గై డి మొపాస ప్రపంచ ప్రసిద్ధ రచయిత ఆధునిక చిన్న కథల సాహిత్యానికి ఆద్యుడు. ప్రపంచ సాహిత్యంలో కథ రచన అనగానే ముందుగా గుర్తొచ్చే పేర్లలో మొపాస పేరొకటి. వస్తువు శిల్పము విషయంలో సోమర్ సెట్ మామ్ కి ఓ హెన్రికి కూడా మార్గదర్శకుడిగా అతడు కీర్తి సంపాదించాడు. అసామాన్యుమైన సునీత దృష్టితో మానవ నైజం లోని అన్ని పార్శ్వాలు స్పృశిస్తూ అద్భుతమైన సాహిత్య సృష్టి చేసాడు. అందులో వాస్తవికావదం కాల్పనికవాదం రెండు కలిసున్నాయి. అతని కథలని చిన్న చిన్న మార్పులతో చాలామంది ఆనతి నుంచి ఈనాటి వరకు అనుకరిస్తూనే ఉన్నారు. మనోవిశ్లేషాణాత్మకత శైలి మొపాస రచనల్లో కనిపించే సహజలక్షణం. లియో టాల్ స్టాయ్ కళ గురించి రాసిన వ్యాసాలలో మొపాస సాహిత్యం లోని కళాత్మకత ఆవిష్కరించాడు. " అతని వచన రచన కొన్ని సందర్భాలలో పద్య రచనని మించిన కల్పనా శక్తితో సందర్భానికి తగట్టుగా ఉంటూ దానికి విలువని జోడిస్తుందాని" అయన ప్రశంసించాడు. వివిధ మరు పేర్లతో విస్తృతంగా మొపాస రచనలు చేసాడు. ఏకాంతాన్ని ఎక్కువగా ఇష్టపడేవాడు. చిరుద్యోగిగా రచనావ్యాసంగం ప్రారంభించి వెన్వ్oటనే విపరీతమైన ఆదరణ పొందాడు. పదేళ్ల కాలంలో వేగంగా మొపాస 300 కథలు ఆరు నవలలు మూడు యాత్రాసాహిత్య పుస్తకాలూ ఒక కవిత సంపుటి రాసాడు.
- బెందాళం కృష్ణారావు