దానిని ఫోటోతీసి, ప్రింట్ వేసి ఒక ఆర్టిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళి దాని గురించి అతనికి వివరంగా చెబితే అతనికి అర్ధమయిన విధంగా దానిని మార్చి ఇచ్చేవాడు. కాని ఈ ఫోటోషాప్ వచ్చిన తరువాత ఆర్టిస్ట్ లతో గాని, పెయింటర్స్ తో గాని అవసరం తగ్గిపోయింది. ఫోటోషాప్ ని 1985లో Aldus కోర్పోరేషన్ రూపొందించినది. డెస్క్ టాప్ పబ్లిషింగ్ రంగంలో ఇది ఒక అద్భుతమైన సృష్టి అని చెప్పవచ్చు.
ఫోటోషాప్ ను ఉపయోగించి ఎన్నో అద్భుతాలను క్రియేట్ చేయవచ్చు. మనకు కావాల్సిన సీనరీస్ ని మనకు నచ్చిన ఇమేజెస్ నుండి కొంచెం కొంచెం తెచ్చుకొని ఒక అద్భుతమైన సీనరీని క్రియేట్ చేయవచ్చు ఫోటోషాప్ ఉపయోగించి లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్టుగా క్రియేట్ చేయవచ్చు. ఫోటోరంగంలో వినూత్నమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు ఫోటోరంగంలో డిజిటల్ కెమేరాలు ముఖ్యపాత్రను పోషిస్తున్నాయి. డిజిటల్ కెమేరాలోని ఫొటోస్ ని ఈ ఫోటోషాప్ ద్వారా మనకు కావాల్సిన విధంగా మార్పు చేయగలుగుతున్నాము.
ఫోటోషాప్ సాప్ట్ వేర్ ని ఉపయోగించి వివిధ రకాల మారేజస్, ఫంక్షన్స్ కు సంబంధించిన ఫోటో ఆల్ బమ్స్ ని తయారు చేస్తున్నారు. ఒకప్పటి పురాతన కాలం నాటి ఫోటోలను ఈ సాప్ట్ వేర్ ని ఉపయోగించి సరిచేయగలుగుతున్నారు. అంతేకాకుండా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానంతో కలర్ ఫొటోస్ గా కూడా మార్చగలుగుతున్నారు. వీటన్నిటితో పాటుగా ముఖ్యంగా పబ్లికేషన్ రంగంలో వివిధ రకాల కలర్ వర్క్స్ ని, ఇమేజ్ వర్క్ ని చెయ్యడానికి కూడా ఈ ఫోటోషాప్ ఎంతో ఉపకరిస్తుంది.
- సిహెచ్. యు. వి. కరుణాకర్
ఇమేజెస్ ని మనకు కావాల్సిన విధంగా ఎడిట్ చేసుకోవడానికి ఫోటోషాప్ ఉపయోగపడుతుంది. ఫోటోషాప్ సాప్ట్ వేర్ ని ఉపయోగించి రకరకాల ఇమేజస్ ని ఉపయోగించి అనేక రకాల సినరిస్ ని, కొత్త ఇమేజస్ ని మన ఊహకు తగ్గట్టుగా రూపొందించవచ్చు. అంతే కాకుండా మన కలల్లో ఉండే ఊహా చిత్రాలను కూడా సృష్టించవచ్చు. ఈ పుస్తకము క్రొత్తగా నేర్చుకోవాలనుకునే వారికీ ఫోటోషాప్ గురించి ఒక అవగాహన కల్పించడం కొరకు సాధ్యమైనంత సులభమైన పద్ధతిలో వ్రాయడం జరిగింది. దీనిలో దాదాపుగా అన్ని మెనూస్ గురించి కొంచెం కొంచెం వివరించడం జరిగింది. ఈ పుస్తకము ద్వారా మీకు ఫోటోషాప్ మీద ఒక అభిప్రాయాన్ని కలుగజేస్తుందని ఆలోచన. ఫోటోషాప్ లో పూర్తి అనుభవం