ఈ 'తీరకవిత'లో ఎంతమంది కవులు స్వాప్నికులో, సృజనశీలురో, గత, వర్తమాన, భావిష్యత్తుల మధ్య వారధి నిర్మించేవారో పాఠకులు గ్రహించగలరు! రాయడం మొదలెట్టిన వారి నుంచీ పరిణితి పొందినవారి వరకు అన్ని రకాల, అన్ని భావజాలాల, అన్ని శైలీ విన్యాసాల వారు ఇందులో ఉన్నారు. మిత్రులు ఆచార్య ననుమాస స్వామి, కె ప్రభాకర్, నేను 2013 మే 9,10,11 మూడు రోజులు చెన్నైలో, తిరుపతిలో ఏర్పాటైన కవిసమ్మేళనాల్లో పాల్గొన్నాం.
ఈ కవి సమ్మేళనాలలో పాల్గొన్న కవులు ఉక్తిలోనూ, అభివ్యక్తీలోనూ ఒక నూతన ఒరవడి సృష్టించారు. పాత పద్యం, కొత్త వచనం, కథాగేయాలు సెలయేరులా జాలువారాయి. కవులంతా భాషాభిమానాన్ని చాటుకోవడమే గాడు వారి కవితావేషం సహృదయాలను తాకుతుంది. వాటినన్నింటినీ ఒడిసిపట్టి 'తీర కవితలు'గా రూపొందించామంటే కవి సమ్మేళనాలని సజీవ పరుస్తున్నామన్న మాటే కదా.
ఈ 'తీరకవిత'లో ఎంతమంది కవులు స్వాప్నికులో, సృజనశీలురో, గత, వర్తమాన, భావిష్యత్తుల మధ్య వారధి నిర్మించేవారో పాఠకులు గ్రహించగలరు! రాయడం మొదలెట్టిన వారి నుంచీ పరిణితి పొందినవారి వరకు అన్ని రకాల, అన్ని భావజాలాల, అన్ని శైలీ విన్యాసాల వారు ఇందులో ఉన్నారు. మిత్రులు ఆచార్య ననుమాస స్వామి, కె ప్రభాకర్, నేను 2013 మే 9,10,11 మూడు రోజులు చెన్నైలో, తిరుపతిలో ఏర్పాటైన కవిసమ్మేళనాల్లో పాల్గొన్నాం. ఈ కవి సమ్మేళనాలలో పాల్గొన్న కవులు ఉక్తిలోనూ, అభివ్యక్తీలోనూ ఒక నూతన ఒరవడి సృష్టించారు. పాత పద్యం, కొత్త వచనం, కథాగేయాలు సెలయేరులా జాలువారాయి. కవులంతా భాషాభిమానాన్ని చాటుకోవడమే గాడు వారి కవితావేషం సహృదయాలను తాకుతుంది. వాటినన్నింటినీ ఒడిసిపట్టి 'తీర కవితలు'గా రూపొందించామంటే కవి సమ్మేళనాలని సజీవ పరుస్తున్నామన్న మాటే కదా.
© 2017,www.logili.com All Rights Reserved.