పొలిసువారు విద్యుక్త ధర్మమునందు నేర నివారణ చర్యలు తిసుకోవటము చాలా ముఖ్యమైనది. ఈ పుస్తకము చదివినచో ప్రతి పొలిసు అధికారిగా నేర నివారణకు సంబంధించిన ప్రతి విషయము క్షుణ్ణంగా అర్ధమవుతుంది. అంతేకాకుండా వివిధ రకాలైన నేర నివారణ చర్యలు కూడా తెలుస్తాయి. ఏయే చట్టాలయందు వీటిని పొందుపర్చినారు అనే విషయము కూడా బోధపడుతుంది. వీటిలో ముఖ్యమైన సత్ప్రవర్తన, పబ్లిక్ న్యూసెన్స్ నివారణ, నిషేధపు ఉత్తర్వులు, బహిష్కరణ మరియు నిర్బంధ ఉత్తర్వులకు సంబంధించిన నమూనాలు చాలా ఉపయోగపడతాయి. పట్టదగిన నేరాల నివారణకై పొలిసువారు తమంతట తామే చేపట్టే చర్యలకు సంబంధించిన అరెస్టుతో సహా గల వివిధ అధికారములను కూడా చాలా వివరంగా పొందుపరిచినారు.
ఈ పుస్తకము పొలిసు అధికారులు అనగా, కానిస్టేబుల్ నుండి పై అధికారుల వరకు వారు తమ తమ విధుల నిర్వహణలో నేర నివారణకై తాము చేపట్టే చర్యలకు ఎంతో సహాయకారిగా వుంటుంది అని భావిస్తున్నాను. లాయర్లకు మరియు రాజకీయ నాయకులకు, సామాన్య ప్రజలకు కూడా సులభముగా అర్ధమయ్యే విధంగా వ్రాసినారు.
మా పొలిసు డిపార్ట్మెంట్ లో ఇలాంటి వ్యక్తీ పొలిసు అకాడమీలో న్యాయ శాస్త్ర అధ్యాపకుడు గా పని చేస్తూ పొలిసు అధికారుల చేత విద్యాభ్యాసం చేయిస్తూ ఉండటము మాకెంతో గర్వకారణముగా ఉన్నది.
ఈ గ్రంథకర్త పట్టుదల, శ్రమ, కృషిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ రచయిత చేతులమీదుగా మరెన్నో ఇటువంటి పుస్తకములు రావాలని ఆశిస్తూ...
- ఎమ్.మహేందర్ రెడ్డి, ఐపిఎస్,
అడిషనల్ డి.జి.పి. మరియు
చీఫ్ ఆఫ్ ఇంటలిజెన్స్ డిపార్ట్ మెంట్, ఆంధ్రప్రదేశ్
పొలిసువారు విద్యుక్త ధర్మమునందు నేర నివారణ చర్యలు తిసుకోవటము చాలా ముఖ్యమైనది. ఈ పుస్తకము చదివినచో ప్రతి పొలిసు అధికారిగా నేర నివారణకు సంబంధించిన ప్రతి విషయము క్షుణ్ణంగా అర్ధమవుతుంది. అంతేకాకుండా వివిధ రకాలైన నేర నివారణ చర్యలు కూడా తెలుస్తాయి. ఏయే చట్టాలయందు వీటిని పొందుపర్చినారు అనే విషయము కూడా బోధపడుతుంది. వీటిలో ముఖ్యమైన సత్ప్రవర్తన, పబ్లిక్ న్యూసెన్స్ నివారణ, నిషేధపు ఉత్తర్వులు, బహిష్కరణ మరియు నిర్బంధ ఉత్తర్వులకు సంబంధించిన నమూనాలు చాలా ఉపయోగపడతాయి. పట్టదగిన నేరాల నివారణకై పొలిసువారు తమంతట తామే చేపట్టే చర్యలకు సంబంధించిన అరెస్టుతో సహా గల వివిధ అధికారములను కూడా చాలా వివరంగా పొందుపరిచినారు. ఈ పుస్తకము పొలిసు అధికారులు అనగా, కానిస్టేబుల్ నుండి పై అధికారుల వరకు వారు తమ తమ విధుల నిర్వహణలో నేర నివారణకై తాము చేపట్టే చర్యలకు ఎంతో సహాయకారిగా వుంటుంది అని భావిస్తున్నాను. లాయర్లకు మరియు రాజకీయ నాయకులకు, సామాన్య ప్రజలకు కూడా సులభముగా అర్ధమయ్యే విధంగా వ్రాసినారు. మా పొలిసు డిపార్ట్మెంట్ లో ఇలాంటి వ్యక్తీ పొలిసు అకాడమీలో న్యాయ శాస్త్ర అధ్యాపకుడు గా పని చేస్తూ పొలిసు అధికారుల చేత విద్యాభ్యాసం చేయిస్తూ ఉండటము మాకెంతో గర్వకారణముగా ఉన్నది. ఈ గ్రంథకర్త పట్టుదల, శ్రమ, కృషిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ రచయిత చేతులమీదుగా మరెన్నో ఇటువంటి పుస్తకములు రావాలని ఆశిస్తూ... - ఎమ్.మహేందర్ రెడ్డి, ఐపిఎస్, అడిషనల్ డి.జి.పి. మరియు చీఫ్ ఆఫ్ ఇంటలిజెన్స్ డిపార్ట్ మెంట్, ఆంధ్రప్రదేశ్© 2017,www.logili.com All Rights Reserved.