ప్రజల ప్రాణాలమీద గౌరవంలేని విప్లవకారులూ, జనం మెడలకు గుదింబడలుగా మారిన విప్లవ మేధావులూ వున్న నేటి సమాజానికి చేగెవారా అవసరం మరింత పెరిగింది. వ్యక్తిగత, రాజకీయ జీవితాలమధ్య వైరుధ్యాన్ని రద్దు చేసుకునేందుకు,అందివచ్చిన ఆధిపత్యాన్ని స్వచ్ఛందంగా వదలుకునేందుకు జీవితాంతం చేగెవారా పడిన ఘర్షణను రికార్డు చేయడానికి చేసిన ప్రయత్నమే ఈ పుస్తకం.
చిన్నతనం నుంచి ఆస్థమాతో బాధపడే ఎర్నెస్తో అనే చెగెవారాలో కార్యదీక్ష, పట్టుదలతో పాటు సున్నిత మనస్థత్వం వున్నాయి. అందుకే ఇంజనీరింగ్ చదివి మెడిసిన్‌లో చేరాడు. డాక్టర్‌గా వెనిజులా వెళ్లి కుష్ఠురోగుల ఆస్పత్రిలో పనిచేయాలని సంకల్పించాడు. అర్జెంటీనా ఇతర లాటిన్ ఆమెరికా దేశాల్లో రైతుల, ఇండియన్ తెగల జీవన పరిస్థితులను అధ్యయనం చేయడానికి చేసిన పర్యటన, ఆయన ఆలోచనా విధానాన్ని మార్చి వేసింది. లాటిన్ ఆమెరికాలోని స్థానిక ప్రజల మీద అమెరికన్ సామ్రాజ్యవాదులు ఎంతో కాలంగా ఆధిపత్యాన్ని చలాయిస్తున్నారు. ఆ దేశాల రాజకీయ వ్యవస్థ, ఆర్థిక సంపదలను అమెరికా ప్రభుత్వం, సిఐఎ నియంత్రిస్తుంటాయి. వారి అధిపత్యాన్ని స్థానిక ప్రభుత్వాలు ఏమాత్రం వ్యతిరేకించినా వెంటనే ఆ ప్రభుత్వం పతనం కాక తప్పదు. చెరకు పంటకు, చక్కెర ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన క్యూబా మీద ఎంతోకాలంగా అమెరికా సర్వాధికారాలను చలాయిస్తుంటుంది. అనేక లాటిన్ అమెరికన్ దేశాలలో వలెనే క్యూబాలో కూడా అధ్యక్షుడు బతిస్తా అమెరికా చేతిలో కీలుబొమ్మగా వ్యవహరిస్తుంటాడు. ఫిడెల్ కాస్ట్రో అనే యువ న్యాయవాది నాయకత్వంలో కొందరు యువకులు సాయుధ పోరాటానికి సిద్ధమయ్యారు. చెగెవారా వారితో చాతులు కలిపాడు. ఆవిధంగా గెరిల్లా సేనలో ఒక సాధారణ కార్యకర్తగా ప్రవేశించి, కమాండర్ స్థాయికి ఎదిగినా ఎలాంటి ప్రత్యేకతలను, ఎవరికీ లేని సౌకర్యాలను తీసుకోవడానికి నిరాకరించాడు. క్యూబా దేశీయుడు కాకపోయినా, పరాయి దేశం లోని ప్రజల కష్టాలకు స్పందించి వారి విముక్తి కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడిన చెగెవారా దృక్పథం, సార్థరాహిత్యం ఫిడెల్ కాస్ట్రోను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
క్యూబా విప్లవోద్యమంలో కార్యకర్తగా అడుగు పెట్టిన నాటినుంచి బొలీవియాలో హత్యకు గురయ్యేవరకూ అమెరికన్ సామ్రాజ్యవాదం మీద రాజీలేని పోరాటాన్ని సాగించిన విప్లవకారుడు చే. ఆయన రూపకల్పన చేసిన లాటిన్ అమెరికా విముక్తి వ్యూహంలో కీలకమైన అంశం సామ్రాజ్యవాద వ్యతిరేకతే. చెగెవారా మరణించి నాలుగు శతాబ్ధాలు దాటింది. దేశదేశాల విప్లవకారులు, రాజకీయ విశ్లేషకులు ఆయన విప్లవాచరణ గురించి చర్చిస్తూనే వున్నారు. క్యూబా ప్రజల్లోనే కా, అనేక లాటిన్ అమెరికా దేశాల్లో చెగెవారా పోరాట స్ఫూర్తితో చిన్న చిన్న బృదాలుగా యువతరం సంఘటితమవుతూనే వున్నది. భారత దేశంలోని వామపక్షాలు చెగెవారా స్ఫూర్తిని, ఆశయాలను పక్కనపెట్టి తమ అవకాశవాద రాజకీతాలకు అనుగుణంగా ఆయనను వాడుకుంటున్న తీరును రచయిత్రి విమర్శించడం ఆలోచింపజేస్తుంది.
The Soul Of Che Guevera Can Be Seen In one Form Other In Things Like T Shirts, Postures and other ways .. Through Out the Reading of this Book and After the Reading Also The Soul Of Che Guevera Is Haunting Me Every Time.... I Believe Only His Soul Has Made The Author To Write This Book .. Readers To Buy and Read This Book And Make Them Belive That His Soul Will Be With Them, Guide Them, In Every Actions & Thoughts... Long Live "CHE" In our Hearts...
© 2017,www.logili.com All Rights Reserved.