జీవితాన్ని అద్భుతంగా చిత్రించగలిగిన నవలా ప్రక్రియలోకీ దళిత సాహిత్యోద్యమం ప్రవేశించకపోవడం ఇన్నాళ్లూ ఒక వెలితిగానే ఉండింది. నిజానికి దళిత జీవితంలోని వైవిధ్యం, కళాత్మక, ఆర్ధిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో దళితులు అనుభవిస్తున్న దోపిడీ పిడనల ప్రత్యేక రూపాలు నవలా ప్రక్రియకు విశిష్టమైన ముడిసరుకుగా పని చేస్తాయి.
అయితే దళిత సాహిత్యోద్యమం ఆ అద్భుతమైన ముడిసరుకును ఉపయోగించి సృజనాత్మక, కాల్పనిక ప్రక్రియలుగా అనువదించలేకపోయింది. ఆ పని జరిగేలోగానే వాద వివాదాలలో, చీలికలలో పడి జీవన సంక్లిష్టతను సమగ్రంగా ఆకళించుకోగల కుదురును రచయితలకు అందించలేని స్థితి నెలకొంది.
ఈ అన్ని కారణాల వల్ల చిలుకూరి దేవపుత్ర నవల పంచమం తెలుగు నవలా చరిత్రలోనూ, దళిత జీవిత చిత్రణ చేసిన సృజనాత్మక కళారూపాలలోనూ ప్రధానమైన స్థానాన్ని ఆక్రమిస్తుంది. నూటా ఇరవై ఏళ్ల తెలుగు నవలా చరిత్రలో వస్తు వైవిధ్యంలో సంక్లిష్ట సామజిక సంచలనాలకు అద్దం పట్టడంలో, వ్యక్తీ జీవితానికి మధ్య ఉన్న సంబంధాన్ని సరిగ్గా వ్యక్తీకరించడంలో పంచమం అగ్ర స్థానంలో నిలుస్తుంది.
- ఎన్. వేణుగోపాల్
తల్లాప్రగడవారి 'హేలావతి' నవల నుండి ఈనాటి వరకూ దళిత జీవితాన్ని చిత్రిస్తూ అనేక నవలలూ, కధలూ వచ్చాయి. దళితుడిగా పుట్టి, దళితాన్ని జీవించి, ఆ బాధలోంచి, ఆవేదనలోంచి, ఆ అనుభవంలోంచి ఆవిష్కరించిన దళిత జీవన పరిణామమే 'పంచమం' నవల. దళిత జీవితం ఎంత సంఘర్షణకు లోనవుతుందో ప్రతి చిన్న కదలికతో సహా పట్టి మనకు అందించారు దేవపుత్ర.
- కలేకూరి ప్రసాద్
జీవితాన్ని అద్భుతంగా చిత్రించగలిగిన నవలా ప్రక్రియలోకీ దళిత సాహిత్యోద్యమం ప్రవేశించకపోవడం ఇన్నాళ్లూ ఒక వెలితిగానే ఉండింది. నిజానికి దళిత జీవితంలోని వైవిధ్యం, కళాత్మక, ఆర్ధిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో దళితులు అనుభవిస్తున్న దోపిడీ పిడనల ప్రత్యేక రూపాలు నవలా ప్రక్రియకు విశిష్టమైన ముడిసరుకుగా పని చేస్తాయి. అయితే దళిత సాహిత్యోద్యమం ఆ అద్భుతమైన ముడిసరుకును ఉపయోగించి సృజనాత్మక, కాల్పనిక ప్రక్రియలుగా అనువదించలేకపోయింది. ఆ పని జరిగేలోగానే వాద వివాదాలలో, చీలికలలో పడి జీవన సంక్లిష్టతను సమగ్రంగా ఆకళించుకోగల కుదురును రచయితలకు అందించలేని స్థితి నెలకొంది. ఈ అన్ని కారణాల వల్ల చిలుకూరి దేవపుత్ర నవల పంచమం తెలుగు నవలా చరిత్రలోనూ, దళిత జీవిత చిత్రణ చేసిన సృజనాత్మక కళారూపాలలోనూ ప్రధానమైన స్థానాన్ని ఆక్రమిస్తుంది. నూటా ఇరవై ఏళ్ల తెలుగు నవలా చరిత్రలో వస్తు వైవిధ్యంలో సంక్లిష్ట సామజిక సంచలనాలకు అద్దం పట్టడంలో, వ్యక్తీ జీవితానికి మధ్య ఉన్న సంబంధాన్ని సరిగ్గా వ్యక్తీకరించడంలో పంచమం అగ్ర స్థానంలో నిలుస్తుంది. - ఎన్. వేణుగోపాల్ తల్లాప్రగడవారి 'హేలావతి' నవల నుండి ఈనాటి వరకూ దళిత జీవితాన్ని చిత్రిస్తూ అనేక నవలలూ, కధలూ వచ్చాయి. దళితుడిగా పుట్టి, దళితాన్ని జీవించి, ఆ బాధలోంచి, ఆవేదనలోంచి, ఆ అనుభవంలోంచి ఆవిష్కరించిన దళిత జీవన పరిణామమే 'పంచమం' నవల. దళిత జీవితం ఎంత సంఘర్షణకు లోనవుతుందో ప్రతి చిన్న కదలికతో సహా పట్టి మనకు అందించారు దేవపుత్ర. - కలేకూరి ప్రసాద్© 2017,www.logili.com All Rights Reserved.