ఒక వ్యక్తీ మేధావిగా ఎదగడానికి ఎలాంటి ప్రభావాలు, పట్టుదల అవసరమో బుజువు చేసే గ్రంథమిది. డా. కె.వి. రమణ శేముషీ సంపన్నుడు. తన రంగంలో నిత్య కృషివలుడు. ప్రభుత్వాధికారిగా ఏ శాఖలో తానున్నా ఆ శాఖకు కీర్తి సంతరించినవాడు. క్రమశిక్షణను, మానవీయతను మేళవించుకొన్న ధీమంతుడు. సంప్రదాయన్ని, ఆధునికతను సమతులంగా జీర్ణించుకున్న జిజ్ఞాసి. రసాయనశాస్త్రంలో స్నాతకోత్తర పట్టా పొంది, రసరమ్యమైన పద్యకవిత్వంలో పిహెచ్.డి. పట్టా సాధించిన చతురవచో నిధి.
ఐ.ఎ.ఎస్. అధికారిగా ఆయన నిజాయితీకి నిలువుటద్దం. పరిపాలన దక్షతను పరాకాష్ట, అధికారదర్పం లేదు, ఆవగింజంతైనా గర్వం లేదు. అందుకే ఆయన అందరికీ ఆప్తుడు. సాంస్కృతిక రంగానికి అభిష్టుడు.
చీకోలు సుందరయ్య (రచయిత గురించి) :
శ్రీ చీకోలు సుందరయ్య వృత్తి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం; ప్రవృత్తి పత్రికలతో అనుబంధం. పత్రికలలో వివిధ శీర్షికలు నిర్వహించారు.
రాజతరంజని, అమ్మ, మా ఊరు, విశ్వకవిత, మంచికధ, నచ్చినకధ, శేషేంద్ర శిఖరం, పాటల పూదోట వేటూరి, స్వర్ణ రంజని వంటి సంకలనాలకు సంపాదకుడు.
ఒక వ్యక్తీ మేధావిగా ఎదగడానికి ఎలాంటి ప్రభావాలు, పట్టుదల అవసరమో బుజువు చేసే గ్రంథమిది. డా. కె.వి. రమణ శేముషీ సంపన్నుడు. తన రంగంలో నిత్య కృషివలుడు. ప్రభుత్వాధికారిగా ఏ శాఖలో తానున్నా ఆ శాఖకు కీర్తి సంతరించినవాడు. క్రమశిక్షణను, మానవీయతను మేళవించుకొన్న ధీమంతుడు. సంప్రదాయన్ని, ఆధునికతను సమతులంగా జీర్ణించుకున్న జిజ్ఞాసి. రసాయనశాస్త్రంలో స్నాతకోత్తర పట్టా పొంది, రసరమ్యమైన పద్యకవిత్వంలో పిహెచ్.డి. పట్టా సాధించిన చతురవచో నిధి. ఐ.ఎ.ఎస్. అధికారిగా ఆయన నిజాయితీకి నిలువుటద్దం. పరిపాలన దక్షతను పరాకాష్ట, అధికారదర్పం లేదు, ఆవగింజంతైనా గర్వం లేదు. అందుకే ఆయన అందరికీ ఆప్తుడు. సాంస్కృతిక రంగానికి అభిష్టుడు. చీకోలు సుందరయ్య (రచయిత గురించి) : శ్రీ చీకోలు సుందరయ్య వృత్తి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం; ప్రవృత్తి పత్రికలతో అనుబంధం. పత్రికలలో వివిధ శీర్షికలు నిర్వహించారు. రాజతరంజని, అమ్మ, మా ఊరు, విశ్వకవిత, మంచికధ, నచ్చినకధ, శేషేంద్ర శిఖరం, పాటల పూదోట వేటూరి, స్వర్ణ రంజని వంటి సంకలనాలకు సంపాదకుడు.nice i like it
© 2017,www.logili.com All Rights Reserved.