ఈ కథల సంపుటికి ఒక ప్రత్యేకత ఉంది. 'ఇల్లు - వాకిలి' కథ మూడు తరాల జీవితాలు, కాలం తెచ్చిన పరిణామాలను చిత్రించిన కథ. తెలంగాణ ప్రజలు ఎలా, ఎందుకు వెనుకబడిపోతూ వచ్చారో జగిత్యాల నుండి హైదరాబాదు వచ్చి స్థిరపడడానికి మూడు తరాలు ఎందుకు ఆలస్యమైందో... తెలుపుతుంది. అందుకు సీమాంధ్ర వారి ఆధిపత్యం, ఉద్యోగాల ఆక్రమణ, ప్రణాళికలపై, వనరులపై వారి ఆధిపత్యం కొనసాగడం ఎలా కారణమో, తద్వారా తెలంగాణవారి జీవితాలు కొడిగట్టిపోయి రెండు, మూడు తరాలు ఎందుకు వెనుకబడిపోయాయో అనే చరిత్ర నేపథ్యాన్ని చిత్రించిన కథ. ఈ కథ తెలంగాణ రాష్ట్రం యొక్క 'ఇల్లు - వాకిలి' చరిత్ర పరిణామాలను చిత్రించిన కథ.
మొత్తంగా ఈ సంపుటిలోని కథలు 1970 నుండి 2015 దాకా సాగిన తెలంగాణ సామాజిక పరిణామాలను, ఆయా సామాజిక వర్గాల ఉత్తాన, పతనాలను, ఉద్యమ తీరుతెన్నులను, ఒక ప్రత్యేక ప్రాపంచిక ద్రుక్పథంతో చిత్రించాయి. బి ఎస్ రాములుగారు తత్వవేత్తగా కాకుండా, ఉద్యమకారుడిగా కాకుండా ఈ కథలు రాయడం సాధ్యం కాదు. స్వీయ అనుభవాలను, స్వీయ మానసిక ద్రుష్టితో కాకుండా, సామాజిక పరిణామాల చరిత్ర నిక్షిప్తం చేయడానికి కథను ఒక ప్రక్రియగా స్వీకరించి రాసిన కథలు ఇవి. అందువల్ల ఇవి మామూలు కథలు కావు. కేతు విశ్వనాథరెడ్డి, బోయ జంగయ్య, కాలువ మల్లయ్య తదితరులు ఈ కథలు తెలంగాణ సామాజిక చరిత్రను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే గొప్ప కథలు.
ఈ కథల సంపుటికి ఒక ప్రత్యేకత ఉంది. 'ఇల్లు - వాకిలి' కథ మూడు తరాల జీవితాలు, కాలం తెచ్చిన పరిణామాలను చిత్రించిన కథ. తెలంగాణ ప్రజలు ఎలా, ఎందుకు వెనుకబడిపోతూ వచ్చారో జగిత్యాల నుండి హైదరాబాదు వచ్చి స్థిరపడడానికి మూడు తరాలు ఎందుకు ఆలస్యమైందో... తెలుపుతుంది. అందుకు సీమాంధ్ర వారి ఆధిపత్యం, ఉద్యోగాల ఆక్రమణ, ప్రణాళికలపై, వనరులపై వారి ఆధిపత్యం కొనసాగడం ఎలా కారణమో, తద్వారా తెలంగాణవారి జీవితాలు కొడిగట్టిపోయి రెండు, మూడు తరాలు ఎందుకు వెనుకబడిపోయాయో అనే చరిత్ర నేపథ్యాన్ని చిత్రించిన కథ. ఈ కథ తెలంగాణ రాష్ట్రం యొక్క 'ఇల్లు - వాకిలి' చరిత్ర పరిణామాలను చిత్రించిన కథ. మొత్తంగా ఈ సంపుటిలోని కథలు 1970 నుండి 2015 దాకా సాగిన తెలంగాణ సామాజిక పరిణామాలను, ఆయా సామాజిక వర్గాల ఉత్తాన, పతనాలను, ఉద్యమ తీరుతెన్నులను, ఒక ప్రత్యేక ప్రాపంచిక ద్రుక్పథంతో చిత్రించాయి. బి ఎస్ రాములుగారు తత్వవేత్తగా కాకుండా, ఉద్యమకారుడిగా కాకుండా ఈ కథలు రాయడం సాధ్యం కాదు. స్వీయ అనుభవాలను, స్వీయ మానసిక ద్రుష్టితో కాకుండా, సామాజిక పరిణామాల చరిత్ర నిక్షిప్తం చేయడానికి కథను ఒక ప్రక్రియగా స్వీకరించి రాసిన కథలు ఇవి. అందువల్ల ఇవి మామూలు కథలు కావు. కేతు విశ్వనాథరెడ్డి, బోయ జంగయ్య, కాలువ మల్లయ్య తదితరులు ఈ కథలు తెలంగాణ సామాజిక చరిత్రను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే గొప్ప కథలు.
© 2017,www.logili.com All Rights Reserved.