అమ్మ, ఈ రెండక్షరాల వెనుక ఒక కుటుంబం వుంది. ఒక జీవితం ఉంది. ఒక ప్రపంచం ఉంది. మా చిన్నతనం అంతా జగ్గాపురం అనే పల్లెటూరులో గడిచింది. నా పేరు రవిచంద్ర, మా తమ్ముడి పేరు శ్యామసుందర్. మాది ఉమ్మడి కుటుంబం. 30 మంది వరకు పిల్లలూ పెద్దలూ కలసి ఉండేవాళ్ళం. అసూయలూ, ద్వేషాలూ అంటే మాకు తెలియదు. ఉదయాన్నే మా ఇంటి ముందుగా వెళ్లే ఎర్ర బస్ ను మా ఇంట్లో పిల్లందరం కలసి పరుగెత్తుకొంటూ వెళ్ళి చూసేవాళ్ళం. ఎవ్వళ్ళూ అభ్యంతరం పెట్టని పల్లెటూరి పద్ధతి. ఎవరింటికి చుట్టాలొచ్చినా కనుక్కొని వాళ్ళకంటే ముందే వెళ్ళి వాళ్ళ ఇంట్లో చెప్పేవాళ్ళం. మాతో పాటు మా ఊరి స్నేహితులు కూడా కలిసేవాళ్ళనుకోండి. ఇక ఊర్లోకి ఏ పెద్దమనిషి, ఏ గవర్నమేంట్ ఆఫీసర్ ఎవరొచ్చినా మా ఇంట్లోనే ఆతిథ్యం వుండేది. ఆ రోజుల్లో మెస్ లు, హోటళ్ళు, మా పల్లెలో లేవు. వచ్చిన ప్రతివాళ్ళతో ఎలా మెలగాలో ఎదుటివారిని ఎలా గౌరవించాలో మా అమ్మ నాకు నేర్పింది. ఈ రోజు మనం మాట్లాడుకొనే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆ రోజుల్లో మా అమ్మ ముఖతా మేము విన్నాం. ఎదుటివారికి ఇవ్వటంలో ఉన్న ఆనందం చిన్నతనంలోనే రుచి చూపించింది మా అమ్మ.
- సి. సుజాత