ఎంబ్రాయిడరీ అనేది ఒక అద్భుతమైన హస్త కళ. మనకున్న ఆరు లలితకళలతోటి సరిసమానంగా కళావిష్కరణ చేయగల గొప్ప దనం ఎంబ్రాయిడరీ వుంది. శిల్ప ఎలా అయితే కఠీన శిలలను తన శిల్పచాతుర్యంతో మనోహరమైన దేవతా, సౌందర్య శిల్పాలుగా మలుస్తాడో, అలాగే నిర్జీవమైన దారపువుండలు నిపుణులైన ఎంబ్రాయిడరీ చేసేవారి కరాంగుళుల చిత్రవిచిత్రమైన వంపులతో అల్లిబిల్లిగా, అల్లికలుగా సాగి సుందరమైన లతలు, పుష్పాలు, ప్రకృతి దృశ్యాలుగా వస్త్రాల మీద సాక్షాత్కరిస్తాయి.
ఎన్నో గంటలు శ్రమించిన అల్లిన స్వెట్టర్ పాపాయికి తొడిగి మురిసిపోతుంది తల్లి. కమనీయమైన లతలతో అల్లిన శాలువను వయసుమళ్ళిన తల్లికి కానుకగా యిచ్చి సంతోషపడుతుందో కూతురు. తన పేరు అందంగా ఎంబ్రాయిడరీ చేసి ప్రియుడికీ తీపి జ్ఞాపికగా యిస్తుందో ప్రియురాలు... ఆ ప్రియుడి ఆనందానికి హద్దే వుండదు. ఇలా పొందే మధురానుభూతులు బజారులో కొన్న వస్తువుల్ని వాడుకుంటే వస్తుందా?
కళారాధాన అంటే ఇదే! కళకున్న విలువను డబ్బుతోనూ, బజారు సరుకుతోనూ వెలకట్టలేమూ, సరిపోల్చలేమూను. అలంటి మరో కళే ఎంబ్రాయిడరీ కూడా!
తీరిక వేళలను కళాసాధనకు మళ్ళించండి తీయని అనుభూతులను ఎంబ్రాయిడరీ అల్లికలతో సొంతం చేసుకోండి.
నవ నాగరిక ప్రపంచాన్ని ఆశ్చర్యానందాలతో ముంచి తేల్చగల అద్భుతమైన కళ ఎంబ్రాయిడరీ. స్త్రీ జాతిని అమితంగా ఆకర్షించే పనుల్లో ఎంబ్రాయిడరీ ఒకటి. మహిళలకు కాలక్షేపంతో బాటు, కళాపోషణనీ, యింకా శ్రద్ధవహిస్తే ఆదాయాన్ని కూడా సంపాదించి పెట్టగల చక్కని వ్యాపకం ఎంబ్రాయిడరీ. ఇల్లు కదలకుండా తగుమాత్రం నైపుణ్యం, శ్రద్ధ కనబర్చగల వాళ్ళు ఎవ్వరైనా ఈ ఎంబ్రాయిడరీ సునాయాసంగా నేర్చుకోవచ్చు.
ఎలాంటి ఎంబ్రాయిడరీ అయినా కొన్ని భిన్నమైన అల్లికల ద్వారా కుడతారు. స్వరాలు ఏడే అయినా వేలవేల రాగాలు వాటి నుండి పుట్టినట్లు ఈ కుట్లలో రకాలు కొన్నే అయినా, వాటిని ఆధారంగా చేసుకొని వేల వేల డిజైన్లను అల్లుకోవచ్చు.
ఇప్పుడు ఎలాంటి ఎంబ్రాయిడరీ అయినా సర్వసాధారణంగా కుట్టే వివిధ రకాల కుట్లను బొమ్మలతో సహా వివరంగా యిస్తున్నారు. వీటి సహాయంతో ఎలాంటి ఎంబ్రాయిడరీ అయినా సులభంగా అల్లుకోవచ్చు.
సుజాత సూర్యదేవర(రచయిత గురించి) :
తమిళనాడు చెన్నైలోని ఎగ్మోర్ జన్మస్థలం. కామర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్. జీవితాన్ని మలుపు తిప్పిన మరో కోణం కిల్పాక్ ఫ్యాషన్ డిజైనింగ్ పట్టా, అద్భుత కళా నైపుణ్యం, కళాత్మకమైన అనుసృజన, నిత్యనూతన డిజైన్ల రూపకల్పన నిత్యకృత్యాలు.
వస్త్ర సముదయల్ని అభిమంత్రించి ఫ్యాషన్ డిజైన్ డ్రస్సులుగా పునఃసృష్టి ప్రాణం కన్నామిన్నగా భావించే కళాహృదయి. ఫ్యాషన్ పిచ్చిలో అమెరికా మొదలైన పలు యూరప్ దేశాలు విస్తృతంగా పర్యటించి ఆధునిక పాశ్చాత్య ఫ్యాషన్ రీతులను లోతుగా అధ్యయనం చేసి వచ్చిన కళాపిపాసి
కొన్ని వేల ఫ్యాషన్ డిజైన్ లు ఈమె డ్రాయింగ్ రూమ్ లో ప్రాణం పోసుకుంటూ వుంటాయి.ఈమె భిన్న రకాల మనుషులు, మరెన్నో తరగతులకు చెందిన అందరినీ మెప్పించి మన్నలందుకుంటున్న అపార అనుభవ సుధానిధి.
