సోమర్ సెట్ మామ్ (1871-1965) గురించి తెలియని ఆంగ్ల సాహిత్య పాటకులు అరుదు. అతను కధ చెప్పే తీరు వింతగా వుంటుంది. తన నవలలో తానూ ఒక పాత్ర ధరిస్తాడు. కధలోని వారితో అతనికి వ్యక్తిగత పరిచయం వుంటుంది. "ది మూన్ అండ్ సిక్స్ పెన్స్", "ది రేజర్స్ ఎడ్జ్"ల్లో కధనం ఇదే తరహాలో వుంటుంది.
తనను గురించి తన పాత్రల అవగాహన, తన పాత్రల గురించి తన విశ్లేషణతో మధ్య మధ్య జీవితాన్ని, సమాజాన్ని గురించి కొన్ని అక్షరసత్యాలు, ఆద్యాత్మిక వ్రుపులతో చదువరుల్ని, రచయిత స్థానానికి కూర్చోబెట్టి చివర వరకు ఉత్కంటతో చదివిస్తాడు తన నవలని.
ఇక విషయానికి వస్తే, ఈ చంద్రుడు అరుపెన్నీల నవలా నాయకుడు నిజ జీవితంలో పాల్ గాగిన్ (1848-1903) అనే ప్రముఖ చిత్రకారుడు - విన్సెంట్ వేంగో సమకాలీనుడు. తన 40 వ ఏట కేవలం చిత్ర కళాతృష్టతో చక్కని భార్య, పిల్లలు, పదిహేడు ఏళ్ళ వివాహ బంధాన్ని కాదని, లండన్ నగరాన్ని వదలి వెళ్ళిపోతాడు. కొన్నాళ్ళు పారిస్, ఆ తర్వాత పసిఫిక్ దక్షిణ సముద్రంలోని తహితీ దీవుల్లో గడిపాడు అంత్యకాలం వరకూ. దుర్భర దారిద్యాన్ని అనుభవిస్తూ, రంగుల కలల్లో విహరిస్తూ, కళాఖండాన్ని సృజించి, పై లోకాల్లోని కళా మ్యూజియాలకు వెళ్ళిపోయాడు.
'కళాకారుడేలా బ్రతికాడో కాదు, దేనికోసం అతను పరితపించాడో ' సమాజం తెలుసుకోవాలి అనే సూత్రం ఈ రచనలో ఇమిడివుంది.
సోమర్ సెట్ మామ్ (1871-1965) గురించి తెలియని ఆంగ్ల సాహిత్య పాటకులు అరుదు. అతను కధ చెప్పే తీరు వింతగా వుంటుంది. తన నవలలో తానూ ఒక పాత్ర ధరిస్తాడు. కధలోని వారితో అతనికి వ్యక్తిగత పరిచయం వుంటుంది. "ది మూన్ అండ్ సిక్స్ పెన్స్", "ది రేజర్స్ ఎడ్జ్"ల్లో కధనం ఇదే తరహాలో వుంటుంది. తనను గురించి తన పాత్రల అవగాహన, తన పాత్రల గురించి తన విశ్లేషణతో మధ్య మధ్య జీవితాన్ని, సమాజాన్ని గురించి కొన్ని అక్షరసత్యాలు, ఆద్యాత్మిక వ్రుపులతో చదువరుల్ని, రచయిత స్థానానికి కూర్చోబెట్టి చివర వరకు ఉత్కంటతో చదివిస్తాడు తన నవలని. ఇక విషయానికి వస్తే, ఈ చంద్రుడు అరుపెన్నీల నవలా నాయకుడు నిజ జీవితంలో పాల్ గాగిన్ (1848-1903) అనే ప్రముఖ చిత్రకారుడు - విన్సెంట్ వేంగో సమకాలీనుడు. తన 40 వ ఏట కేవలం చిత్ర కళాతృష్టతో చక్కని భార్య, పిల్లలు, పదిహేడు ఏళ్ళ వివాహ బంధాన్ని కాదని, లండన్ నగరాన్ని వదలి వెళ్ళిపోతాడు. కొన్నాళ్ళు పారిస్, ఆ తర్వాత పసిఫిక్ దక్షిణ సముద్రంలోని తహితీ దీవుల్లో గడిపాడు అంత్యకాలం వరకూ. దుర్భర దారిద్యాన్ని అనుభవిస్తూ, రంగుల కలల్లో విహరిస్తూ, కళాఖండాన్ని సృజించి, పై లోకాల్లోని కళా మ్యూజియాలకు వెళ్ళిపోయాడు. 'కళాకారుడేలా బ్రతికాడో కాదు, దేనికోసం అతను పరితపించాడో ' సమాజం తెలుసుకోవాలి అనే సూత్రం ఈ రచనలో ఇమిడివుంది.© 2017,www.logili.com All Rights Reserved.