రావడానికి కనీసం ఆరు నెలలు నిరంతరంగా ప్రాక్టీసు చేస్తేనే పూర్తిగా ఫోటోషాప్ ని ఉపయోగించి వర్క్ చేయడం వస్తుంది. ఫోటోషాపులో అనుభవము ఉన్న వారికీ కనీస జీతం పదివేల రూపాయిలు ఉంది. ఫోటోషాపుని వినియోగించి రంగం లేదనుటలో అతిశయోక్తిలేదు. విజిటింగ్ కార్డ్ దగ్గర నుండి మారేజ్ ఫంక్షన్స్ వీడియో ఎడిటింగ్ వరకు కూడా ఈ ఫోటోషాప్ ని వినియోగిస్తున్నారు. ఫోటోషాప్ అనేది ఫోటోక్రియేషన్ రంగంలో వచ్చిన ఒక అద్భుతమైన మార్పు అని చెప్పవచ్చు. ఒకప్పుడు ఏదేని సీనరీ ఫోటో కావాలంటే ఎన్నోగంటలు కష్టపడి ఒక సినరీని తీయడం జరిగేది. అలాగే ఒక పాత ఫోటోని కొత్తగా చేయాలంటే మళ్ళీ దానిని ఫోటోతీసి, ప్రింట్ వేసి ఒక ఆర్టిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళి దాని గురించి అతనికి వివరంగా చెబితే అతనికి అర్ధమయిన విధంగా దానిని మార్చి ఇచ్చేవాడు. కాని ఈ ఫోటోషాప్ వచ్చిన తరువాత ఆర్టిస్ట్ లతో గాని, పెయింటర్స్ తో గాని అవసరం తగ్గిపోయింది. ఫోటోషాప్ ని 1985లో Aldus కోర్పోరేషన్ రూపొందించినది. డెస్క్ టాప్ పబ్లిషింగ్ రంగంలో ఇది ఒక అద్భుతమైన సృష్టి అని చెప్పవచ్చు. ఫోటోషాప్ ను ఉపయోగించి ఎన్నో అద్భుతాలను క్రియేట్ చేయవచ్చు. మనకు కావాల్సిన సీనరీస్ ని మనకు నచ్చిన ఇమేజెస్ నుండి కొంచెం కొంచెం తెచ్చుకొని ఒక అద్భుతమైన సీనరీని క్రియేట్ చేయవచ్చు ఫోటోషాప్ ఉపయోగించి లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్టుగా క్రియేట్ చేయవచ్చు. ఫోటోరంగంలో వినూత్నమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు ఫోటోరంగంలో డిజిటల్ కెమేరాలు ముఖ్యపాత్రను పోషిస్తున్నాయి. డిజిటల్ కెమేరాలోని ఫొటోస్ ని ఈ ఫోటోషాప్ ద్వారా మనకు కావాల్సిన విధంగా మార్పు చేయగలుగుతున్నాము. ఫోటోషాప్ సాప్ట్ వేర్ ని ఉపయోగించి వివిధ రకాల మారేజస్, ఫంక్షన్స్ కు సంబంధించిన ఫోటో ఆల్ బమ్స్ ని తయారు చేస్తున్నారు. ఒకప్పటి పురాతన కాలం నాటి ఫోటోలను ఈ సాప్ట్ వేర్ ని ఉపయోగించి సరిచేయగలుగుతున్నారు. అంతేకాకుండా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానంతో కలర్ ఫొటోస్ గా కూడా మార్చగలుగుతున్నారు. వీటన్నిటితో పాటుగా ముఖ్యంగా పబ్లికేషన్ రంగంలో వివిధ రకాల కలర్ వర్క్స్ ని, ఇమేజ్ వర్క్ ని చెయ్యడానికి కూడా ఈ ఫోటోషాప్ ఎంతో ఉపకరిస్తుంది. - సిహెచ్. యు. వి. కరుణాకర్
© 2017,www.logili.com All Rights Reserved.