- సుజాత సూర్యదేవర
ఎంబ్రాయిడరీ అనేది ఒక అద్భుతమైన హస్త కళ. మనకున్న ఆరు లలితకళలతోటి సరిసమానంగా కళావిష్కరణ చేయగల గొప్ప దనం ఎంబ్రాయిడరీ వుంది. శిల్ప ఎలా అయితే కఠీన శిలలను తన శిల్పచాతుర్యంతో మనోహరమైన దేవతా, సౌందర్య శిల్పాలుగా మలుస్తాడో, అలాగే నిర్జీవమైన దారపువుండలు నిపుణులైన ఎంబ్రాయిడరీ చేసేవారి కరాంగుళుల చిత్రవిచిత్రమైన వంపులతో అల్లిబిల్లిగా, అల్లికలుగా సాగి సుందరమైన లతలు, పుష్పాలు, ప్రకృతి దృశ్యాలుగా వస్త్రాల మీద సాక్షాత్కరిస్తాయి. ఎన్నో గంటలు శ్రమించిన అల్లిన స్వెట్టర్ పాపాయికి తొడిగి మురిసిపోతుంది తల్లి. కమనీయమైన లతలతో అల్లిన శాలువను వయసుమళ్ళిన తల్లికి కానుకగా యిచ్చి సంతోషపడుతుందో కూతురు. తన పేరు అందంగా ఎంబ్రాయిడరీ చేసి ప్రియుడికీ తీపి జ్ఞాపికగా యిస్తుందో ప్రియురాలు... ఆ ప్రియుడి ఆనందానికి హద్దే వుండదు. ఇలా పొందే మధురానుభూతులు బజారులో కొన్న వస్తువుల్ని వాడుకుంటే వస్తుందా? కళారాధాన అంటే ఇదే! కళకున్న విలువను డబ్బుతోనూ, బజారు సరుకుతోనూ వెలకట్టలేమూ, సరిపోల్చలేమూను. అలంటి మరో కళే ఎంబ్రాయిడరీ కూడా! తీరిక వేళలను కళాసాధనకు మళ్ళించండి తీయని అనుభూతులను ఎంబ్రాయిడరీ అల్లికలతో సొంతం చేసుకోండి. నవ నాగరిక ప్రపంచాన్ని ఆశ్చర్యానందాలతో ముంచి తేల్చగల అద్భుతమైన కళ ఎంబ్రాయిడరీ. స్త్రీ జాతిని అమితంగా ఆకర్షించే పనుల్లో ఎంబ్రాయిడరీ ఒకటి. మహిళలకు కాలక్షేపంతో బాటు, కళాపోషణనీ, యింకా శ్రద్ధవహిస్తే ఆదాయాన్ని కూడా సంపాదించి పెట్టగల చక్కని వ్యాపకం ఎంబ్రాయిడరీ. ఇల్లు కదలకుండా తగుమాత్రం నైపుణ్యం, శ్రద్ధ కనబర్చగల వాళ్ళు ఎవ్వరైనా ఈ ఎంబ్రాయిడరీ సునాయాసంగా నేర్చుకోవచ్చు. ఎలాంటి ఎంబ్రాయిడరీ అయినా కొన్ని భిన్నమైన అల్లికల ద్వారా కుడతారు. స్వరాలు ఏడే అయినా వేలవేల రాగాలు వాటి నుండి పుట్టినట్లు ఈ కుట్లలో రకాలు కొన్నే అయినా, వాటిని ఆధారంగా చేసుకొని వేల వేల డిజైన్లను అల్లుకోవచ్చు. ఇప్పుడు ఎలాంటి ఎంబ్రాయిడరీ అయినా సర్వసాధారణంగా కుట్టే వివిధ రకాల కుట్లను బొమ్మలతో సహా వివరంగా యిస్తున్నారు. వీటి సహాయంతో ఎలాంటి ఎంబ్రాయిడరీ అయినా సులభంగా అల్లుకోవచ్చు. సుజాత సూర్యదేవర(రచయిత గురించి) : తమిళనాడు చెన్నైలోని ఎగ్మోర్ జన్మస్థలం. కామర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్. జీవితాన్ని మలుపు తిప్పిన మరో కోణం కిల్పాక్ ఫ్యాషన్ డిజైనింగ్ పట్టా, అద్భుత కళా నైపుణ్యం, కళాత్మకమైన అనుసృజన, నిత్యనూతన డిజైన్ల రూపకల్పన నిత్యకృత్యాలు. వస్త్ర సముదయల్ని అభిమంత్రించి ఫ్యాషన్ డిజైన్ డ్రస్సులుగా పునఃసృష్టి ప్రాణం కన్నామిన్నగా భావించే కళాహృదయి. ఫ్యాషన్ పిచ్చిలో అమెరికా మొదలైన పలు యూరప్ దేశాలు విస్తృతంగా పర్యటించి ఆధునిక పాశ్చాత్య ఫ్యాషన్ రీతులను లోతుగా అధ్యయనం చేసి వచ్చిన కళాపిపాసి కొన్ని వేల ఫ్యాషన్ డిజైన్ లు ఈమె డ్రాయింగ్ రూమ్ లో ప్రాణం పోసుకుంటూ వుంటాయి.ఈమె భిన్న రకాల మనుషులు, మరెన్నో తరగతులకు చెందిన అందరినీ మెప్పించి మన్నలందుకుంటున్న అపార అనుభవ సుధానిధి. - సుజాత సూర్యదేవర
© 2017,www.logili.com All Rights Reserved.