కుందుర్తి గారి వల్ల 'రంజని' తో పరిచయం ఏర్పడింది. ఎన్నో సాహిత్య సాంస్కృతిక సంస్థలు అలా పుట్టి ఇలా మాయమైపోయాయి. కానీ 'రంజని' సంస్థ దినదినాభివృద్ది చెందడం లేదు - క్షణ క్షణాభివృద్ధి చెందుతోంది. ఒకే కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో ఒక సాహితీ సమితి స్థాపించి కవిత్వం, కథ, నాటకం, సంగీతం వంటి అన్ని రంగాలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ సమకాలీనంగా ఎప్పటికప్పుడు మంచుతో తడిసిన మల్లెపువ్వులా ఉండటం ఒక విశేషం. కార్యక్రమాలతో అయింది అనిపించకుండా పోటీలు నిర్వహించడం మరొక విశేషం. అంతటితో ఆగకుండా పుస్తక ప్రచురణల్ని విలువలతో చేపట్టడం ఇంకో విశేషం. రంజని - కుందుర్తి అవార్డుల వచన కవితా ప్రాభవానికి చిహ్నాలు. ఎంత నిష్పక్షపాతంగా ఉంటాయంటే ఒకసారి నేను కవిత పంపితే ఏ బహుమతీ రాలేదు!! వచన కవితల పోటీతో పాటు పద్య కవితల పోటీ నిర్వహించడం విశేషాలలో కెల్లా విశేషం. 'పదిమంది తెలుగు వాళ్ళుంటే రెండు సంస్థలుంటాయి".
"ఆంధ్రానాం అనేకత్వం"
"ఆంధ్రులు ఆరంభశూరులు"
వంటి వాటిని 'ఛీ' కొడుతూన్న రంజనికి సకల కళా రంజనికి అంజలి ఘటిస్తూ "త్రీచీర్స్"!!
కుందుర్తి గారి వల్ల 'రంజని' తో పరిచయం ఏర్పడింది. ఎన్నో సాహిత్య సాంస్కృతిక సంస్థలు అలా పుట్టి ఇలా మాయమైపోయాయి. కానీ 'రంజని' సంస్థ దినదినాభివృద్ది చెందడం లేదు - క్షణ క్షణాభివృద్ధి చెందుతోంది. ఒకే కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో ఒక సాహితీ సమితి స్థాపించి కవిత్వం, కథ, నాటకం, సంగీతం వంటి అన్ని రంగాలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ సమకాలీనంగా ఎప్పటికప్పుడు మంచుతో తడిసిన మల్లెపువ్వులా ఉండటం ఒక విశేషం. కార్యక్రమాలతో అయింది అనిపించకుండా పోటీలు నిర్వహించడం మరొక విశేషం. అంతటితో ఆగకుండా పుస్తక ప్రచురణల్ని విలువలతో చేపట్టడం ఇంకో విశేషం. రంజని - కుందుర్తి అవార్డుల వచన కవితా ప్రాభవానికి చిహ్నాలు. ఎంత నిష్పక్షపాతంగా ఉంటాయంటే ఒకసారి నేను కవిత పంపితే ఏ బహుమతీ రాలేదు!! వచన కవితల పోటీతో పాటు పద్య కవితల పోటీ నిర్వహించడం విశేషాలలో కెల్లా విశేషం. 'పదిమంది తెలుగు వాళ్ళుంటే రెండు సంస్థలుంటాయి". "ఆంధ్రానాం అనేకత్వం" "ఆంధ్రులు ఆరంభశూరులు" వంటి వాటిని 'ఛీ' కొడుతూన్న రంజనికి సకల కళా రంజనికి అంజలి ఘటిస్తూ "త్రీచీర్స్"!!© 2017,www.logili.com All Rights Reserved.